మీరంతా ఏదో కృష్ణగారికేవీ తెలీనట్టు సలహాలివ్వొచ్చారే?
శేషేంద్రశర్మని తెలిసినవారికి ఈ మాత్రం తెలీదనుకున్నారా? ఐనాఎంత అమాయకులండీ … అది చదవండీ ఇది చదవండీ అని సలహాలు చెప్పినంత మాత్రాన వినెయ్యడానికి ఆయనేం వెర్రివాడా? పద్యం రాసి దానిమీద సంజాయిషీ ఇవ్వాల్సి రావడం జోకుని వివరించడం కన్న ఘోరం. అరణ్యకవితలకి ఆ దుస్థితి పట్టలేదనే నేననుకుంటున్నా.
మంచి రచన. తలవనితలంపుగా ఇదే విషయాన్ని గురించి నేను రాసినది కూడా ఈ నెలే వెలువడింది.
సూక్ష్మజీవులు మనకన్నా ముందు నుంచీ కొనసాగుతున్నాయి. అవి ‘బతకనివ్వడం’ వల్లనే మనం బతకగలుగుతున్నాం. వేమూరివారు చెప్పినట్టుగా ఈ లెక్కన ‘నేను’ అన్నది బహువచనం!
అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:
09/06/2007 7:42 am
మాబాపదిగనోడు గారు,
“కవిత్వాన్నీ, వచనాన్నీ విడదీసే ప్రాథమిక అంశాలేవి?” , “పాఠకుడు కవి స్థాయికి ఎదగాలా , కవే పాఠకుడి స్థాయికి దిగాలా” వంటి మౌలిక ప్రశ్నల దిశగా చర్చ సాగుతోంది. వీటి మీద ఇప్పటికే లెక్కలేనన్ని వాదనలు జరిగాయి. మీరు , నేను కొత్తగా చర్చించేదేమీ లేదు. కిరణ్ గారు చెప్పినట్టు యదుకుల భూషణ్ గారి “నేటికాలపు కవిత్వం — తీరు తెన్నులు” పుస్తకం చదవండి. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా ఒక కొత్త కోణాన్ని చూసినవారవుతారు. ఈ సైటులోనే ఉన్న ఇస్మాయిల్ గారి “కరుణ ముఖ్యం” పుస్తకం కూడా చదవండి వీలైతే.
అరణ్య కవితలు గురించి KS Kiran Kumar గారి అభిప్రాయం:
09/06/2007 6:34 am
కృష్ణ గారు
అసలు ఈ కవిత కన్నా కూడా, మీ విమర్శ మాత్రం అర్ధం కావడంలేదు. ఒకవైపు మనసును హత్తుకునే భావం లేదంటూ.. ఇందువల్లే మన భాషకి అధోగతిపడుతున్నదని ప్రకటించేసారు.
ఈ కవితలోని భావం మీకు అర్ధం కాలేదంటే, ఏవో కవితా సంకలనాలు చదివి పదును పెంచుకోమని మీకూ ఓ ఉచితసలహా పారేయొచ్చు. కానీ, ఈ కవితలోని ఏ భాష మీకు అర్ధం కాక, మన భాష అధోగతి పడుతోందని బాధపడుతున్నారో!!
సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు, ఈ భావనతో వచ్చిన ఇతరత్రా కవితలని మీరు ఇక్కడ ఉదహరించితే, విమర్శ మరింత సూటిగా ఉండగలిగేది.
‘యదుకులభూషణ్ గారు వ్రాసిన ‘నేటికాలం కవిత్వం తీరుతెన్నులు’ మీరోసారి చదివి, విమర్శలు ఎలా పదునుగా ఉండాలి అనేది నేర్చుకుంటే బాగుంటుంది.
అలానే మరోసారి అలోక్ గారు వ్రాసిన విషయం ప్రశాంతంగా చదవండి. ఆయన ఏం చెబుతున్నది అర్ధం అవుతుంది.
నా ఫ్రాన్స్ అనుభవాలు చదివి మెచ్చుకొన్న వారందరికి ధన్యవాదాలు. ఒక రచనకి ప్రతిఫలం ఇంతకన్నా ఏముంటుంది!
