పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. హలాల్‌ గురించి వేంపల్లె షరీఫ్ అభిప్రాయం:

    04/11/2023 4:25 pm

    కథను ప్రచురించిన నిర్వాహకులకు, కథపై ఇక్కడ స్పందించిన మిత్రులకు… ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పైన Jeevan Raj గారు చెప్పిన అభిప్రాయంతో ఏకీభావం ఉంది. థాంక్యూ.

  2. హలాల్‌ గురించి సిద్దూ టంగుటూరు అభిప్రాయం:

    04/11/2023 12:17 pm

    అద్భుతం కథ. హిందు ముస్లిం.

  3. హలాల్‌ గురించి R.ప్రతాప్ రెడ్డి అభిప్రాయం:

    04/10/2023 10:21 pm

    దినేక్క కథ బలేగుంది అబ్బీ. పల్లె వాతావరణంలో బంధాలకు విలువ ఇచ్చే వాళ్ళే కానీ కులం మతం అని కొట్టుకు సావరు. పొరపచ్చాలు లేని ఇలాంటి స్నేహితులు పల్లెలోనే కనబడతారు ఆబ్బి. ఈ టౌన్లో ఇలాంటి స్నేహితులు అరుదుగా ఉంటారు.

  4. ఊహల ఊట – 23 గురించి చాగంటి ప్రసాద్ అభిప్రాయం:

    04/10/2023 4:12 am

    దసరా బొమ్మల కొలువు సంబరాన్ని ఇంత వివరంగా వ్రాయగా నేనెక్కడా చదవలేదు. పండగ పరమార్ధంతో పాటు పిల్లల సంబరం గురువు పిల్లల అనుబంధాలు తెలుస్తుంది. మన దసరా పండగ గేయంలో విజయమనగరంలో రాజులున్నా, దసరా నాడు మటుకు ప్రతీ ఇంట్లో అంబారి మీద రాజు, దేవుడు ఇద్దరూ ఉంటారు.

    చిన్నపిల్లల మనస్తత్వం అరమరికలు లేని జీవితం ఊహా కథనం గొప్పదనం. ఇంట్లో సర్దుబాటులు పిల్లల ఊహాశక్తిని పెంచుతాయి. పెద్దయ్యకా ఒబ్బిడి తెలుస్తుంది. సంప్రదాయాల్ని వడపోసిన జ్ఞానం అందరికి తెలవాలనే ఈ ఊహల ఊట రచన ఎందరికో పాతజ్ఞాపకాలను తొడినట్టు అనిపిస్తుంది. హేట్స్ ఆఫ్ తులసి గారు. మీ జ్ఞాపక శక్తికి.

  5. ఊహల ఊట – 23 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    04/10/2023 12:32 am

    ఆనాటి దసరా బొమ్మల కొలువుల విశేషాలు కళ్ళకి కట్టినట్లు రాశారు. ఏదయా మీదయా మా మీద లేదు అంటూ రాగయుక్తంగా పాడే దసరా పాటలలో బాల్యాన్ని గుర్తు చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూనే నేటి తరానికి ఓ చురక మెరుపు అందించడం చాలా బాగుంది. కళావరింగ్ అసలు పేరు ‘సరిదే లక్ష్మీ నరసమ్మ’ అని ఇంతవరకు తెలియదు.

    దసరా సందడితో విజయనగర వీధులు ఇప్పించిన తులసిగారికి అభినందన వందనాలు

  6. హలాల్‌ గురించి Jeevan Raj అభిప్రాయం:

    04/09/2023 11:00 am

    Very Good theme. Well written. Ending is good but could have been symbolic/ suggestive instead of the dailogue.

  7. హలాల్‌ గురించి Sreenivas Bandaa అభిప్రాయం:

    04/09/2023 2:28 am

    దేవుని దగ్గర మన స్నేగితం మాత్రం హలాల్‌ అయిండాది.” కథ ప్రాణం మొత్తం ఈ పదాల్లో ఇమిడ్చిన తీరు ఎంతో బాగుంది. అభినందనలు షరీఫ్ గారూ!

  8. గ్రేడింగ్ అమ్మలు గురించి గుమ్మడిదల రంగారావు అభిప్రాయం:

    04/08/2023 11:44 am

    క్లుప్తంగానైనా బాగా వ్రాసారు హనుమంతరావు గారూ పొగాకు గ్రేడింగు గురించి. శైలిలో పెద్దిబొట్ల సుబ్బరామయ్యగారి స్పూర్తి కనిపించింది. అభినందనలు.

  9. హలాల్‌ గురించి అరుణ్ కుమార్ ఆలూరి అభిప్రాయం:

    04/06/2023 12:19 am

    స్వచ్ఛమైన మనుషుల మధ్య స్నేహానికి ఏ పద్ధతులూ అడ్డుగోడలుగా నిలబడబోవని మరోమారు కథ ద్వారా సరళంగా తెలిపిన వేంపల్లె షరీఫ్ గారికి శుభాభినందనలు.

  10. ఇద్దరు దుర్మార్గులు గురించి చాలా బాగా రాసారు.. అభినందనలు.. పొర్ల వేణుగోపాల రావు అభిప్రాయం:

    04/06/2023 12:18 am

    కథ చాలా బాగుంది. వర్ణన కంటే విశ్లేషణ కు ప్రాధాన్యతనిచ్చి, పాత్రల సంభాషణల ద్వారా మనస్తత్వాలను అర్థం చేయించే ప్రయత్నం చేశారు. అభినందనలు.