Comment navigation


15543

« 1 ... 1488 1489 1490 1491 1492 ... 1555 »

  1. అంతరం గురించి lalitha గారి అభిప్రాయం:

    03/28/2007 10:13 am

    కథ బాగుంది. ఒక కథగా బాగుంది.ఒక చిన్న సందేశం కూడా ఉంది.
    వ్యాఖ్యలతోనే ఒక చిక్కు. శైలు, రమెష్ పాత్రలలో ఉన్న లోపాలగురించి వ్యాఖ్యానిస్తున్నారు చదివిన వారు. శైలు భర్త పాత్ర గురించి వ్యాఖ్యానం చెయ్యరేం. అతని కున్న స్పెషాలిటీ కాక్ టెయిల్ కలపడం. రమేష్ గురించి పూర్తిగా తెలియక ముందు అతనికీ రమేష్ మీద అసూయ లాంటి భావమేదో కలిగినట్టు ఉంది కదా. తను శైలూకి ఒక్క సారి సరదాకి కూడా వండి తినిపించలేకపోయాడు, రమేష్ మాత్రం “నాజూకుగా” ఉన్న తన భార్యకు, వచ్చిన వారికీ రుచిగా రకరకాలు చేసి తినిపిస్తున్నాడు అని. అవకాశమం దొరకగానే రమేష్ మీద ఒక వ్యంగ్య బాణం విసిరాడు కదా, “కేటరింగు” చెయ్యొచ్చు కదా అని. వింధ్య భర్త గురించి తెలిసిన తర్వాత అతనికంటే అయితే తను మెరుగే కదా అని కొంచెం గర్వ పడ్డట్టు కూడా కనిపిస్తుంది. శైలు భర్త తన భార్యను తనకంటే వ్యక్తిత్వంలో తక్కువ దానిగా చూస్తున్నాడు. ఇది సబబేనా మరి?
    భార్యా భర్తలు ఇద్దరూ ఎవరికి వారు సర్వ గుణ సంపన్నులు, ఉత్తమ వ్యక్తిత్వం గల వారు కానక్కర లేదు.
    They should complement each other. Support each other in each other’s lackings and encourage each other’s merits. The moral in the story applies to both wife and husband.

    However, there could be exceptions, like in case of Ramesh. It depends on the sverity of Ramesh’s controlling nature as to how far Vimdhya should keep trying. She has a right to choose out before there are children in the picture and the problem becomes even more cmplicated.

    Just like the cahracters in the story, it is also easy for readers / observers to analyse and give “uchita salahaalu”. I’m no exception to that.

    లలిత.

  2. ఇద్దరు దుర్మార్గులు గురించి PhaNi DokkA గారి అభిప్రాయం:

    03/28/2007 4:26 am

    నచకి గారూ,

    కథపై మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పిన సామ్యం బావుంది, కథలోని పాత్రల స్వభావాన్ని కొంతవరకు ఆవిష్కరించింది.

    ధన్యవాదాలతో,
    మీ ఫణి డొక్కా.

  3. ఇద్దరు దుర్మార్గులు గురించి PhaNi DokkA గారి అభిప్రాయం:

    03/28/2007 4:16 am

    కామేశ్వరరావుగారూ,

    కథపై మీ అభిప్రాయమూ, విశ్లేషణ బావున్నాయి, ధన్యవాదాలు. నా కథని మనసు పెట్టి చదివినందుకు కృతజ్ఞతలు.

    చిన్న వివరణ:

    “ఆమె అర్థం చేసుకుంది, ముందు నవ్వింది, తరవాత చెప్పింది”:

    ఎప్పుడూ తనతో ముచ్చట్లాడని భర్త, తన ఇష్టాయిష్టాలగురించి మొదటిసారి అడిగాడు, ఆ రాత్రి. అలా ఎందుకు చేసాడో ఆమె అర్థం చేసుకుంది. ఇక మీదట తమ సంసారం ఒక గాడిలో పడబోతోందికదా అని మనస్ఫూర్తిగా నవ్వింది. అటుపైన చెప్పింది.

