రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఈమాట మే 2008 సంచిక విడుదల

రచన: సంపాదకులు
మే 2008

ఈమాట మే 2008 సంచిక విడుదల! ఈ సంచికలో అనేక విశేషాలున్నాయి.

ఈమాట సంపాదక వర్గంలో కొత్త సభ్యులు

మాచవరం మాధవ్ అజ్ఞాతంగా కవి, విమర్శకుడు. SCIT రోజులనించీ తెలుగు చర్చావేదికలలో పాల్గొంటున్నారు. రచ్చబండ మోడరేటరు గా చిరపరిచితులు. లోగడ సమీక్షకుడిగా ఈమాటకి ఎంతో సహకరించారు. జియోకెమిస్టుగా ఉద్యోగం, కుటుంబంతో నివాసం సిన్సినాటి, ఒహాయో లో. శంకగిరి నారాయణ స్వామి నాశీగా, కొత్తపాళీగా, బ్లాగరుగా, కథా రచయితగా, నాట్య కళాకారుడిగా ఈమాట పాఠక లోకానికి పరిచితులు. ఉద్యోగ రీత్యా మెకానికల్ ఇంజనీరు, నివాసం బ్లూంఫీల్డ్ హిల్స్, మిషిగన్‌లో.

వీరిద్దరూ ఈమాటసంపాదకవర్గంలో చేరడంతో ఈమాట మరింత పటిష్టం అవుతుందని వేరే చెప్పనవసరంలేదు. ఈమాట వీరిద్దరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది.

ప్రత్యేక ఆకర్షణలు


Courtesy:The Hindu

  • ఏప్రిల్ 20, 2008 న సీ.పీ. బ్రౌన్ అకాడెమి వారు ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికి మొట్టమొదటి “తెలుగు భారతి” పురస్కారం బహూకరించిన సందర్భంగా కృష్ణమూర్తిగారి గురించి ఒక ప్రశంసా వ్యాసం,
  • మే 02, 2008 న ప్రముఖ సినీ దర్శకుడు సత్యజిత్ రాయ్ 87 వ జయంతి. ఆయనకు నివాళిగా రాయ్ తీసిన సినిమా “చారులత“ని పరిచయం చేసే వ్యాసం,
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు వ్యాస పరంపరలో మూడో వ్యాసం బాబేజ్ యంత్రాలు,
  • తెలుగు కళా సమితి వెలువరించే “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో బహుమతి పొందిన కవితలు.
  • ఇంకా మరెన్నో కథలు, కవితలు, వ్యాసాలు, ఇతర శీర్షికలు..

ఈమాట కొత్త లోగో, మొదటిపేజీకి కొత్త రూపు

ఈ సంచికనించీ ఈమాటకొక కొత్త లోగో, మొదటి పేజీ(ముఖ పత్రం) కొక కొత్తరూపం ప్రవేశపెడుతున్నాం. ఇప్పుడు మొదటిపేజీలో పైన మూడు ట్యాబులు ఉన్నాయి. మధ్య ట్యాబులో ఇటీవలి అభిప్రాయాలు చదవవచ్చు. చివరి ట్యాబులో ఈమాట పాత సంచికలనించి ఒక యాదృఛ్చిక రచన చూడవచ్చు. అదే ట్యాబులో కింద ఉన్న “మరో యాదృచ్ఛిక రచన” లింకుని నొక్కితే వెంటనే మరొక యాదృచ్ఛిక రచన ప్రత్యక్షమవుతుంది. ఈ యాదృచ్ఛిక రచనలకొక ఆర్.యెస్.యెస్. ఫీడ్ (RSS Feed) ని కూడా ఇస్తున్నాము. ఈమాట బొత్తాం, యాదృచ్ఛిక రచనల ఆర్.యెస్.యెస్. ఫీడ్‌లను తమ బ్లాగుల్లో ప్రదర్శించదల్చుకున్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు.

రచయితలకి, అభిప్రాయాలు రాసేవారికి సూచనలు

ఈమాటకి రచనలు పంపగోరే వారు “రచయితలకు సూచనల పేజీ” ని చూడమని మా మనవి. రచయితలు తమ రచనలని పత్రిక విడుదల తేదీకి కనీసం పది రోజుల ముందుగా పంపాలి. రచయితలు తమ రచన(ల)తో పాటు తమ వివరాలు, ఫోటో కూడా పంపవచ్చు.
పాఠకులు తమ అభిప్రాయాలు RTS, లేదా తెలుగులిపిలోనే రాయమని మా మనవి. తమ అభిప్రాయాలని “రచన బావుంది/బావులేదు” లాంటి ఒకటి రెండు మాటలతో కాకుండా నిర్మాణాత్మకంగా రాయమని కోరుతున్నాము.

ఈ సంచిక తయారుచేయడంలో సాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఎప్పటిలాగే ఈ సంచిక కూడా మీ ఆదరణ పొందుతుందని ఆశిస్తాము.

— సంపాదకులు.

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    chavakiran May 3, 2008 6:00 pm

    లోగోలో బొమ్మ బాగుంది. కానీ ఫాంట్ మాత్రం మరీ పాత కాలం చందమామ ఫాంటులా ఉన్నది. వేమన?

