Comment navigation


15547

« 1 ... 1465 1466 1467 1468 1469 ... 1555 »

  1. “చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    08/13/2007 12:16 pm

    అనిల్ గారూ,

    దయచేసి ఫోటోలు rohiniprasadk AT yahoo DOT com కు పంపండి.

    నడివయసులోనే కాలం చేసిన ఉత్తమ రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావుగా రంటే మా నాన్నగారికి అభిమానం. ఆయన మా ఇంటికి రావడం నాకు గుర్తే. ఆయన శ్రీమతి (రాణి గారు) కూడా చనిపోయారని ఈమధ్యనే నవోదయ రామమోహనరావుగారు చెప్పగా విని బాధపడ్డాను. త్రిపురనేని గోపీచంద్ సోదరిగా, మద్రాసులోని అతి కొద్ది తెలుగు బుక్ షాపులలో ఒకదాని నిర్వాహకురాలిగా ఆమె మాకు తెలుసు.

  2. “చందమామ” జ్ఞాపకాలు గురించి anil atluri గారి అభిప్రాయం:

    08/12/2007 5:57 am

    చందమామ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పారు, సంతోషం.
    కొకుగారు, తాపి వారు కలిసిఉన్న ఫొటొలున్నవి.
    కావాలంటే ఏదైనా మైల్ ఐడి తెలియజేయండి, పంపుతాను.
    కుటుంబరావు గారి ముందుమాటతో ఇక్కడ ఒక కధ ఉంది. వీలుంటే చూడండి.

  3. “చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    08/11/2007 4:28 am

    కొనుక్కోవలసిన అవసరం ఉండేది కాదుగాని మా ఇంట్లో కూడా పిల్లల చందమామ కాపీలు ఎవరివి వారివే! చాలా విలువైనవిగా, ప్రాణప్రదంగా వాటిని దశాబ్దాల తరబడి దాచుకున్నాం.

    రచయితల పేర్లు వగైరాల గురించిన పద్ధతులన్నీ చక్రపాణిగారివే – నాగిరెడ్డిగారివి కావు (శ్రీనివాస్ గారు పొరపాటున కె.వి. అన్నారు). ఎటొచ్చీ నాగిరెడ్డిగారి ఆర్థిక, ప్రెస్సు సహకారం చాలా ముఖ్యమైనవి. చక్రపాణిగారు పోయిన తరవాత రెడ్డిగారి రెండవ కుమారుడు విశ్వనాథరెడ్డిగారు (నేటిదాకా) సంపాదక బాధ్యతలు చేపట్టారు.

    ఇక ఆలోచన మాటకొస్తే రచయితల పేరు కన్నా పత్రిక పేరు ఎక్కువగా గుర్తుండిపోయిందనడంలో సందేహం లేదు. అయితే చక్రపాణిగారికి సినీ నిర్మాతగా ఎక్కువ పేరు రావడంతో ఆయనకు పత్రికా, సాహిత్య రంగాలతో ఉండిన ప్రమేయం గురించి ఇక్కడ కొంత చెప్పాలి.

    చక్రపాణిగారు చందమామను మొదలుపెట్టడానికి స్ఫూర్తి బెంగాలీ (పిల్లల) పత్రికల ద్వారా లభించింది. బెంగాలీ సాహిత్యంతో ఆయనకుండిన పరిచయం దృష్ట్యా చందమామలో సర్కార్ (సీనియర్) ఇంద్రజాలం తదితర అంశాలు కనబడడం యాదృచ్ఛికం కాదు. తరవాతి కాలంలో మరొక సర్కార్ తన ఇంద్రజాలం ఆధారంగా రాసిన కథలు కూడా పడ్డాయి.

    చందమామ పేజీల లేఅవుట్ దృష్ట్యా కథల సైజును మార్చడం తప్పనిసరి. ఈ ‘దర్జీ పని’లో కథ మారే తీరు ఒక్కొక్కప్పుడు రచయితకు నచ్చకపోవచ్చు. అందుచేత చందమామ కథలన్నీ పత్రిక స్వంత ఆస్తిగానే ఉండాలి!

