Comment navigation


15543

« 1 ... 1490 1491 1492 1493 1494 ... 1555 »

  1. “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    03/17/2007 3:37 pm

    సమీక్ష బావుంది.ఈ సంపుటి లో నాకు నచ్చిన కవిత “బనలతాసేన్”.

    రచయిత చెప్పినట్లు ఈ కవిత లో ఇస్మాయిల్ గారి స్వంత ముద్ర,ఆయన సొత్తైన పదాల పొదుపు లేకపోవటమే కాక ఆయన సాధారణంగా వాడని గ్రాంధిక పదాలు కూడా ఉన్నాయి.అయితే మూలకవిత లో ఉన్న భావగాఢతకు ,ధారకు అనుగుణమైన అనువాదం అనిపిస్తుంది. మూల కవిత లోని mystic beauty ని ఇస్మాయిల్ గారు చాలా అందం గా పట్టుకున్నారు. మంచి అనువాదం లక్షణం కూడా అదే కదా!

    ఈ కవిత రచనా కాలం గురించి పుస్తకం లో లేదు.ఇస్మాయిల్ గారు చెప్పుకున్నట్లు మొదట్లో ఆయన పైన కృష్ణశాస్త్రి తదితర భావకవుల ప్రభావం ఉండేది.ఈ కవిత ఆయన తనదైన”ఇస్మాయిల్ బాణీ” ని ఏర్పరచుకొనక ముందు వ్రాశారో తర్వాత వ్రాశారో తెలియదు.తర్వాతే వ్రాసి ఉంటే అది ఆయన కవిత్వం లోనే ఓ ఆసక్తికరమైన పరిణామం అయిఉండ వచ్చేమో!

    దీర్ఘకవితైనా,మినీకవితైనా,సరళమైనా,గ్రాంధికమైనా,వచనమైనా,పద్యమైనా,ఏ మాండలికంలో వ్రాసినా హృదయాన్ని తాకే కవిత్వం పదికాలాలు నిలబడుతుంది.

    మూలకవితల గురించి,కవుల గురించి వివరాలు లేకపోవటం రచయిత చెప్పినట్లు పెద్ద లోపం.మూలకవితలపై అవగాహన లేనిదే అనువాదకవితలని
    ఆనందించగలమేమో కానీ అంచనా వేయటం కష్టమేమో అనిపిస్తుంది.

  2. రచయితలకు సూచనలు గురించి మిరపకాయ్ గారి అభిప్రాయం:

    03/16/2007 6:15 pm

    మీ ప్రయత్నం అద్భుతం . వెబ్ సైట్ డిజైన్ కూడా చాలా చక్క గా ఉంది , కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్యానర్లు లేకుండా చూడగానే చదవాలనిపించేట్టు .

  3. పునశ్చరణం గురించి మిరపకాయ్ గారి అభిప్రాయం:

    03/16/2007 6:11 pm

    నేను కవిని కాదు కానీ మీకవిత చదివిన తర్వాత… నాకు నేను ఎప్పుడో గీసిన బొమ్మలు మళ్ళీ చూడాలనిపించింది …. మనస్సుమూలల్లో ఎక్కడో ముళ్ళ చెట్లకు చిక్కుకుపోయిన గాలిపటాల్లాటి జ్ఞాపకాలు వెనక్కొస్తున్నాయి… కవిత చాలా బాగుంది ..

    ఒక చిన్నవిషయం .. మీరు కవితను ఇంకా పెద్దది వ్రాసి సగమే ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తొంది . మీరు అర్ధోక్తిలో ఆగిపోయిన విషయం మీభాష చెబుతోంది … లేకపోతే పైన ఎవరో చెప్పినట్టు metaphors ఎక్కువవ్వడం వలన అలా అనిపిస్తోందేమో ..

  4. ది బీచ్ గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:

    03/16/2007 3:11 pm

    కథ చాలా బాగుంది. ఒక సమస్య, ఒక నాటి చిన్న ఆలోచన, ఒక గతి తప్పిన పరిష్కారం వీటిని రీ విసిట్ చేస్తూ ఆ లయ తప్పిన నిముషాన్ని ఎత్తి చూపించడం బాగుంది, ముఖ్యంగా ఆ బలహీనపు నిముషాన్ని వర్తమానంతో కాంట్రాస్ట్ చేస్తూ.

    డిప్రెషన్ అనేది అత్యంత సహజవైన ఎమోషన్స్ లో ఒకటి. కొన్ని సార్లు నిరాశ చుట్టుముట్టినపుడు, మరణం ఒక పరిష్కారంగా కనపడటం కూడా సహజవే. కానీ అదే పరిష్కారంగా నిర్ణయించుకోని, అమలుజపబోవటం అనేది సహజవైన బలహీనత కాదు. అత్యంత ధుర్భలవైనటువంటి బలహీనత. రామ్ ఆ క్షణం నుంచి బయట పడటం నిజంగా అద్రుష్టవే, చాలా మందికి ఆ అవకాశంరాదు. రామ్ అల నించి బయటపడటానికి, లతా, పిల్లలకన్నా, ఏ జీవికైనా వుండే బ్రతకాలనే సహజ సిద్దవైన గుణవే కారణవేవో కదా.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  5. అంతరం గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:

    03/16/2007 2:06 pm

    కొన్ని సమస్యలు మనకై మనం ఆలోచించి, విశ్లేషించి, మాట్లాడి, వాదించి పరిష్కారాలు కనుగొనలేవు. వింధ్య చదువుకున్నది, రమేష్ తో చాలా సార్లే మాట్లాడి వుంటుంది, సమస్య గురించి. కానీ రమేష్ సమస్య సంధ్య మాటలకంటే, విశ్లేషణ కంటేకూడా, ఒక సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ అవసరాన్ని ఎక్కువగా సూచిస్తుంది.

