ఈ పద్యానికి మీ విశ్లేషణ చాలా బాగుంది. తిక్కన సోమయాజి రచించిన పద్యం పూర్తి తెలుగులో ఉంది. చదవగానే అర్థం అయిపోతుంది. నర్తనశాల సినిమాలో ఈ పద్యాన్ని ఉపయోగించి ఘంటశాల మాష్టారు గానం అద్ధుతంగా చేసేరు. సంగీత కర్త హిందోళ రాగం జతకూరిస్తే, రామారావు గారు నటన మరువలేనిది. ఈ పద్యంలో దుర్యోధనుడు ఓడిపోయి ఏమేమి కోల్పోతాడో ఎగతాలి చేస్తూ చదివిన పద్యం ఎంతవిన్నా తనివితీరదు. మంచి వివరణ ఇచ్చిన మీకు ధన్యవాదాలు, సార్ ..
చెన్నైలోని మెరీనాబీచ్ వద్ద కణ్ణగి శిల చూసినా తమిళ పంచకావ్యాలలో ఒకటిగా ప్రస్తుతించబడుతున్న ఇళంగోవడిగళ్ రచించిన సిలప్పదికారం కావ్యం తెలియదు. కణ్ణగి కోపానలనంలో పాండ్య దేశ రాజు నెడుంజెళియన్ గతించాడు. తన ఇంటి వాకిట కళ్ళనీళ్ళు పెట్టుకున్న కవి పెద్దయ్యన శాపపు మరక తన కుటుంబాన్నికి అంటుకోకుండా చెట్టిగారి భార్య చెట్టమ్మ తన కుటుంబాన్ని ధర్మ విపత్తునుండి కాపాడి ధర్మం నిలబడేలా చేసింది.
ఏడాదిలో నూరు పుస్తకాలు రాసిచ్చిన కవి పెద్దయ్యనకి రాయల్టీ డబ్బులు ఇవ్వటానికి నిరాకరించిన చెట్టి.. ఆ డబ్బుల్ని నమ్ముకుని కూతురికి పెళ్ళిపెట్టుకున్నాను అన్నా కరగని చెట్టి… చెదిరిపోతున్న చీరతో, విరబోసుకున్న జుట్టుతో స్వయంగా గుడిలోని అమ్మోరుతల్లిలా లేచిన చెట్టిగారి భార్య చెట్టమ్మ నేరుగా అంగటి ముందు వెళ్ళి కవిగారి బాకీ పైసాతో సహా చెల్లించేలా చేసిన చెట్టమ్మ.
కన్యాకుమారికి దగ్గరగా, ప్రకృతి మాత చేత దీవి౦చబడి నాగరాజ దేవాలయం (సర్ప దేవత గుడి) పేరిట తూర్పు, పశ్చిమ కనుమల సంస్కృతుల మేళవింపుగా వెలసిన నాగర్ కోయిల్ చూసినా జయమోహన్ గారి సాహిత్యం చదవలెదు… ఆ అదృష్టం కలిగించిన అవినేని భాస్కర్ కి
దక్షిణభారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కుంభకోణం… సారంగపాణి (విష్ణువు) దేవాలయం చాలా ప్రాశస్త్యం,,, అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలు చూసిన అనుభూతులు…
తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉన్న తిరువారూర్ కావేరీ నదీ తీరం లోని త్యాగరాజ స్వామి వారి సమాధి ముందు మోకరిల్లిన సృతులు జ్నప్తికి తెచ్చిన అవినేని భాస్కర్ కి మరోసారి రుణగ్రస్తుడినవుతున్నా
ఇంటిని పాలించేది ధర్మపత్ని; దేశపాలనకు ధర్మం … అప్పుడర్థం అయింది మాటంటే ఏంటని! మాట – కచ్చితంగా అది పార్థుడి బాణమే! జయమోహన్ – అవినేని భాస్కర్ సంధించిన “ధర్మం” బాణం పాఠకుల గుండెల్లో చాన్నాళ్లు గుర్తుండిపోతుంది.