    ఈ విషయాన్ని మరికొన్ని సంభాషణలద్వారా చెబితే, మరీ అరవ హాస్యంలా ఉంటుందేమోననిపించి, చెప్పలేదు.

    కథలో దీప పాత్ర ఎప్పుడూ నేపధ్యంలోనే సాగుతుంది, తంబూరా శృతిలాగ. శృతిలేనిదే పాట లేదు, దీప పాత్ర లేనిదే ఈ కథా లేదు. ఆ పాత్రకున్న “సటిలిటీ” ని కథ ముగింపు వరకూ కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే చివరిలో అలా ముగించేసాను.

    కృతజ్ఞతలతో,
    మీ ఫణి డొక్కా.

  4. నిన్నటి కల గురించి t.sujatha గారి అభిప్రాయం:

    03/28/2007 1:53 am

    చాలాబగుంది.చక్కటి శైలి కొనసాగించండి మీ కవితా ఝురి.

  5. ఇద్దరు దుర్మార్గులు గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    03/27/2007 6:36 pm

    “మాటలతో విసిగిస్తున్నానా?” ఇది రచయత పాఠకులని అడగవలసిన ప్రశ్న. కథావస్తువు చప్పగా ఉండడం వలన కావచ్చు, కథనంలో అసలు పట్టు లేదనిపించింది. చదువరులను ఆకట్టుకోలేని సగటు కథల లాగా ఈ కథని కూడా installments లో చదవాల్సి వచ్చింది.

  6. అంతరం గురించి Narayan గారి అభిప్రాయం:

    03/27/2007 4:55 pm

    కథ ఫర్వాలేదు. కానీ అంత వెరైటీ ఏముంది?

  7. ది బీచ్ గురించి NaChaKi గారి అభిప్రాయం:

    03/27/2007 12:21 pm

    కథ హత్తుకునేట్టుగా ఉంది. కథ ఉపసంహారంలో ఉన్న ఆలోచనలలో depth ఉంది. ప్రసాద్ గారు చెప్పినట్టు “ఆ రెండు క్షణాల” గురించి మరింత విస్తరణ ఉంటే ఇంకా రక్తి కట్టేది. అలాగే చివర్లో కూడా ఆనాటి కష్టాల నుంచి బయటపడటానికి ఎలాంటి struggle ఉండిందో తలచుకోవటం పాత్రోచితంగా ఉండేది.

  8. అంతరం గురించి NaChaKi గారి అభిప్రాయం:

    03/27/2007 11:58 am

    కథ బాగుంది. ఇందులో నాకు కనిపించిన అంశమొకటి: శైలు, రమేశ్ పాత్రలు ఒక కోణం నుంచి ఒక్క లాంటివే – అవతలి వారిని తక్కువగా చూడటం. నిజానికి శైలు మాటలు ములుకుల్లా అనిపిస్తాయి సాధారణంగా చూస్తే. రమేశ్ పద్ధతి మాత్రం చక్కనిదనే అభిప్రాయానికి రావటం సులభం. రమేశ్ పద్ధతి వలన దుర్భర బాధ పడుతున్న వింధ్య గురించి శైలు బాధ పడటం విచిత్రంగా అనిపించవచ్చు కానీ చాలా సహజం. “…తమ తప్పులెఱుగరు” అన్న రీతిలో ఉన్న శైలు ప్రవర్తన జనబాహుళ్యంలోనిదే. భర్త లోపాన్ని అందరిలోనూ చెప్పటానికి సంకోచించని శైలుది ఎలా తప్పో భర్త లోపాన్ని అందరిలో దాచి “వాలకం చూస్తుంటే, దేనికైనా సిద్ధమనిపించింది” అని తనకే అనిపించే దాకా ఆగటం కూడా అలాగే తప్పు.