    దేనికన్నా సిధ్ధమయ్యేముందు, ఈ రాయిని కూడా తిప్పిచూడాల కదా!

    రవికిరణ్ తిమ్మిరెడ్డీ

  6. అంతరం గురించి Madhu Babu Juttiga గారి అభిప్రాయం:

    03/16/2007 9:13 am

    కథ బావుంది గిరీ!
    అల్లిక చక్కగా ఉంది..suspence కంటే ఉత్కంఠగా చదివించే లక్షణం బాగా కుదిరింది.
    Keep writing,
    _ మధు

  7. మాయం గురించి Sowmya గారి అభిప్రాయం:

    03/16/2007 8:01 am

    చివరి దాకా బాగా సాగింది కానీండీ, ఆ ముగింపేమిటి అలా ఉంది?
    చదువుతూ చదువుతూ నేనింకేదో ఊహించాను. “కథంటే ముగింపు ఉండాలి కదా” – అని ఈ కథ లో ఎన్నో సార్లు వచ్చింది. అదే ఆ ముగింపు తాపత్రయం లోనే కథ చివరికి వచ్చేసరికి ఇలా అయిపోయింది ఏమో అనిపించింది.

  8. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/16/2007 6:11 am

    వ్యాసకర్త గారూ, ఈ క్రింది లింకు చదివితే నేను ప్రస్తావించిన విషయాలు కొన్ని తెలుస్తాయని అనుకుంటున్నాను.

    http://www.eenadu.net/archives/archive-11-3-2007/htm/weekpanel1.asp

  9. ది బీచ్ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    03/15/2007 10:18 am

    కథ చాలా బాగుంది. ఏ ఎక్స్ట్రాలకీ పోకుండా చాలా సున్నితమైన విషయాన్ని, చాలా లోతైన విషయాన్ని, అంత సున్నితంగానూ, అంత లోతుగానూ చెప్పిన కథ!

  10. చాదస్తం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    03/15/2007 9:45 am

    రవికిరణ్ గారన్నట్టు, కథలో ఆవిడ పాత్ర బాగానే ఎస్టాబ్లిష్ అయ్యింది. కాకపోతే అది two-dimensional అయ్యి కూచుంది. ఎంతసేపూ తన ఆలోచనలే తప్ప ఎదుటివాళ్ళ అభిప్రాయాలగురించి ఆలోచించే అలవాటు బొత్తిగా కనిపించదు.

    ఉదాహరణకి “నీ భర్త నిన్ను అర్థం చేసుకున్నంత వరకూ, ఎవరూ మీ స్నేహం గురించి ఏమనుకున్నా లెక్క లేదులే” అని ఇంకొకావిడ అన్నప్పుడు భర్త తనుచేసే ప్రతి స్నేహాన్ని ఆమోదించితీరాలన్న ఆలోచనే తప్ప, అతనికీ స్వంత అభిప్రాయాలు ఉండవచ్చునని గాని, జీవిత భాగస్వామిగా తన స్నేహాలతో అతనికి ప్రమేయం ఉంటుందన్న ఆలోచనగానీ లేకపోయింది.

    “మా ఆయన కర్థం అయ్యే స్నేహాలు మాత్రమే నేను చెయ్యాలట!” – అని ఆ ఇంకొకావిడ అనలేదే!

    “అతని కర్థం కాకపోతే అది అతని చేతకానితనం అవుతుంది గానీ, నా స్నేహం తప్పెందుకవుతుందీ?” – అతనికర్థం కానంత మాత్రాన తన స్నేహం తప్పవుతుందని ఎవరన్నారు? అతనికి అర్థం కాకపోయినంత మాత్రాన అది అతని చాతకాని తనమూ కాదు.

    “అయినా భర్త దయాదాక్షిణ్యాల మీదా, అతను విషయాలనర్థం చేసుకునే చాకచక్యం మీదా ఆధారపడి లేవు నా స్నేహాలు.” – ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు.

    పెళ్ళి భారీగా చేసుకోకూడదన్నది ఆవిడ స్వంత అభిప్రాయం. అది తన స్నేహితుడిమీద రుద్దడానికి తాపత్రయ పడిన ఆవిడ, ఒకవేళ తన స్నేహం తన జీవితభాగస్వామికి ఇష్టం లేకపోతే దానిగురించి ఆలోచించాలన్న సహనం కూడాచూపలేదు!

    ఆవిడ వ్యక్తిత్వమే ఈ కథ శీర్షికకి సరిగ్గా సరిపోతోంది!

« 1 ... 1490 1491 1492 1493 1494 ... 1555 »