నా వ్యాసంలో చెప్పని ఒకటి, రెండు విషయలు చెప్పాలని ఉంది.ఈ వ్యాసం రాయటానికి మరి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, అమెరికా దేశానికి వలస రాక ముందు 30 ఏళ్ళు ఇండియాలో గడిపిన నేను, నా 15 ఏళ్ళ అమెరికా జీవితం తరవాత ఫ్రాన్స్ వెళ్ళటంతో, ఫ్రాన్స్లో మా అనుభవాలని రెండు కోణాల్నుంచి చూడటం మొదలు పెట్టాను! అమెరికా జీవితానుభవంతో ఫ్రాన్స్ చూడటం ఒకటైతే, మేము తిన్నగా ఇండియా నుంచి ఫ్రాన్స్ వెళ్ళి ఉంటే, ఫ్రాన్స్ను ఎలా చూసేవాళ్ళం అన్నది మరోటి. రెండో కారణం ఏమిటంటే, ఒక తెలుగువాడిగా, నాకొచ్చిన అవకాశాల వల్ల కలిగిన అనుభవాలను తోటి తెలుగువారితో పంచుకోటం అవసరంగా నాకు అనిపించడం!
అన్నిటికంటే, ముఖ్యమైన విషయం – నాకూ, రామన్నకీ వయస్సులో చాలా పెద్దవాళ్లయిన అక్కయ్యలు ఇండియాలో ఉన్నారు. వారికి, తెలుగు తప్ప మరే భాషా రాదు! వారి కోసం కూడా రాయడం అన్నిటి లోకి పెద్ద ప్రేరణ!
కొత్తపాళీ గారూ : మీరు అన్నట్లు మరిన్ని అనుభవాలు త్వరలో మీతో పంచుకోడనికి ప్రయత్నిస్తాను. అన్నట్లు, మీరు నాకు బాగా పరిచయమైన వారిలా అనిపిస్తున్నారు. వీలయితే, నాకు ఈమైల్ ఇవ్వండి.
రోహిణీప్రసాద్ గారూ : మీరన్నది నిజమే! ఫ్రెంచి వారికి వారి భాష, సంస్కృతుల మీద అభిమానం వల్లే, ఇంగ్లీషు వారు ఇండియాను పరిపాలినంత విసృతంగా, ఫ్రెంచి వారు ఇండియాను పరిపాలించలెకపోయారేమో!
“కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను.” అని అన్నారు బాగుంది. కానీ, అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా?
“ఎంతదారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ”
పైది వచనం కాదా?
“గలగలలాడే
సెలయేటి
అలలన్నీ
వెలిగిపోతూ…”
సెలయేట్లో అలలు ఎక్కడుంటాయండీ? గలగల పారే సెలయేరులో అలలా?…… ఏదో తేడాగా ఉంది. ఇకపోతే, మీరు వాడిన శైలి శేషేంద్ర శర్మ గారి శైలి లాగానే ఉంది. కాకపోతే, మీ రచనలో మీరు పాఠకుల బుర్రకి మరీ పని పెడదామన్న తాపత్రయంలో కొంచం దారి తప్పారు అనిపించింది.
@అలోక్,
మాదిగలు, బాపనోడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావ్? ఇక్కడ జరుగుతున్నదేమిటి, మీరు మాట్లాడేదేమిటి? ఓ గద్దర్ జనపదంలో పాటలు కట్టి పాడాడంటే అర్థం ఉంది. కనీసం ఆయన వాళ్ళ కర్థమయ్యే భాషలో పాడతాడు. తమరు వక్కాణించిన పెద్దవాళ్ళ కవిత్వం పెద్దవాళ్ళు చదువుకోటానికి , విమర్శించుకోటానికి, పీ.హెచ్.డి లకి పనికొస్తుందంతే. అందులో ఒక్క అక్షరం ముక్క నువ్వు అన్న ఆ పేద జనానికి అర్థం కాదు. అయినా, ఇదేం జబ్బో! దళితుల్ని పొగిడి, బ్రాహ్మణున్ని తిడితే గొప్పవాడైపోతామనుకుంటారెందుకో?
మామూలుగా హార్మోనియం మీద పలికే గమకాలన్నీ కీబోర్డు మీద కూడా పలికించవచ్చు. మోడల్ ని బట్టి కీబోర్డులో పియానో, వయొలిన్ మొదలైన ఎన్నో ధ్వనులు పలుకుతాయి కనక వీలును బట్టి ఏదో వాటిలో ఒకటి ఎంచుకోవచ్చు. ఇవికాక కొన్ని మోడల్స్ లో పిచ్ బెండర్ సదుపాయం ఉంటుంది. స్ప్రింగ్ లోడెడ్ పద్ధతిలో పనిచేసే ఈ మీటను ఉపయోగించి కుడిచేత్తో వాయిస్తున్న స్వరానికి అటూ ఇటూ ఉండే స్వరాలను సాగదీసినట్టుగా పలికించవచ్చు. దీన్ని ఉపయోగించి కీబోర్డు మీద కొందరు నిపుణులు వీణ, నాదస్వరం వగైరా పద్ధతుల్లో అద్భుతమైన కర్ణాటక గమకాలను పలికించగలరు. దీనికి ఎంతో అభ్యాసం కావాలి. కీబోర్డు ధ్వనులన్నీ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో సృష్టి అవుతున్నవే కనక గమకాల ‘భ్రమ’ను కలిగించడం కూడా సాధ్యమవుతుంది.