కథ అద్భుతంగా ఉంది. ఈ వొక్క మాటా సరిపోదుగానీ, కథ కలిగించిన తృప్తిలో ఇంకేమీ తోచడం లేదు. అవినేని భాస్కర్ గారు, ప్రస్తుతం తెలుగు అనువాద సాహిత్యంలో ప్రసరిస్తున్న ఒక సువర్ణ కిరణం.
No genuine discussion on art. ( and on Damerla Rama Rao garu ?! )
That part of the work is left to be completed by Dr. Lyla Yerneni garu.
” పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా! ” అంటూ దామెర్ల రామారావు గారికి తనవంతు నీరాజనాలు అర్పించిన తల్లావజ్ఝుల శివాజీ గారికి నెనర్లు. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలను ఉపయోగించుకుని, దామెర్లవారి చిత్రాలు అతి భారీ సైజులో పుస్తకాలుగా ముద్రించడం, పెద్ద పెద్ద సైజు కేలండర్‌లుగా ప్రచురించడం గురించి శివాజి గారు ఇచ్చిన సలహా ఆచరణయోగ్యంగా ఉంది. మిసిమి పత్రిక / కళాజ్యోతి ప్రెస్సు బాపయ్య గారి చెవిన వెయ్యాలి. ( శివాజి గారు సదూకున్నది ఒంగోలు లో, మావు సదూకున్నది ఎనకపడ్డ పెకాశం జిల్లా లోని కనిగిరి లో… అవీ మా భవబంధాలు ).
అట్టానే భారతీయ నాంప్రదాయ చిత్రలేఖనంలో అద్భుతాలు సంధించిన కొండపల్లి ( మన కామ్రేడ్ సీతారావయ్య కాదు ) కొండపల్లి శేషగిరి రావు గారి గురించీ తలపోయాలని ఉంది.
రాజా రవివర్మ, విన్సెంత్ వ్యాన్ గో ల మీద అద్బుతమైన పుస్తకాలు రాసిన తెలుగు జర్నలిస్ట్ పి. మోహన్ గారికి దామెర్ల రామారావు గురించీ రాయాలని ఉంది. అందుకు ప్రముఖ సాహిత్యవేత్త, చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారు ( రాజమండ్రీ, దామెర్ల రామారావు గార్ల మీద ఎంతో అభిమానం ఉన్న ) లాంటి వారు సాయం తీసుకోనున్నారు.
మిసిమి మాస పత్రిక ద్వారా తెనాలి ఆలపాటి రవీంద్రనాథ్ గారు వారి వారసులు వారి వంతు కృషి వారు చేస్తున్నారు. కానీ Ground level లో చెయ్యాల్సిన వాటికి ఇక్కడి పెద్దలు, ప్రభుత్వ్య పెద్దలు నడుము కట్టేలా చెయ్యాలి.
ఆంధ్రా ప్యారీస్ తెనాలి అని జబ్బలు చరుసుకుంటాము కానీ ఆర్ట్ కు సంబంధించినంత వరకు ఇక్కడ ప్యారీస్ , లండన్, అమెరికాల్లో ఉన్న సౌకర్యాలు యీడ యాడున్నాయి తల్లా ?
~ ఇట్లు, కె.కె. రామయ్య ( ఓ నేలక్లాసు ప్రేక్షకుడు )
పొద్దున్నే, ‘మీ ఇంటి అడ్రస్ కు ఉత్తరాలు పంపితే తిరిగి వస్తున్నాయి, మీ సమాచారం అప్డేట్ చెయ్యమన్న’ – ఒక ఇండో-అమెరికన్ వైద్యుని ఈ-మెయిల్ చూసుకుని, ఇల్లూ వాకిలి లేని శివుణ్ణి నవ్విన మీ పద్యాలు గుర్తొచ్చి, మళ్లీ చదివి నవ్వుతూ రాస్తున్నాను.
మా నాన్నగారు ఏ ఊళ్లో ఎక్కడున్నారో, ఎలాగొలా తను ఆరా తీసి కనుక్కుని, – ఆయనను వెంటనే ఇంటికి తిరిగిరమ్మని, నాకు ఆయనపై బెంగగా ఉందని – నాతో నా చిన్నతనంలో ఉత్తరాలు వ్రాయించేది మా అమ్మ.
