అంతా ఇంతే అనుకున్నదంతా
ఒక భ్రమగా నిలిచినప్పుడు
అనూహ్యమైన ఓ అంతఃస్పర్శ
ఒక కొత్త తలుపు తెరచినట్టు
లోలోపలే గుచ్చుకునే ఓ స్మృతి
కదలని శిలగా నిలిపిన కాలాన్ని
కమ్మనికల ఒకటి నిదురగా ప్రవహింపజేసినట్టు
నైరాశ్యపు నీడన
ఎంతకీ ఎదగని ఒక చిన్నారి ఆశ
ప్రేమై చుట్టిన చేతుల గూటిలో
వటవృక్షమై విస్తరించినట్టు
జీవితం ఒక ప్రహేళికై
ఎదురు నిలిచినపుడు
నిశ్శబ్దమైపోయిన ఆకాశంలో
ఒక వేకువ
వెలుగై నిలిచినట్టు…