Comment navigation


15548

« 1 ... 1441 1442 1443 1444 1445 ... 1555 »

  1. బహు ‘మతులు’ గురించి Sowjanya B గారి అభిప్రాయం:

    11/27/2007 3:01 pm

    కధ చాలా బాగుంది.

  2. అదిగో పులి గురించి Golle Raj Kumar గారి అభిప్రాయం:

    11/26/2007 4:02 am

    this is very nice story

  3. ట్రాఫిక్ సిగ్నల్ – A Twenty first century love story గురించి Golle Raj Kumar గారి అభిప్రాయం:

    11/26/2007 3:58 am

    Is very nice story I Like it

  4. ఉత్తర కిష్కింధ (నాటిక) గురించి Ch.Badrinath గారి అభిప్రాయం:

    11/26/2007 3:22 am

    It is very good. The story has significanace even today.

  5. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/25/2007 10:26 pm

    నా శాస్త్రరంగం మీద నేను తెలుగులో రాసిన ఈ మొదటి వ్యాసాన్ని మెచ్చుకొని ప్రోత్సహించినవారికీ, సరిదిద్దిన సంపాదకులకీ కృతజ్ఞతలు.

    తెలుగు సాహిత్యంలోనే కాక పత్రికా రంగంలో కూడా ఆరితేరిన కొడవటిగంటి కుటుంబరావు, వైజ్ఞానిక విషయాలు ఆకర్షించేది నూటికొక్కరినే అని వాపోయారు. వారిలో పదో శాతమయినా నారచనలో ఇసుమంత విలువైనదేదైనా గ్రహిస్తే నాకదే పదివేలు.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. ఫాంటసీ — రియాలిటీ గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    11/25/2007 6:00 pm

    “కోర్సును నిర్వహిస్తున్న విభాగం వారు తెలుగు కోర్సుపై వివక్షత చూపకుండా ఆప్రమత్తంగా ఉండాలి. ” అని కృష్ణారావు గారు రాసేరు. కోర్సును నిర్వహిస్తున్న విభాగం వారు తెలుగు కోర్సుపై ఎందుకు వివక్షత చూపుతున్నారో మాలాంటి వారికి తెలిస్తే మా జాగ్రత్తలో మేము ఉంటాము ఇక్కడ బెర్క్లీలో. పత్రికా ముఖంగా చెప్పటం ఇష్టం లేకపోతే ముఖస్థంగానో, మరేదైనా అనుకూలమైన పరోక్ష పద్ధతిలోనో కృష్ణారావు గారు సలహాలు ఇవ్వగలరు.

  7. విద్యాసుందరి గురించి rajendrakumar గారి అభిప్రాయం:

    11/24/2007 8:54 am

    విద్యా సుందరి వ్యాసం రెండు,మూడుసార్లు చదివించింది.రావు గారి శైలి అంతరాతీయ వ్యాసరచనా సంప్రదాయాలను పాటిస్తూ,సరళంగా సాగింది.ఒక జీవితచరిత్ర గ్రంధం లోనో,పీ హెచ్ డి థీసిస్ లోనో ఇచ్చేంత సమాచారాన్ని రావు గారు ఒక్క వ్యాసంలో అందించి తెలుగు వ్యాసకోశాన్ని సుసంపన్నం చేసారు.రచన మొత్తం మీద ఒకటో రెండో పదాలు మాత్రమే ఎక్కువ గా వాడారంటే తన రచన మీద,భాష మీద ఆయనకున్న పట్టు అర్ధమవుతోంది. రావు గారి లేఖిని నుంచి మరిన్ని ఉత్తమ రచనలు వెలువడాలని కోరుకుంటున్నాను.