బెజవాడ నుండి సత్యవతి గారు, ఇలాటి గాథలే రాసి ఉంటారు. అందరినీ తన ఇంట్లో పర్మనెంటుగా తెచ్చిపెట్టుకుని, తను మాత్రం చుట్టంలాగా అప్పుడప్పుడూ విజిట్ చేసే తండ్రులూ, వారి ప్రొజెనీ పాట్లు, ఆ తర్వాత వారికేర్పడే హేబిట్లు గురించి.
బెజవాడ సత్యవతి గారికి సాహితీపురస్కారం లభించినట్టు, ‘ఈమాట’ లో చదివి తెలుసుకున్న నాకు ఎంతో సంతోషం.
ఎగరాలి, ఎగరాలి, బెజవాడ జెండా
అరుణ భాస్కర కోటి కిరణాల కాంతిలో
ధగధగా మెరయు నీ ధర్మచక్రము తిరగ
నిలుపరా నిలుపు నీ బెజవాడ జెండా!
మనం ఇలా నవ్వుకుంటూ ఉండంగా, మనకు తెలియకుండానే మూడో ప్రపంచ యుద్థం వచ్చేట్టుంది.
నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి C. Srirama chandra Murty గారి అభిప్రాయం:
03/31/2022 1:12 am
ఈ పద్యానికి మీ విశ్లేషణ చాలా బాగుంది. తిక్కన సోమయాజి రచించిన పద్యం పూర్తి తెలుగులో ఉంది. చదవగానే అర్థం అయిపోతుంది. నర్తనశాల సినిమాలో ఈ పద్యాన్ని ఉపయోగించి ఘంటశాల మాష్టారు గానం అద్ధుతంగా చేసేరు. సంగీత కర్త హిందోళ రాగం జతకూరిస్తే, రామారావు గారు నటన మరువలేనిది. ఈ పద్యంలో దుర్యోధనుడు ఓడిపోయి ఏమేమి కోల్పోతాడో ఎగతాలి చేస్తూ చదివిన పద్యం ఎంతవిన్నా తనివితీరదు. మంచి వివరణ ఇచ్చిన మీకు ధన్యవాదాలు, సార్ ..
ధర్మం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
03/28/2022 9:15 am
చెన్నైలోని మెరీనాబీచ్ వద్ద కణ్ణగి శిల చూసినా తమిళ పంచకావ్యాలలో ఒకటిగా ప్రస్తుతించబడుతున్న ఇళంగోవడిగళ్ రచించిన సిలప్పదికారం కావ్యం తెలియదు. కణ్ణగి కోపానలనంలో పాండ్య దేశ రాజు నెడుంజెళియన్ గతించాడు. తన ఇంటి వాకిట కళ్ళనీళ్ళు పెట్టుకున్న కవి పెద్దయ్యన శాపపు మరక తన కుటుంబాన్నికి అంటుకోకుండా చెట్టిగారి భార్య చెట్టమ్మ తన కుటుంబాన్ని ధర్మ విపత్తునుండి కాపాడి ధర్మం నిలబడేలా చేసింది.
ఏడాదిలో నూరు పుస్తకాలు రాసిచ్చిన కవి పెద్దయ్యనకి రాయల్టీ డబ్బులు ఇవ్వటానికి నిరాకరించిన చెట్టి.. ఆ డబ్బుల్ని నమ్ముకుని కూతురికి పెళ్ళిపెట్టుకున్నాను అన్నా కరగని చెట్టి… చెదిరిపోతున్న చీరతో, విరబోసుకున్న జుట్టుతో స్వయంగా గుడిలోని అమ్మోరుతల్లిలా లేచిన చెట్టిగారి భార్య చెట్టమ్మ నేరుగా అంగటి ముందు వెళ్ళి కవిగారి బాకీ పైసాతో సహా చెల్లించేలా చేసిన చెట్టమ్మ.
