మౌనగీతి

ఆ కొండకొమ్మున నిలబడ్డ
దిగులు మేఘం
కురవబోయిన ప్రతిక్షణం
గుండె అలజడిగా, అనామకంగా…

హత్తుకుని ఓదార్చలేని ప్రేమ
కన్నీరు తుడవలేని స్పర్శ
తనివితీరా మాట కాలేని మౌనం
నన్ను నిలదీస్తూ, ఏకాంతంగా…

వేదన తొడిగిన వసంతమూ
ఆశలు రాలిన శిశిరమే
జీవితంలో
సహనాన్ని శోధిస్తూ, నిరంతరంగా…