Comment navigation


15543

« 1 ... 1489 1490 1491 1492 1493 ... 1555 »

  1. సీతా-రామా గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/25/2007 8:39 am

    కొత్తపాళీ గారికి,

    నా కథ గురించి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలకు, కథ వ్రాయటంలో మీ అనుభవంనుంచి మీరిచ్చిన సలహాలకు మీకు మరీ,మరీ నా కృతజ్ఞతలు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  2. ఇద్దరు దుర్మార్గులు గురించి Anil Ivaturi గారి అభిప్రాయం:

    03/22/2007 12:46 pm

    kiran గారి అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను.
    *********
    కధ కన్నా ప్రసాద్ గారి విశ్లేషన నాకు బాగా నచ్చింది. కథ లోని ప్రతి పాత్రయొక్క నిజస్వరూపాన్ని కల్లకు కట్టినట్లు వివరించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

    కిరణ్.
    *******

  3. అర్హత గురించి Shailaja గారి అభిప్రాయం:

    03/22/2007 1:11 am

    చాల రోజుల తరవాత మంచి romantic story చదివేను… it is very nice….

  4. కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి గురించి కాజ సుధాకర బాబు గారి అభిప్రాయం:

    03/21/2007 10:51 am

    నమస్కారము.

    తెలుగు వికిపిడియాలో వివిధ రచనలను గురించిన వ్యాసాలు పెంచాల్సిన అవుసరం ఉంది. ప్రసిద్ధ తెలుగు గ్రంధాలగురించి వ్యాసాలు మొదలుపెట్టబోతున్నాము.

    ఈ రచనను (యధాతధంగా) తెలుగు వికిపిడియాలో వాడుకొనవచ్చునా?

    సుధాకర బాబు

  5. పునశ్చరణం గురించి P. Siva గారి అభిప్రాయం:

    03/19/2007 2:25 pm

    సరిగ్గా అతకని రెండో సిమిలీని వదిలేసి ఉండవలసింది.

  6. సీతా-రామా గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    03/19/2007 8:01 am

    రవికిరణ్ గారూ,

    ఇంత క్లిష్టమైన కథా వస్తువుని మొదటికథకి ఎంచుకోవటం మీ సాహసం. దాన్ని చాలా సున్నితంగా చెప్పబూనటం మీ ఆత్మవిశ్వాసం. మీ రచనలో మంచి కథలు సృష్టించగల అత్యవసర లక్షణాలన్నీ ఉన్నాయి.
    పాఠకుడిగా కొన్ని సూచనలు:
    1. కథకి ముందు చదివించే గుణం ఉండాలి. వస్తువు, కథనంలోని క్లిష్టత దీనికి అడ్డం కారాదు. ఇది ఎక్కడ ఎందుకు కుంటుపడించో ఆలోచించండి.
    2. పేర్ల లింగ మార్పిడి 🙂 మీరాశించిన ఫలితాన్ని ఇవ్వలేదు; ఏదో జిమ్మిక్ అనిపిస్తుంది. కథలో అసలు లోతునించి దారి మళ్ళిస్తుంది.
    3. ఇద్దరు వ్యక్తుల దృష్ట్యా కథ చెప్పటం సామాన్యం కాదు.
    కొన్ని కథలు రాసి నేను నేర్చుకున్న పాఠాలు
    1. చాలా చెప్పెయ్యాలన్న కుతూహలాన్ని, తొందరని నిర్దాక్షిణ్యంగా తొక్కి పట్టండి.
    2. కథని బలవంతంగా ముగించే ప్రయత్నం చెయ్యకండి. కొన్ని కథలకి ఏ ముగింపూ లేకపోవడమే సరైన ముగింపు.
    3. ఏ వాక్యం, ఏ మాట ఎవరు చెబుతున్నారు, వాళ్ళ దృక్కోణం ఎటువంటిది అని గమనించండి. రెండు పాత్రలు కథ చెపుతున్నప్పుడు వాళ్ళ కిద్దరికీ తమదైన స్వరం (unique voice) ఉండాలి.

    మీనించి ఇంకా మంచి కథలు వస్తాయని ఆశిస్తూ ..

  7. పునశ్చరణం గురించి స్వాతి గారి అభిప్రాయం:

    03/19/2007 5:03 am

    అద్భుతం!!
    బిడ్డను కన్న ప్రతి తల్లికీ
    కవిత రాసిన ప్రతి వారికి అనుభవమే ఇది.

  8. అంతరం గురించి balarama గారి అభిప్రాయం:

    03/18/2007 6:20 pm

    హాస్యాన్ని ధ్వనిస్తూనే ఒక సున్నితమైన సమస్యని పాఠకుల ముందుకు తీసుకు వచ్చారు రచయిత.

  9. ఓ.పీ.నయ్యర్‌ గురించి Chimata Rajendra Prasad గారి అభిప్రాయం:

    03/18/2007 4:26 am

    వ్యాసం చాలాసమగ్రం గా ఉంది.మీరిచ్చిన ఆడియో లింకుతో ఎంతో కాలం కింద విన్న పాటలు మళ్ళీ విన్నాను.నాకు నచ్చిన చాలా పాటలు నయ్యర్ వి అని తెలిసింది.ఆయన సంగీతం నేర్చుకోకుండా సంగీతదర్శకుడవడం స్ఫూర్తి నిచ్చేవిషయం.ఏ సంకెళ్ళూ లేకపోవడం సృజనాశక్తికి లాభదాయకంకూడానేమో!!!

  10. భయం! గురించి Indrani palaparthy గారి అభిప్రాయం:

    03/18/2007 1:04 am

    మంచి కధ.చాలా బాగుంది.వేమూరి గారికి అభినందనలు.

« 1 ... 1489 1490 1491 1492 1493 ... 1555 »