  9. చాదస్తం గురించి NaChaKi గారి అభిప్రాయం:

    03/27/2007 12:47 am

    కథ …ఊహించినట్టుగానే సాగింది నాకు మటుకు. 😉 కథ మీద ఇతర పాఠకులు, ముఖ్యంగా కొంచెం లోతుగా చర్చించిన కామేశ్వరరావు గారు, ఇచ్చిన విశ్లేషణ బాగుంది. కథని ఒకే perspective నుంచి వ్రాస్తే… అది రచయిత(త్రి) ideology కాకపోతే defend “చెయ్యటం” కష్టం స్వధర్మం కాదు కనుక, అదే వారి ideology ఐతే defend “చేసుకోవటం” కష్టం. అసలు defensive modeలోకి రాకుండా ఉండాలంటే కథని ఒకే పాత్ర దృక్కోణం నుంచి వ్రాయటం కూడదేమో మరి ఈ లెక్కన. (ఆ ఒక్క పాత్రనీ “లోపాలు లేని మహాత్మ” పాత్రగా దిద్దితే ఒకే పాత్రతో అంతటి విశ్లేషణా నడిపించవచ్చేమో. ఈ పాత్ర అందుకు తూగినట్టు కనపడదు.)

    కథనం పరంగా లోపాలుగా కనిపిస్తున్నవి కొన్ని ఉన్నాయి. కామేశ్వరరావు గారు చెప్పినట్టు “భర్త” అంటే “పతి దేవుడు” అనే గౌరవం అక్కర్లేదు లేశమైనా, కానీ “మనిషి” అని, “నా జీవితంలో అంతర్వాహిని లాంటి ఒక entity” అని కించిత్ గౌరవమైనా ఉన్నట్టుగా ఉంటే పాత్ర elevate అయ్యేది. కథ రాఘవ్‌కీ ఆ పాత్రకీ మధ్య మాత్రమే జరిగినట్టు అనిపించినా అసలు కథలో తన కుటుంబం గురించిన ఊసు కనీసం రాఘవ్ కుటుంబం గురించి ఉన్నంతైనా లేకపోవటం ఆశ్చర్యకరం (?). అన్నట్టు, కథలో పాత్ర తన పెళ్ళి ఎలా జరిగింది అన్నది చెప్పి ఉంటే కథకి, కనీసం ఏదో ఒక పాత్రకి, ఊతం దొరికేది.

    కాకపోతే ఒక విషయం స్పష్టం: కథలోని స్త్రీ పాత్ర తన ఉద్దేశాలు అవతలి వారి ఇష్టాలను బట్టి అణచుకోవాలి అన్న గ్రహింపు ఉన్న పాత్రే. “ఏమండీ అని పిలుస్తాడు, దానికే ఆలవాటు పడిపోయాను.”, “ఐనా మా మధ్య స్నేహం స్థాయి అంతేనని సరిపెట్టుకున్నాను.” వంటి వాక్యాలు అందుకు నిదర్శనాలు. ఇవి తప్పిస్తే, “నాస్తికత్వం” అంటే “(దేవుడు) లే”డన్న నమ్మకం/వాదం. అందులో “నాకు మీ నాన్నకన్నా పట్టింపులెక్కౌవలే!” అనటమూ, “…అన్నాను logicalగా” అని తన (possessive) భావన గురించి తనే అనటమూ పాత్రోచితంగా లేవు ఈస్థాయి పాత్రకి.