కన్యాకుమారికి దగ్గరగా, ప్రకృతి మాత చేత దీవి౦చబడి నాగరాజ దేవాలయం (సర్ప దేవత గుడి) పేరిట తూర్పు, పశ్చిమ కనుమల సంస్కృతుల మేళవింపుగా వెలసిన నాగర్ కోయిల్ చూసినా జయమోహన్ గారి సాహిత్యం చదవలెదు… ఆ అదృష్టం కలిగించిన అవినేని భాస్కర్ కి
దక్షిణభారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కుంభకోణం… సారంగపాణి (విష్ణువు) దేవాలయం చాలా ప్రాశస్త్యం,,, అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలు చూసిన అనుభూతులు…
తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉన్న తిరువారూర్ కావేరీ నదీ తీరం లోని త్యాగరాజ స్వామి వారి సమాధి ముందు మోకరిల్లిన సృతులు జ్నప్తికి తెచ్చిన అవినేని భాస్కర్ కి మరోసారి రుణగ్రస్తుడినవుతున్నా
ఇంటిని పాలించేది ధర్మపత్ని; దేశపాలనకు ధర్మం … అప్పుడర్థం అయింది మాటంటే ఏంటని! మాట – కచ్చితంగా అది పార్థుడి బాణమే! జయమోహన్ – అవినేని భాస్కర్ సంధించిన “ధర్మం” బాణం పాఠకుల గుండెల్లో చాన్నాళ్లు గుర్తుండిపోతుంది.
ధర్మం గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:
03/28/2022 8:54 am
కథ అద్భుతంగా ఉంది. ఈ వొక్క మాటా సరిపోదుగానీ, కథ కలిగించిన తృప్తిలో ఇంకేమీ తోచడం లేదు. అవినేని భాస్కర్ గారు, ప్రస్తుతం తెలుగు అనువాద సాహిత్యంలో ప్రసరిస్తున్న ఒక సువర్ణ కిరణం.
పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా! గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
03/28/2022 5:25 am
ప్రియమైన డా. లైలా ఏర్నేని గారూ, నమస్కారములు.
No genuine discussion on art. ( and on Damerla Rama Rao garu ?! )
That part of the work is left to be completed by Dr. Lyla Yerneni garu.
” పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా! ” అంటూ దామెర్ల రామారావు గారికి తనవంతు నీరాజనాలు అర్పించిన తల్లావజ్ఝుల శివాజీ గారికి నెనర్లు. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలను ఉపయోగించుకుని, దామెర్లవారి చిత్రాలు అతి భారీ సైజులో పుస్తకాలుగా ముద్రించడం, పెద్ద పెద్ద సైజు కేలండర్‌లుగా ప్రచురించడం గురించి శివాజి గారు ఇచ్చిన సలహా ఆచరణయోగ్యంగా ఉంది. మిసిమి పత్రిక / కళాజ్యోతి ప్రెస్సు బాపయ్య గారి చెవిన వెయ్యాలి. ( శివాజి గారు సదూకున్నది ఒంగోలు లో, మావు సదూకున్నది ఎనకపడ్డ పెకాశం జిల్లా లోని కనిగిరి లో… అవీ మా భవబంధాలు ).
అట్టానే భారతీయ నాంప్రదాయ చిత్రలేఖనంలో అద్భుతాలు సంధించిన కొండపల్లి ( మన కామ్రేడ్ సీతారావయ్య కాదు ) కొండపల్లి శేషగిరి రావు గారి గురించీ తలపోయాలని ఉంది.
రాజా రవివర్మ, విన్సెంత్ వ్యాన్ గో ల మీద అద్బుతమైన పుస్తకాలు రాసిన తెలుగు జర్నలిస్ట్ పి. మోహన్ గారికి దామెర్ల రామారావు గురించీ రాయాలని ఉంది. అందుకు ప్రముఖ సాహిత్యవేత్త, చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారు ( రాజమండ్రీ, దామెర్ల రామారావు గార్ల మీద ఎంతో అభిమానం ఉన్న ) లాంటి వారు సాయం తీసుకోనున్నారు.
మిసిమి మాస పత్రిక ద్వారా తెనాలి ఆలపాటి రవీంద్రనాథ్ గారు వారి వారసులు వారి వంతు కృషి వారు చేస్తున్నారు. కానీ Ground level లో చెయ్యాల్సిన వాటికి ఇక్కడి పెద్దలు, ప్రభుత్వ్య పెద్దలు నడుము కట్టేలా చెయ్యాలి.