    రాజేంద్ర కుమార్ దేవరపల్లి

    http://visakhateeraana.blogspot.com/

  8. ఫాంటసీ — రియాలిటీ గురించి Krishna Rao Maddipati గారి అభిప్రాయం:

    11/22/2007 8:46 am

    ఒక చిన్న సవరణ: యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో డిట్రాయిట్ తెలుగు వాళ్ళ సహకారంతో ప్రారంభించిన తెలుగు విద్యాబోధనా కార్యక్రమం మూతబడింది!

    “కర్ణుడి చావుకి కారణాలనేకం” అన్నట్టు దీనికీ చాలా కారణాలున్నాయి. ఐదు సంవత్సరాలపాటు సగం ఖర్చు మేం భరిస్తాం అన్న యూనివర్సిటీ వాళ్ళు బూసయ్యగారి ప్రభుత్వం డబ్బులివ్వటంలేదని చేతులెత్తేసింది. ఈ కోర్సుని నడుపుతున్న దక్షిణాసియా విభాగం సవతితల్లి చూపుతో తెలుగు కోర్సు ఒకటుందని విద్యార్ధులకు తెలియజేసే ప్రయత్నాలు ఇసుమంతైనా చెయ్యక పోవడంతో, ఎన్రోల్మెంటు తగినంతగా ఉన్న మూడేళ్ళలో ఎప్పుడూ జరగలేదు. ఇహ మా ఊరివాళ్ళు డబ్బులిచ్చి చేతులు దులుపుకున్నారు గాని కోర్సులో ఎన్రోల్మెంటు పెంచే ప్రయత్నాలేవీ చెయ్యలేదు. చివరిగా ఒక మిలియన్ డాలర్లు ఇస్తే తెలుగు కోర్సును నిరాటంకంగా నడుపుతాం అని యూనివర్సిటీ వాళ్ళంటే, ఆ డబ్బును సమకూర్చడానికి చేసిన ప్రయత్నాలూ పురిట్లోనే సంధికొట్టాయి. తలుచుకుంటే దీనికి కావలసినంత డబ్బు ఇవ్వగలిగిన కోటీశ్వరులు మా ఊళ్ళో లేకకాదు. పిల్లి మెడలో గంట కట్టే పని ప్రతి ఎలుకా ప్రక్కనున్న ఎలుక మీద పెట్టి తప్పుకోవడమే దీనిక్కారణం!

    డిట్రాయిట్ అనుభవంతో మిగిలిన ప్రాంతాలవాళ్ళు ఈ క్రింది జాగ్రత్తలు వహిస్తారని ఆశిస్తాను:

    1. బోధనా కార్యక్రమం ఉన్నచోట తెలుగు వారి పిల్లల్నందరినీ సమాయత్త పరిచి, బ్రతిమాలో, బామాలో, బెదిరించో, కాళ్ళమీద పడో, లేకపోతే వాళ్ళ సెంటిమెంటును వాడుకునో, ఎన్రోల్మెంటు తగినంతగా ఉండేటట్టు చూడాలి.
    2. యూనివర్సిటీతో గాని, ప్రభుత్వంతోగాని సంబంధం లేకుండా కోర్సునో పరిశోధనా విభాగాన్నో నిరంతరంగా నడపగలిగే ధన సముపార్జన ముందుగానే జరగాలి.
    3. కోర్సును నిర్వహిస్తున్న విభాగం వారు తెలుగు కోర్సుపై వివక్షత చూపకుండా ఆప్రమత్తంగా ఉండాలి.

  9. కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:

    11/19/2007 2:22 pm

    కన్యాశుల్కమును ఆంధ్రభారతిలో క్రిందిచోట చదువగలరు.
    http://www.andhrabharati.com/nATakamulu/index.html

    నమస్సులతో,
    శాయి.

  10. ట్రాఫిక్ సిగ్నల్ – A Twenty first century love story గురించి sree గారి అభిప్రాయం:

    11/19/2007 2:22 pm

    శైలి చాలా బాగుంది. చావుగీత నవ్వు తెప్పించింది.

« 1 ... 1441 1442 1443 1444 1445 ... 1555 »