    నా లెక్కన చక్రపాణిగారి మనసులో రచయితలకు పేరు రావడం కన్నా వారు రాసే శైలి గురించిన పట్టింపు ముఖ్యమనిపిస్తుంది. పేరు పొందిన రచయితలు తమ రచనలను మార్చనివ్వరు. చందమామలో పడే కథలన్నీ ఒకే (తనకు నచ్చిన) శైలిలో ఉండాలని చక్రపాణిగారి అభిమతం. చిన్నప్పటి నుంచీ తెనాలిలో స్వయంగా రచనలూ, అనువాదాలూ చేసిన ఆయనకు మా నాన్న రచనాశైలి గురించి తెలుసు కనకనూ, అది ఆయనకు ఇష్టం కనకనూ చందమామ బాధ్యతను అప్పగించారు. అందుకనే చందమామ చక్రపాణిగారి మానసపుత్రిక.

  4. “చందమామ” జ్ఞాపకాలు గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    08/10/2007 6:44 pm

    చందమామ మా నాన్నగారు కొని తెచ్చేరోజున దాన్ని మొదట చదవటానికి మా ఇంట్లో మేమంటే మేమని కొట్టుకొన్న రోజులున్నాయి. ఆ పత్రిక పిల్లలకు మంచి బుధ్ధులు నేర్పే మరో ఉపాధ్యాయుడితో సమానం. పత్రికను గురించిన మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు. కాని కే.వి.రెడ్డి మరియు చక్రపాణి లాంటి వారు అసలు రచయిత పేరు లేకుండా కథలు రాయించేవారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.

  5. A Poem at the Right Moment: An Introduction గురించి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ గారి అభిప్రాయం:

    08/09/2007 5:24 am

    నాకు తెలిసి కూడా “జానక్యాః కమలామలాంజలి పుటేయాః” అన్న శ్లోకం ఆదిశంకరుని శ్రీరామకర్ణామృతంలోనిదే.

  6. న త్వం శోచితుమర్హసి గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    08/08/2007 6:28 pm

    రానారె గారి కధ మీద దిలీప్ గారి అభిప్రాయం బావుంది.కధలా విస్తరించి హృదయాన్ని జాలిగా తాకింది.మాండలిక పదాల సోయగం తో అలరించింది.

    కారణాంతరాలవల్ల నైనా కూడా ,రానారె గారి కధ ను ఇప్పటి దనకా miss అయినందుకు ఒకింత regret అయ్యాను.వెంటనే చదివాను.కడప మాండలిక భాషా సౌందర్యం తో,గుండెల్ని పిండే జాలితో కధలాగా కాక,అకస్మాత్తుగా ఎదురైన జీవితానుభవం లా సాగింది రానారె గారి రచన.రైతులకు ఎడ్లు ,వ్యవసాయానికి ఉపయోగపడే సాధనాలు,మూగజీవాలు మాత్రమే కాకుండా ,కుటుంబసభ్యులుగా వారి జీవితాలతో పరస్పర ప్రేమానుబంధం కలిగి ఉంటవి.రైతులకు ఎడ్లు బహిప్రాణాలుగా ఉండటం భారతీయ గ్రామీణ సంస్కృతి లో ఒక కమనీయమైన సత్యం.యాంత్రికపరమైన పురోగతిని తిరస్కరించలేకపోయినా ,హుందాగా నడుస్తూ పొలం దున్నే కోడెల సౌందర్యం ట్రాక్టర్ల రాకతో క్రమక్రమంగా కనుమరుగైపోవటం మనసులో ఎక్కడో ఒకింత బాధాకరంగా ఉంటుంది.
    రైతులకు ,ఎడ్లకు మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని రానారె గారు వారి కధ ద్వారా కండ్లు చెమ్మగిల్లేలా ,గుండె కుత్తుకలో పూడుకునిపోయినట్లుగా feel అయ్యే విధంగా చక్కగా చెప్పారు,చూపించారు.ఎద్దు చనిపోయిన తర్వాత కూడా తన
    యజమానిని గురించి బాధ పడటంతో ,మనసు పై జాలి మేఘాలు ఆవరిస్తవి.