పాశ్చాత్య సంగీతంలో ఎడమచేతిని సామాన్యంగా బేస్ (మంద్ర) స్వరాల కోసమో, కార్డ్ ప్రోగ్రెషన్స్ (స, గ, ప మొదలైన స్వరాల కాంబినేషన్) కోసమో ఉపయోగిస్తారు. ఇటువంటివి మన శాస్త్రీయసంగీతంలో అవసరం కావు. పాశ్చాత్య సంగీతంలో పోలీఫోనీ (ఒకేసారిగా పలు స్వరాలు మోగడం) ఉంటుంది. మనది మోనోఫోనీ. ఎటొచ్చీ కీబోర్డు మీద మన దేశపు సినిమా పాటలు వాయిస్తున్నప్పుడు రెండో చేతిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అయితే కుడి చేత్తో పాట వాయిస్తున్నప్పుడు తక్కిన ఎఫెక్ట్స్ కోసమని ఎడమచేతిని ఉపయోగించడమూ కద్దు.
అరణ్య కవితలు గురించి కొత్త రవికిరణ్ గారి అభిప్రాయం:
09/06/2007 6:08 pm
వావ్.. నాకైతే మళ్ళీ అడవుల కెళ్ళి వచ్చినట్టే అనిపించింది. బాగా వ్రాశారు సుబ్బూ..
కొత్త రవికిరణ్
అరణ్య కవితలు గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:
09/06/2007 5:56 pm
మీరంతా ఏదో కృష్ణగారికేవీ తెలీనట్టు సలహాలివ్వొచ్చారే?
శేషేంద్రశర్మని తెలిసినవారికి ఈ మాత్రం తెలీదనుకున్నారా? ఐనాఎంత అమాయకులండీ … అది చదవండీ ఇది చదవండీ అని సలహాలు చెప్పినంత మాత్రాన వినెయ్యడానికి ఆయనేం వెర్రివాడా? పద్యం రాసి దానిమీద సంజాయిషీ ఇవ్వాల్సి రావడం జోకుని వివరించడం కన్న ఘోరం. అరణ్యకవితలకి ఆ దుస్థితి పట్టలేదనే నేననుకుంటున్నా.
తిష్టతత్వం జ్వలించింది గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/06/2007 9:19 am
మంచి రచన. తలవనితలంపుగా ఇదే విషయాన్ని గురించి నేను రాసినది కూడా ఈ నెలే వెలువడింది.
సూక్ష్మజీవులు మనకన్నా ముందు నుంచీ కొనసాగుతున్నాయి. అవి ‘బతకనివ్వడం’ వల్లనే మనం బతకగలుగుతున్నాం. వేమూరివారు చెప్పినట్టుగా ఈ లెక్కన ‘నేను’ అన్నది బహువచనం!
అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:
09/06/2007 7:42 am
మాబాపదిగనోడు గారు,
“కవిత్వాన్నీ, వచనాన్నీ విడదీసే ప్రాథమిక అంశాలేవి?” , “పాఠకుడు కవి స్థాయికి ఎదగాలా , కవే పాఠకుడి స్థాయికి దిగాలా” వంటి మౌలిక ప్రశ్నల దిశగా చర్చ సాగుతోంది. వీటి మీద ఇప్పటికే లెక్కలేనన్ని వాదనలు జరిగాయి. మీరు , నేను కొత్తగా చర్చించేదేమీ లేదు. కిరణ్ గారు చెప్పినట్టు యదుకుల భూషణ్ గారి “నేటికాలపు కవిత్వం — తీరు తెన్నులు” పుస్తకం చదవండి. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా ఒక కొత్త కోణాన్ని చూసినవారవుతారు. ఈ సైటులోనే ఉన్న ఇస్మాయిల్ గారి “కరుణ ముఖ్యం” పుస్తకం కూడా చదవండి వీలైతే.
రచయితలకు సూచనలు గురించి keshav గారి అభిప్రాయం:
09/06/2007 6:53 am
మీ ప్రయత్నం చాలా బాగుంది. అభినందనీయం.