ఆంధ్రా ప్యారీస్ తెనాలి అని జబ్బలు చరుసుకుంటాము కానీ ఆర్ట్ కు సంబంధించినంత వరకు ఇక్కడ ప్యారీస్ , లండన్, అమెరికాల్లో ఉన్న సౌకర్యాలు యీడ యాడున్నాయి తల్లా ?
~ ఇట్లు, కె.కె. రామయ్య ( ఓ నేలక్లాసు ప్రేక్షకుడు )
నా తెలుగు చదువు గురించి M.Mallikarjuna Rao గారి అభిప్రాయం:
03/27/2022 11:18 am
Very nice and true too!
స్త్రీల పాటలలో షట్పదులు గురించి గంటి లక్మీనారాయణమూర్తి గారి అభిప్రాయం:
03/27/2022 1:03 am
మాన్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, వైయాకరణులు, చంధోలంకార ప్రజ్ఞానిధి శ్రీ జెజ్జాల కృష్ణమోహన్ రావు గారికి నమస్కారం.
మీరు మాకు ఈనాడు పంపిన తెలుగు సాహిత్యంలో షట్పదుల సలక్షణవివరణ, గానము నాకు చాలా ఆనందాన్ని కలిగించేయి. షట్పదుల మీద అవగాహనను కలిగించేయి.
ఈ వయసులో కూడా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేయడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. 🙏🙏.
#పంచనామా గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
03/25/2022 8:30 pm
అయిదే అయిదు పాదాలలో అనంత వేదన.
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5 గురించి స్వాతి గారి అభిప్రాయం:
03/23/2022 7:51 pm
చాలా చక్కటి తెలుగులో మనసుకు హత్తుకున్నట్టు అందిస్తున్నారు.
శంభో తవారాధనం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
03/22/2022 9:18 am
You are a real rascal, తః తః.
పొద్దున్నే, ‘మీ ఇంటి అడ్రస్ కు ఉత్తరాలు పంపితే తిరిగి వస్తున్నాయి, మీ సమాచారం అప్డేట్ చెయ్యమన్న’ – ఒక ఇండో-అమెరికన్ వైద్యుని ఈ-మెయిల్ చూసుకుని, ఇల్లూ వాకిలి లేని శివుణ్ణి నవ్విన మీ పద్యాలు గుర్తొచ్చి, మళ్లీ చదివి నవ్వుతూ రాస్తున్నాను.
మా నాన్నగారు ఏ ఊళ్లో ఎక్కడున్నారో, ఎలాగొలా తను ఆరా తీసి కనుక్కుని, – ఆయనను వెంటనే ఇంటికి తిరిగిరమ్మని, నాకు ఆయనపై బెంగగా ఉందని – నాతో నా చిన్నతనంలో ఉత్తరాలు వ్రాయించేది మా అమ్మ.
బెజవాడ నుండి సత్యవతి గారు, ఇలాటి గాథలే రాసి ఉంటారు. అందరినీ తన ఇంట్లో పర్మనెంటుగా తెచ్చిపెట్టుకుని, తను మాత్రం చుట్టంలాగా అప్పుడప్పుడూ విజిట్ చేసే తండ్రులూ, వారి ప్రొజెనీ పాట్లు, ఆ తర్వాత వారికేర్పడే హేబిట్లు గురించి.
బెజవాడ సత్యవతి గారికి సాహితీపురస్కారం లభించినట్టు, ‘ఈమాట’ లో చదివి తెలుసుకున్న నాకు ఎంతో సంతోషం.
ఎగరాలి, ఎగరాలి, బెజవాడ జెండా
అరుణ భాస్కర కోటి కిరణాల కాంతిలో
ధగధగా మెరయు నీ ధర్మచక్రము తిరగ
నిలుపరా నిలుపు నీ బెజవాడ జెండా!
మనం ఇలా నవ్వుకుంటూ ఉండంగా, మనకు తెలియకుండానే మూడో ప్రపంచ యుద్థం వచ్చేట్టుంది.
– లైలా
ధర్మం గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
03/21/2022 9:49 am
ఎంత బలమైన కథనం! జయమోహన్ లాంటి కథకులు అత్యంత అరుదు. అనువాదం గురించి చెప్పేది ఏముందీ, పాఠకుల అదృష్టం!