    కాకపోతే ,ఇంతటి రసస్ఫోరక స్థితి ని పాఠకుడు చేరుకున్న తరవాత ,చనిపోయిన ఎద్దు చర్మం వల్ల వచ్చే డబ్బు కోసం యజమాని చేసే ప్రయత్నం కసుక్కున ముల్లులా గుచ్చుకుంటుంది.అది ఒక యదార్ధమైన విషయమే అయినా ,దానిని focus చెయ్యడం కధ సాధించిన రసానుభూతిని దెబ్బ తీస్తుంది.
    మరొకవిషయం: జీవన్మరణ విషయాలమీద ఊర్ధ్వ లోకాలవైపు సాగించే మహాభినిష్క్రమణం లో ఎద్దు ఆత్మ అంత వేదాంత ధోరణి లో ఆలోచించటం కధ సాధించిన రసౌచితికి ప్రతీఘాతంగా ఉంటుందనుకుంటున్నాను.ఎద్దు ఆత్మ అయినంతమాత్రంచేత ఇలా అనడం లేదు:ఎద్దు ఆత్మ,ఆదిశంకరులవారి ఆత్మ,మనందరి ఆత్మ,విశ్వాత్మ అంతా ఒకటే అని మన వేదంతం ద్వారా మనందరికీ తెలుసు.కాకపోతే ,సృజనాత్మక సాహితీ ప్రక్రియలలో బట్ట బయలుగా ప్రబోధపరంగా ఏమి చెప్పినా వాటి కళావైశిష్ట్యాన్ని అది దెబ్బతీస్తుంది.మెసేజ్ లేదా ప్రబోధం సాహిత్యప్రక్రియ కలిగించే రసానుభూతి లో అంతర్లీనమై పాఠకుడి ఉపచైతన్య స్థితి లోకి లేదా చైతన్యస్థితి లోకి మెల్లగా ప్రవేశించాలి.కధలో సాధించిన రసజ్ఞతను మానవీయ విలువలను పదిలపరచుకుంటూనే ఏదైనా ఒక జనన మరణాతీతమైన విషయాన్ని ప్రదిపాదించదలచుకుంటే ఎద్దు ఆత్మను తీసుకపోవటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అర్ధవంతమైన మందహాసాన్ని చాలా క్లుప్తంగా,సజెస్టివ్ గా విశదీకరిస్తే సరిపోను.

    అయినా రానారె గారిది నిస్సందేహంగా మంచి కధ,గొప్ప కధ,ఎప్పటికీ గుర్తుండే కధ.
    అభినందనలు.
    C.S.Rao

  7. రచయితలకు సూచనలు గురించి santhosh గారి అభిప్రాయం:

    08/07/2007 8:08 am

    ప్రియమైన ఎడిటర్ గారికి,
    మీ website చూడముచ్చటగ వుంది. మీ ప్రయత్నానికి జోహార్లు.
    ధన్యవాదములు
    ఇట్లు
    సంతోష్ కుమార్

  8. న త్వం శోచితుమర్హసి గురించి Dileep గారి అభిప్రాయం:

