ఈమాట మార్చి 2010 సంచికలో మీకోసం
- సంపాదకీయం: ఇటీవల చెలరేగిన ద్రౌపది నవల వివాదంలో సాహితీవేత్తల విమర్శా పద్ధతిని సమీక్షిస్తూ వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం – ఇతిహాసాలూ, ప్రబంధాలూ.
- కవితలు: అంధకారం– గరిమెళ్ళ నారాయణ; తెలగాణెము – తిరుమల కృష్ణదేశికాచార్యులు; తడిస్తే కదా తెలిసేది – ఏం.వి.వి.ఎన్. సౌమ్య.
- కథలు: ఓ బుజ్జి కుక్క పిల్ల – సాయి బ్రహ్మానందం గొర్తి
- శీర్షికలు: నాకు నచ్చిన పద్యం లో హరిశ్చంద్ర కాటి సీను పద్యాల గురించి చీమలమర్రి బృందావనరావు; సామాన్యుని స్వగతం లో టెలిఫోన్తో తన అనుభవాలను పంచుకుంటూ వింధ్యవాసిని.
- వ్యాసాలు: జయదేవుని అష్టపది “సా విరహే తవదీనా” గురించి ఆడియో, వీడియో, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలతో జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి ల వ్యాసం; కాల్పనిక సాహిత్యంలో మేధకి చోటులేదంటూ కనకప్రసాద్ చేస్తున్న వాదనలో రెండవ భాగం గుండుగొమ్ములనుమానం 2; డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (D.T.L.C) వారు జరిపిన శ్రీశ్రీ, కొ.కు., గోపీచంద్ శతజయంతి సభలో గోపీచంద్ “అసమర్థుని జీవయాత్ర” నవల గురించి చేసిన ప్రసంగాల పాఠాలు: అసమర్థుని జీవయాత్రేనా – మాధవ్ మాచవరం; అసమర్థుని జీవయాత్రే – మద్దిపాటి కృష్ణారావు.
- సమీక్షలు: అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంథం – వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించిన ఈ బృహత్సంకలనంపై విమర్శనాత్మక సమీక్ష – వేలూరి వేంకటేశ్వర రావు
ఈమాట సాహితీ గ్రంథాలయంలో కొత్త పుస్తకం:”చిత్రలేఖ“. భగవతీ చరణ వర్మ హిందీ మూలానికి తిరుమల కృష్ణదేశికాచార్యుల తెలుగు సేత . ఈ అనువాదం “ప్రసన్న భారతి”లో ధారావాహికగా ప్రచురింపబడింది.
ప్రతీవారూ ఒక్క కథ అయినా చక్కగా చెప్పగలరని ఒక నానుడి. ఈ మధ్య కాలంలో కొత్త రచయితలనుంచి కథలు రావడం కొంచెం తగ్గింది. కారణాలేమైనా, ఈమాట పాఠకుల్లోనే ఎంతోమంది చక్కగా రాయగలిగినవారు ఉన్నారు. వారంతా కూడా ఉత్సాహంగా రచనా వ్యాసంగాన్ని అలవర్చుకొని ఈమాటకు కథలు రాయాలనీ, వారి ఎరుకలో ఉన్న ఔత్సాహిక రచయితలను ఈమాటకు రాయమని ప్రోత్సహించాలనీ మా కోరిక. దయచేసి ప్రయత్నించండి.
ఎప్పటిలాగానే, మీ ఆశీస్సులూ, విమర్శలూ మాకందచేస్తారని ఆశిస్తూ…
ఈమాట సంపాదకులు.