చేయి తిరిగిన మగ్గం నేత పనివాడు సున్నితంగా జరీ పోగుల్ని చీరల్లో నేసినట్టు తన కథల్లో బ్రతుకుని గురించీ, మనుషుల గురించీ సున్నితమైన, నిగూఢమైన భాష్యాలు చేశారాయన.
శారద
- పూర్తిపేరు
- శారద
- సొంత ఊరు
- హైదరాబాద్
- ప్రస్తుత నివాసం
- బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
- సొంత వెబ్ సైటు
- https://neelambari.blog/
జీవిత విశేషాలు
బ్రిస్బేన్ నగరంలో నివసించే శారదగారు తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు. “నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటీ వెలువరించారు. త్వరలో రాబోతున్న “విజ్ఞాన శాస్త్రంలో వనితలు” అనే పుస్తకంలో ప్రపంచంలోని మహిళా శాస్త్రవేత్తలను పరిచయం చేస్తున్నారు. కథా రచనతో పాటు సంగీతం వీరికి చాలా ప్రియమైన వ్యాపకం. వీరి బ్లాగు రచనలు https://neelambari.blog/ లో చదవొచ్చు.