    08/06/2007 3:00 pm

    ఏమి చెప్పావుబ్బా భలే చెప్పావు, ఈ కథకు కథలోని పాత్రకు అలాగే నా నిజ జీవితంలోని సంఘటనకు చాలా దగ్గరి సంబంధం వుండాది. ఇది చదివినంత సేపు నాకు మావాడు కళ్లలోనే కనిపించాడు. మాకు వందపైనే అవులు వుండేవి కాని వాటికి పుట్టిన వాటిని నాటు గిత్తలు అనేవారు. వాటికంటే దేశపు ఎద్దులు బాగా నాజుకుగా వుంటాయి. అలాగే పనికూడా బాగ తొందరగా చేస్తాయి. అందుకని మా నాన్న ఒక కాడి అవి ఒక కాడి నాటు గిత్తలు పెట్టేవాడు. అందరి అలోచన కూడా అదే. అందుకే వ్యాపారము చేసే వాళ్ళు మా పక్క ఊరైన నీలకంఠరావు పేటకు ఈ దేశపు దూడలను తెచ్చి అమ్మేవారు, మా అమ్మ నాన్న కూడా ఉదయాన్నే పాలు పోయడానికి ఆ ఊరు వెళ్ళేవారు. అక్కడ మావాడి అందం, కాళ్ళు, కొమ్ములు, రంగు నచ్చి తీసుకొచ్చారు. మావాడు అన్నిటితో పాటే చాలా తెలివైన వాడు, చలాకి గాడు. మా ఇంటి కొచ్చిన కొన్ని రోజుల్లోనే మాతో బాగా కలిసి పొయాడు. వీడిని చిన్న పిల్ల వాడిలా చూసుకొనే వాళ్ళు. అన్ని అవులున్నా వాటితో పాటు మందలో తోలేవాళ్ళు కాదు, మా అమ్మ దుల్ల కు గరిక తేవడానికి మా గదగుండ్లబావి దగ్గరికి వెళ్ళేటపుడు వీడిని కూడా తీసుకెళ్ళి మేపుకొచ్చేవాళ్ళు. అలా అల్లారు ముద్దుగా పెంచాము. వీడిని మా గదగుండ్ల బావి దగ్గరికి తీసుకొని పోవడానికి పగ్గము అవసరము లేదు బుద్ధిగా మా వెనకాలే వచ్చేవాడు. నాక్కూడా తెగ నచ్చాడు. నన్ను చూస్తే అలా మెడ పైకి ఎత్తుకొని దగ్గరికి వచ్చేవాడు, ఎందుకంటే మెడ కింద నెమరించుకొవడము చాలా ఇష్టం వాడికి.

    నేను కూడా అల్లరే, చదువు అంతగా ఎక్కేది కాదు, పొలం దగ్గరకు వెళ్ళడము మహా ఇష్టం. అందులొ ఆ మధ్యే మా లెక్కల్ మాస్టారును తిట్టానని మా నాన్న చెవిలో పడింది. నేను ఏమి తిట్టలేదండి – మా మాస్టారు రెండు మూడు గైడులు ముందరెట్టుకొని బోర్డు పైన అన్ని విధాల సమాధానాలు వ్రాసేవాడు. అందులో ఆ రోజు అతను ఏదో తికమక పడ్డాడు, అందుకే మార్చి మార్చి సమాధానాలు చెప్పాడు. సరే అని నేను వూరుకోకుండా నా పక్క వాడితో “ఈ గుడ్డి సారుకు కనిపించి సావలేదు అందుకే మార్చి మార్చి సమాధానాలు చెపుతున్నాడు” అన్నా నా పక్క వాడితో. అంతే, ఇంక వాడు మంచిగా చేతులు కట్టుకొని నేను అన్నమాటలు మాస్టారుకు చెప్పెసాడు. మనకు వల్లు వాగింది, విషయం ఇంటిదాక తెలిసింది. ఇంక లాభం లేదని చదువు మానిపించారు.

