పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. కచ్చేరీ గురించి v.srinivasa rao అభిప్రాయం:

    05/01/2023 8:43 pm

    కచ్చేరీ కనుల ముందు నిలిపేరు, చిన్నపాటి కదలికలతొ సహా, ధన్యవాదాలు సర్.

  2. స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:

    05/01/2023 1:10 pm

    2010లో శాయి రాచకొండ ప్రోద్బలంతో ఈ శ్యామ్‌యానా అనే పేరిట మెడికో శ్యామ్ కథలు ప్రచురిద్దాం అనుకున్నప్పుడే అసలు వీటిని కథలు అనాలా, రచనలు అనాలా – మనం ఏమీ అనక్కర లేదు, పాఠకులు వారికి తోచినది వారే అనేసుకుంటారులే అనుకున్నా. మొత్తానికి మెడికో శ్యామ్ కథలు అనే నిర్ణయించాం. ఇప్పుడు మీరు వాటిని కూలంకషంగా విశ్లేషించడం చాలా ఆనందంగా ఉంది. అందుకు మీకూ, మీ వ్యాసాన్ని ప్రచురించిన ఈమాట వారికీ ధన్యవాదాలు. ప్రతుల కోసం మీరు చివర ఇచ్చిన మా ఇమైల్ చిరునామా vangurifoundation@gmail.com గా సరిదిద్దుకోమని పాఠకులని కోరుతున్నాను.

    అమెరికాలో ఆ గ్రంధం ప్రతులకి ఈ క్రింది ఇమైల్‌లో కానీ, వాట్సప్‌లో కానీ సంప్రదించండి. భారత దేశంలో దొరికే చోటు: అచ్చంగాతెలుగు.

    భవదీయుడు,

    వంగూరి చిట్టెన్ రాజు
    వాట్సప్: 1 832 594 9054
    vangurifoundation@gmail.com

  3. సోల్జర్ చెప్పిన కథలు: బాటిల్ పెరేడ్ గురించి Pathakudu అభిప్రాయం:

    05/01/2023 8:58 am

    చిన్న పిల్లాడెవరో వజ్రాల బస్తాని తన్నేసి విరజిమ్మేసినట్లు నల్లని ఆకాశం నిండా మిలమిలా మెరుస్తున్నాయి నక్షత్రాలు – Great Poetic expression! kudos!

  4. అహం మిగిల్చేది గురించి Rama Rao అభిప్రాయం:

    04/30/2023 12:51 am

    మీ భావ కవిత “అహం మిగిల్చేది” చాల బాగుంది. అభినందనలు.

  5. వెంపరాల వారి సాహిత్య యాత్ర గురించి తటవర్తి రాజగోపబాలం ‌‌ అభిప్రాయం:

    04/29/2023 7:37 pm

    మురళి గారు. నమస్తే.

    సుమారు నలబై ఏళ్ళ క్రితం నేను మహామహులు శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారిని కాకినాడలో వారింటికి వెళ్లి దర్శనం చేసికొని ఒకగంటసేపు వారి సలహాలను (అప్పుడు నేను Ph.D కోసం చేస్తున్న యస్వి.జోగారావుగారి ప్రసన్న కుసుమాయుధ‌‌‌ కావ్యం గురించి) సూచనలను వినిన మహద్భాగ్యాన్ని పొందినాను.జనని భారతీదేవిని కనులార గాంచిన దివ్యానుభూతి అది.

    ఇప్పుడు మీరు పంపిన ఈ లంకెవలన వారి మాటలలో వారి సాహిత్య స్వీయచరిత్రను వినే భాగ్యం కలిగింది. ఎంత కఠోరపరిశ్రమ, ఎంత తపస్సు చేశారో! ఇట్టి మహానుభావుల అవిశ్రాంతతపఃఫలాలనే నాలాంటి వారం ఆస్వాదిస్తున్నాం. వారల ఋణం తీరేది, తీర్చగలిగేదీ కాదు.

    శతాధిక కృతజ్ఞతలతో
    రాజగోపబాలం 🙏

  6. సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు గురించి Rajendra Prasad Maheswaram అభిప్రాయం:

    04/27/2023 9:23 pm

    తెలుగునాట అటు రంగస్థలం లోనూ ఇటు సినిమాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాయించకున్న విలక్షణ నటుడు వీరు. ఈ తరం వారికి వారిని గురించి పరిచయం చేయటం వారు పాడిన పద్యాలు పాటలు పరిచయం చేయటం నిజంగా ఒక గొప్ప పని. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. 🙏👏

  7. పురూరవ గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    04/27/2023 10:38 am

    ఇన్ వాలిడ్ యూ.ఆర్.ఎల్. అని వస్తోంది. పురూరవ నాటకం పి.డి.ఎఫ్ కోసం ఏదైనా లింక్ ఉంటే పెట్టండి దయచేసి!

    అసౌకర్యానికి చింతిస్తున్నాం. పిడిఎఫ్ లింకు ఇప్పుడు సరి చేశాం. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి.

  8. సా విరహే తవ దీనా గురించి Sai Brahmanandam అభిప్రాయం:

    04/25/2023 11:53 pm

    దర్బారు, కానడ, దర్బారి కానడ రాగాల్లో నిర్వహించిన సినిమా పాటల కార్యక్రమం.
    తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమా పాటల కూర్పు. సంగీతం ఇష్టమున్న వారు వింటారని:

  9. పురూరవ గురించి Angara Venkata Satya Gopala Swamy అభిప్రాయం:

    04/25/2023 10:30 am

    ఇన్ వాలిడ్ యూ.ఆర్.ఎల్. అని వస్తోంది. పురూరవ నాటకం పి.డి.ఎఫ్ కోసం ఏదైనా లింక్ ఉంటే పెట్టండి దయచేసి!

  10. హలాల్‌ గురించి G S BADRI NATH అభిప్రాయం:

    04/21/2023 9:03 am

    చక్కని భాష. మానవ స్వభావం, కడప ప్రజల సంస్కృతి సొగసుగా ఉలితో చెక్కడం షరీఫ్ గారి స్వంతం.