    బై డిజైన్ అయితే పర్వాలేదు, కాకుంటే ఇంకేమన్నా జలక్ ఇచ్చే ఫాంట్ ట్రై చెయ్యాల్సింది 🙂

  2. 2
    విష్ణుభొట్ల లక్ష్మన్న May 5, 2008 7:05 am

    ఈమాట సంపాదక వర్గంలో చేరిన మాచవరం మాధవ్ గారికి, శంకగిరి నారాయణ స్వామి గారికి అభినందనలు.

    మీ చేరికతో ఈమాట సంపాదక వర్గం బలపడింది.

    లక్ష్మన్న

  3. 3
    వాసు.బొజ్జ May 15, 2008 5:20 am

    నాకు ఈమాట కొత్త రూపం పసిబిడ్డ నవ్వులా,హరివిల్లులా,పాపి కొండల దగ్గరి గోదావరిలా,వేటూరి గీతం,బాలు జానకి పాడినట్టుగా తియ్య తియ్యగా వుంది.కొత్త సంపాదక వర్గానికి,రచయితలకు అభినందనలు. చావా కిరణ్ గారన్నట్టు ఇంకొక అందమయిన ఫాంట్ వాడి చూడండి.ఈ మధ్య చాల బ్లాగులు, వెబ్ సైట్లు ఈ మాట సౌజన్యముతో నేరుగా వారి వెబ్ సైట్ లోనే తెలుగులో వ్రాసుకునే సౌకర్యం కలిపించినందుకు,తెలుగు బాషాభివ్రుద్దికి పాటు పడుతున్నందుకు మిమ్మల్నందరిని అభినందిస్తూ..

  4. 4
    వాసు.బొజ్జ May 18, 2008 10:57 pm

    నాదొక చిన్న సూచన:
    1. ఈ మాట “లోగో”కి “మొదటి పేజ్”(Home page) లింకు ఇవ్వండి
    (ఇప్పుడు చాల వెబ్ సైట్లు హోమ్ పేజీ లింకు బదులు లోగోకి లింకు ఇస్తున్నాయి).
    2: సెర్చ్ బటన్ మీద ఇంగ్లీష్ బదులు “వెతుకు లేదా వెతకండి అని ఉంచండి.
    3.ఈ మాట లోగోలో ఉన్న మొదటి పెద్ద ఈ అక్షరములో ఉన్న పెన్ను అనుకుంటా సరిగా లేదు.
    4. లోగో క్రింద ఉన్న ఆకుపచ్చ గీత క్రింద ప్రసుతం చూస్తున్న పేజీ తో పాటు వెనకటి పేజీల లింకులు ఇస్తే చాల ఉపయోగకరంగా ఉంటుంది.
    నేను చూసిన చాల తెలుగు (ఇంగ్లీష్ కూడా) వెబ్ పత్రికలు ఇంత విపులంగా, ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దలేదు.ప్రకటనలు ఏమి లేకుండా ఇంత అందంగా పత్రికను నడుపుతున్నందుకు మీకు మరొక్క సారి అభినందనలు.

  5. 5
    ప్రవీణ్ గార్లపాటి May 31, 2008 1:30 am

    ఈ మాట కొత్త లోగో బాగుంది.

    కానీ లోగో ఫ్లాష్‌లో అవసరం లేదనిపిస్తుంది. నెమ్మదిగా లోడవుతుంది. ఆనిమేషను లాంటివి లేనప్పుడు పీఎన్జీ లేదా జేపెగ్ ఫార్మాట్లలో ఉన్న బొమ్మని వాడితే సరిపోతుంది.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఈమాట జనవరి 2008 సంచిక విడుదల
  • శిలాలోలిత : విషయ సూచిక
  • జనవరి 2007 సంచిక విడుదల
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • సెప్టెంబర్ 2006 సంచిక విడుదల

ఇటువంటివే…

  1. ఈమాట జులై 2008 సంచిక విడుదల!
  2. ఈమాట జనవరి 2008 సంచిక విడుదల
  3. ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక
  4. ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల
  5. ఈమాట నవంబర్ 2007 సంచిక విడుదల

మే 2008 సంచికలో ...

  • భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
  • 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం
  • అంతర్మథనం
  • అక్షరం పరమం పదం
  • అటో యిటో
  • అమ్మ
  • అలిగితివా…
  • ఈమాట మే 2008 సంచిక విడుదల
  • ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు
  • కథ ఇదనీ, నిజమిదనీ…
  • గుర్రాలు – గుగ్గిళ్ళు, మరో సారి…
  • గ్రంథచౌర్యం గురించి …
  • చివరకు మిగిలేది
  • జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2
  • డాలర్ దేహాన్నొదిలి
  • తెలుగు కావ్యపురుషుడి కథ
  • నన్నయ హంసగీతికలు
  • నాకు నచ్చిన పద్యం: ధూర్జటి చంద్రబింబపు వర్ణన
  • నీటి అద్దాలు
  • పేరు గలవాడేను మనిషోయ్
  • పేరులేదు
  • బుడగ
  • బ్రహ్మ జ్ఞానం
  • మదర్స్ డే
  • లింకన్ తో ఓ రాత్రి
  • సడిచేయకే గాలి
  • హిందోళ రాగం – అనుబంధం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

తెలుగు కావ్యపురుషుడి కథ
వ్యవహారిక భాషా ఉద్యమంపై ఈమాట ప్రత్యేక సంచిక

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.