    అప్పుడు మావాడు మంచి రంజుమీదున్నాడు, ఆ నడక ఆ ధీమా, ఎకర పొలం ఇరసాలు ఏమిటి, నాలుగు సాల్లు ముల్లు కర్ర లేకుండానే దున్నేస్తా అనేటట్టుగా. అయితే మాది రాళ్ళ చేను (అందుకే దాని పేరే “రాళ్ళచేను “). అందుకే పని ఎక్కువ అవడంతో మనవాడికి ఒక తెల్లదొర గాడిని జత తెచ్చారు. వీడు కూడా మంచి ఆరు అడుగుల అందగాడు, నాకు వీళ్ళంటే ఎంతో ఇష్టం. ఆ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. మావాడికి, ఈతెల్లదొరగాడికి, నాకు బాగా షాడకేసే పని వచ్చి పడింది. మా నాన్న సామాన్యంగా ఒప్పుకోడు. బాగా పొలం దుక్కి పట్టాలంటాడు. ఆవిధంగా ఒక నెల రోజులు రోజూ బురదలో పనే. వరి నాట్లు వేసారు. పని అయితే అయింది కాని మా వాడు బాగా మెత్తపడ్డాడు (“మెత్త కాళ్ళు పడ్డాయి”). మామూలుగా అలా బుడదలో పని వస్తే ముందే లాలాలు (కాళ్ళకు కిందా ఇనుప ముక్కలు) కొడతారు చెప్పులు లాగా. అవిలేకపొవడం వల్ల గట్టలు బాగ మెత్తపడ్డయి. ఇద్దరు నడవలేక పొతున్నారు, నాకు చాలా బాధేసింది. సరే అని ఎవరికి చెప్పకుండా నాతో వున్న డబ్బులతో మా ఊరికొచ్చిన సాయిబు దగ్గర లాలాలు కొట్టించడానికి తీసుకెళ్ళాను.

    మా అమ్మ ఒక వైపు చెపుతూనే వుంది (వాటికి లాలాలు కొట్టాలంటే బలవంతంగా కింద పడుకోబెట్టాలి) ఇంతకు ముందు అవి ఎప్పుడు లాలాలు తొడిగించుకోలేదు, వద్దు నాయనా అని. కాని అప్పుడు మా అమ్మ చెప్పేదానికంటే నాకు వాటిమీద ఉన్న ప్రేమతో లేదు ఎలాగయినా కొట్టించాలని తీసుకెళ్ళాను. మన వాడు బుద్ధిగా తొడిగించుకున్నాడు. ఇంకా తెల్లదొరగారికి కొంచం భయం ఎక్కువ, పడుకోలేదు. సాయిబు, మాఊరిలో వేమయ్య ఇద్దరు కలిసి బలవంతంగా పడుకోబెట్టారు. అంతా అయిపోయింది. లేపితే లేచి ముందు కాళ్ళపైనే నిల్చుకుంది. నాకు తెలియలేదు ఎమి అయిందో. ఇంటికి తీసుకెళ్ళాను. అందరు చూశారు కాలు బెసికింది అన్నారు. మా రామయ్య పెద్దనాన్న ఏవో పసుర్లు పూసాడు. ఏమి లాభం లేదు. ఇంక ఎవరిసలహాతోనో కలిపైన వాత పెట్టారు. అయినా బాగా కాలేదు. జోడు తప్పింది. ఇద్దరినీ విడదీసారు. మా వాడిని అమ్మేసారు ఎవరికో. చాలారోజులు నేను బాధపడ్డాను, నా మూలంగానే కాలు పోయిందని. చాలాకాలం వరకూ ఇవి నా కలల్లో ఎక్కువగా కనిపించేవి. మీరు మీ కథ తో మళ్ళీ వాటిని గుర్తు తెచ్చి నా కళ్ళలోకి నీళ్ళు తెప్పించారు.

    దిలీప్.

  9. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి mohanraokotari గారి అభిప్రాయం:

    08/06/2007 6:46 am

    xellent

  10. అతిథి వ్యయో భవ గురించి sreedhar గారి అభిప్రాయం:

    08/02/2007 2:40 pm

    To put it mildly it’s a pointless story. Writer tried (in vain) to fabricate a story around a peculiar situation he found himself (or someone he knew had been subjected to). A good writer takes a simple incident and beams it through prism of imagination, sprinkles fiction, pad little melodrama, tops with some wisdom and weaves a good story.

    Folly of many writers (or directors like dasari) is that they get carried away with mundane incidents and expect the readers to indulge in their ill-conceived euphoria.

    Having said the above, I find Mr. Raavi Subbarao’s criticism too harsh and silly. We may not like the story or the style, but to go into details and analyze sentences and criticize is child-like. Someone aptly used “Radhranveshana”.

    Cheers, DumDum Bhattu

« 1 ... 1465 1466 1467 1468 1469 ... 1555 »