    ఏదేమైనా మొత్తానికి నా మెదడుకు మాత్రం ఈ కథ బాగానే పనికి వచ్చింది 🙂

    – నచకి

  10. ఇద్దరు దుర్మార్గులు గురించి NaChaKi గారి అభిప్రాయం:

    03/26/2007 1:01 pm

    ఫణి డొక్కా గారి కలం నుంచి నిజంగానే expect చెయ్యని కథ నాకు కూడా! జె.యు.బి.వి. గారి అభిప్రాయంతో సహా అన్ని అభిప్రాయాలు చదివాక నాకు ఇప్పటికీ కథ కథగా నచ్చింది. నేనేదో విమర్శకుడిని కాను కానీ నాకు తోచింది చెబుతాను: కథావిశ్లేషణ చేస్తున్నప్పుడు ఆ పాత్రలు విశ్లేషణాపరిధిలోకో, విశ్లేషకుల దృక్పథంలోకో వచ్చేట్టు చూడటం సరియైన పద్ధతి కాదేమోనని నా అభిప్రాయం. మరి చెయ్యవలసిందేమిటి అంటే కథావిశ్లేషణాపరిధిని ఆయా పాత్రల చుట్టూ గీసుకోవటం! పాత్రలు ముందు పుట్టాయి విశ్లేషణ కన్నా. అలాంటప్పుడు గాల్లో ఎక్కడో నిలబడి భూమి మీద విషయాన్ని గురించి పుంఖానుపుంఖాలుగా వ్రాసే లోపుగా అసలు విశ్లేషిస్తున్న కథావస్తువునైనా పరిధిలోకి తీసుకోవాలా వద్దా? కథలోని ఒక్కో పాత్రలో నిలబడి చూస్తే ఎవరికి వారు తమ పరిధులను దాటకుండా “ఉదాత్తంగా” అయినా కాకున్నా హుందాగానే ప్రవర్తించారు.

    కథలోని మూడు పాత్రలకూ బలహీనతలున్నాయి. భర్తని నిలదీయలేని, దూరం చేసుకోలేని బలహీనత దీప పాత్రది. దీపతో వివాహబంధానికి ద్రోహం చేస్తున్నా, గోపికను వదులుకోలేక తన గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతూ, అయినా జన్మతః వచ్చిన సంస్కారం వల్లనో మరొక కారణం వల్లనో ఇద్దరినీ గౌరవిస్తూనే సాగే పాత్ర మోహన్. మరొకరిని నమ్మి కుటుంబాన్ని వదిలి కోల్పోయిన దాని కోసం వెనక్కి వెళ్ళే ధైర్యం లేక, ప్రపంచాన్ని ఎదిరించి ఒక్కర్తీ గౌరవంగా బ్రతికే ధైర్యమూ లేక తోచిన పద్ధతిలో బ్రతుకుతూ మింగలేక కక్కలేక బతికే పాత్ర గోపిక. అందరివీ “సామాన్యమైన” పాత్రలే, బలహీనమైన బ్రతుకులే.

    చిన్న సామ్యం తోచింది ఇది వ్రాస్తోంటే: చీకటిలో దీపతో కలసి నడుస్తూ ఒక దిగుడు బావిలో పడ్డాడు మోహన్. పై నుంచి చూస్తున్నా, భర్త బావిలో ఉన్నాడని గ్రహించినా ఏమీ చెయ్యలేని పాత్ర దీపది. పైకొచ్చే ప్రయత్నం చెయ్యకుండా ఎందుకు, ఎలా పడ్డాడో ఆలోచిస్తూ ఉన్న పాత్ర మోహన్‌ది. అప్పటికే అదే దిగుడు బావిలో పడి పైకి ఎలా వెళ్ళాలో తెలిసినా బావిలోనే “బ్రతుకు” ఏర్పరచుకుని రాజీ పడిన పాత్ర గోపికది. ఇలా చూస్తే ఆయా పాత్రల limitations అర్థమవుతాయి, ఆ limitations వల్ల తమని తాము నిందించుకున్నా నిందించకున్నా పక్క వాళ్ళని నిందించకుండా తమ సమస్యలకి తామే కారణం అనే realization కనిపిస్తుంది ఈ పాత్రల్లో. ఏమంటారు?

    డొక్కా ఫణి గారికి అభినందనపూర్వక ధన్యవాదముతో,
    నచకి

« 1 ... 1488 1489 1490 1491 1492 ... 1555 »