అరణ్య కవితలు గురించి KS Kiran Kumar గారి అభిప్రాయం:
09/06/2007 6:34 am
కృష్ణ గారు
అసలు ఈ కవిత కన్నా కూడా, మీ విమర్శ మాత్రం అర్ధం కావడంలేదు. ఒకవైపు మనసును హత్తుకునే భావం లేదంటూ.. ఇందువల్లే మన భాషకి అధోగతిపడుతున్నదని ప్రకటించేసారు.
ఈ కవితలోని భావం మీకు అర్ధం కాలేదంటే, ఏవో కవితా సంకలనాలు చదివి పదును పెంచుకోమని మీకూ ఓ ఉచితసలహా పారేయొచ్చు. కానీ, ఈ కవితలోని ఏ భాష మీకు అర్ధం కాక, మన భాష అధోగతి పడుతోందని బాధపడుతున్నారో!!
సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు, ఈ భావనతో వచ్చిన ఇతరత్రా కవితలని మీరు ఇక్కడ ఉదహరించితే, విమర్శ మరింత సూటిగా ఉండగలిగేది.
‘యదుకులభూషణ్ గారు వ్రాసిన ‘నేటికాలం కవిత్వం తీరుతెన్నులు’ మీరోసారి చదివి, విమర్శలు ఎలా పదునుగా ఉండాలి అనేది నేర్చుకుంటే బాగుంటుంది.
అలానే మరోసారి అలోక్ గారు వ్రాసిన విషయం ప్రశాంతంగా చదవండి. ఆయన ఏం చెబుతున్నది అర్ధం అవుతుంది.
మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
09/06/2007 6:02 am
నా ఫ్రాన్స్ అనుభవాలు చదివి మెచ్చుకొన్న వారందరికి ధన్యవాదాలు. ఒక రచనకి ప్రతిఫలం ఇంతకన్నా ఏముంటుంది!
నా వ్యాసంలో చెప్పని ఒకటి, రెండు విషయలు చెప్పాలని ఉంది.ఈ వ్యాసం రాయటానికి మరి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, అమెరికా దేశానికి వలస రాక ముందు 30 ఏళ్ళు ఇండియాలో గడిపిన నేను, నా 15 ఏళ్ళ అమెరికా జీవితం తరవాత ఫ్రాన్స్ వెళ్ళటంతో, ఫ్రాన్స్లో మా అనుభవాలని రెండు కోణాల్నుంచి చూడటం మొదలు పెట్టాను! అమెరికా జీవితానుభవంతో ఫ్రాన్స్ చూడటం ఒకటైతే, మేము తిన్నగా ఇండియా నుంచి ఫ్రాన్స్ వెళ్ళి ఉంటే, ఫ్రాన్స్ను ఎలా చూసేవాళ్ళం అన్నది మరోటి. రెండో కారణం ఏమిటంటే, ఒక తెలుగువాడిగా, నాకొచ్చిన అవకాశాల వల్ల కలిగిన అనుభవాలను తోటి తెలుగువారితో పంచుకోటం అవసరంగా నాకు అనిపించడం!
అన్నిటికంటే, ముఖ్యమైన విషయం – నాకూ, రామన్నకీ వయస్సులో చాలా పెద్దవాళ్లయిన అక్కయ్యలు ఇండియాలో ఉన్నారు. వారికి, తెలుగు తప్ప మరే భాషా రాదు! వారి కోసం కూడా రాయడం అన్నిటి లోకి పెద్ద ప్రేరణ!
కొత్తపాళీ గారూ : మీరు అన్నట్లు మరిన్ని అనుభవాలు త్వరలో మీతో పంచుకోడనికి ప్రయత్నిస్తాను. అన్నట్లు, మీరు నాకు బాగా పరిచయమైన వారిలా అనిపిస్తున్నారు. వీలయితే, నాకు ఈమైల్ ఇవ్వండి.
రోహిణీప్రసాద్ గారూ : మీరన్నది నిజమే! ఫ్రెంచి వారికి వారి భాష, సంస్కృతుల మీద అభిమానం వల్లే, ఇంగ్లీషు వారు ఇండియాను పరిపాలినంత విసృతంగా, ఫ్రెంచి వారు ఇండియాను పరిపాలించలెకపోయారేమో!
ధన్యవాదాలతో,
లక్ష్మన్న
Lark_Vishnubhotla@yahoo.com
అరణ్య కవితలు గురించి మాబాపదిగనోడు గారి అభిప్రాయం:
09/06/2007 5:15 am
సుబ్రహ్మణ్యం గారు,
“కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను.” అని అన్నారు బాగుంది. కానీ, అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా?
“ఎంతదారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ”
పైది వచనం కాదా?
“గలగలలాడే
సెలయేటి
అలలన్నీ
వెలిగిపోతూ…”
సెలయేట్లో అలలు ఎక్కడుంటాయండీ? గలగల పారే సెలయేరులో అలలా?…… ఏదో తేడాగా ఉంది. ఇకపోతే, మీరు వాడిన శైలి శేషేంద్ర శర్మ గారి శైలి లాగానే ఉంది. కాకపోతే, మీ రచనలో మీరు పాఠకుల బుర్రకి మరీ పని పెడదామన్న తాపత్రయంలో కొంచం దారి తప్పారు అనిపించింది.
@అలోక్,
మాదిగలు, బాపనోడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావ్? ఇక్కడ జరుగుతున్నదేమిటి, మీరు మాట్లాడేదేమిటి? ఓ గద్దర్ జనపదంలో పాటలు కట్టి పాడాడంటే అర్థం ఉంది. కనీసం ఆయన వాళ్ళ కర్థమయ్యే భాషలో పాడతాడు. తమరు వక్కాణించిన పెద్దవాళ్ళ కవిత్వం పెద్దవాళ్ళు చదువుకోటానికి , విమర్శించుకోటానికి, పీ.హెచ్.డి లకి పనికొస్తుందంతే. అందులో ఒక్క అక్షరం ముక్క నువ్వు అన్న ఆ పేద జనానికి అర్థం కాదు. అయినా, ఇదేం జబ్బో! దళితుల్ని పొగిడి, బ్రాహ్మణున్ని తిడితే గొప్పవాడైపోతామనుకుంటారెందుకో?
కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/06/2007 4:58 am
మామూలుగా హార్మోనియం మీద పలికే గమకాలన్నీ కీబోర్డు మీద కూడా పలికించవచ్చు. మోడల్ ని బట్టి కీబోర్డులో పియానో, వయొలిన్ మొదలైన ఎన్నో ధ్వనులు పలుకుతాయి కనక వీలును బట్టి ఏదో వాటిలో ఒకటి ఎంచుకోవచ్చు. ఇవికాక కొన్ని మోడల్స్ లో పిచ్ బెండర్ సదుపాయం ఉంటుంది. స్ప్రింగ్ లోడెడ్ పద్ధతిలో పనిచేసే ఈ మీటను ఉపయోగించి కుడిచేత్తో వాయిస్తున్న స్వరానికి అటూ ఇటూ ఉండే స్వరాలను సాగదీసినట్టుగా పలికించవచ్చు. దీన్ని ఉపయోగించి కీబోర్డు మీద కొందరు నిపుణులు వీణ, నాదస్వరం వగైరా పద్ధతుల్లో అద్భుతమైన కర్ణాటక గమకాలను పలికించగలరు. దీనికి ఎంతో అభ్యాసం కావాలి. కీబోర్డు ధ్వనులన్నీ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో సృష్టి అవుతున్నవే కనక గమకాల ‘భ్రమ’ను కలిగించడం కూడా సాధ్యమవుతుంది.
పాశ్చాత్య సంగీతంలో ఎడమచేతిని సామాన్యంగా బేస్ (మంద్ర) స్వరాల కోసమో, కార్డ్ ప్రోగ్రెషన్స్ (స, గ, ప మొదలైన స్వరాల కాంబినేషన్) కోసమో ఉపయోగిస్తారు. ఇటువంటివి మన శాస్త్రీయసంగీతంలో అవసరం కావు. పాశ్చాత్య సంగీతంలో పోలీఫోనీ (ఒకేసారిగా పలు స్వరాలు మోగడం) ఉంటుంది. మనది మోనోఫోనీ. ఎటొచ్చీ కీబోర్డు మీద మన దేశపు సినిమా పాటలు వాయిస్తున్నప్పుడు రెండో చేతిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అయితే కుడి చేత్తో పాట వాయిస్తున్నప్పుడు తక్కిన ఎఫెక్ట్స్ కోసమని ఎడమచేతిని ఉపయోగించడమూ కద్దు.
భూషణీయం గురించి mohanraokotari గారి అభిప్రాయం:
09/06/2007 4:53 am
గొప్ప విషయాలు ఎంతో గొప్పగా అనుభవించి పలవరిస్తే, మమ్ములను మీ మనసులొకి తీసికెళ్తే, అనుభవాన్ని చూపు ముందు నిలిపి తాదత్మ్య పరిస్తే , చెప్పేదేముంది.