ఇది చాలా ముఖ్య విషయాలను ప్రస్తావించే వ్యాసం.నిజానికి నాలెక్కన ఇది రెండుమూడు భాగాలుగా, సీదాసాదా డ్రాయింగులతో, అన్నేసి సంస్కృతభూయిష్ఠ పదాలు లేకుండా, సామాన్యపాఠకులకు అర్థం అయేలా రాయవలసిన వ్యాసం. సిమెట్రీ (సౌష్ఠవం) అనేది కేవలం పదాల వర్ణనతో వివరించడం కష్టం. లైన్ డ్రాయింగులతో, గుండ్రంగా తిప్పినట్టున్న సంకేతాలతో, సవివరంగా సూచించాలి. ప్రోటీన్ల నిర్మాణం నుంచి ఫుల్లర్ డోమ్ దాకా అన్నిటికీ వర్తించే ఈ వ్యాసం ఇంకా తేలికభాషలో రాయడం చాలా అవసరం. సబ్జక్ట్ రచయితకు కరతలామలకం అనడంలో మాత్రం సందేహం లేదు.
రచయితగారూ,
మీరు హాస్యం అనుకున్నది మీరు రాశారు. మీ అభిప్రాయాలని మీరు రాశారు. అది అందరికీ నచ్చాలని లేదు. నచ్చని వాళ్ళు తమ అభిప్రాయాలని తాము వెలిబుచ్చుతారు. అంతే! ఇందులో క్షమించమని అడిగేంత చెడ్డ విషయం గానీ, నెగటివ్ తనం గానీ వుందని నేను అనుకోవడం లేదు.పాఠకులకి వ్యాఖానించే హక్కు వున్నట్టే, రచయితలకి కూడా తమ అభిప్రాయాలని రాసుకునే హక్కు వుంటుంది. ఇందులో క్షమాపణలూ, అవీ అనవసరమని నేను అనుకుంటున్నాను. రాయగలిగే శక్తి వున్నప్పుడు, మంచి సబ్జెక్టు ఎన్నుకుని రాస్తే, ఇంకా బాగుంటుందని ఒక పాఠకురాలిగా నేను అనుకుంటున్నాను.
– పాఠకురాలు
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇప్పుడు యువతరంగం తెలుగు చదవడం రాదు అని చెప్పుకోవడం గొప్ప ఫ్యాషనయ్యింది. మొన్నొకాయన తెలుగులో వెబ్సైట్ స్థాపిస్తూ సలహా కోసం అతనికి తెలిసిన ఒక ఎంబిఏ కుర్రాడినడిగాడు. “మీరు సినిమాల గురించి రాయండి చాలా మంది వస్తారు. ఇలా సాహిత్యం, కవిత్వం అంటే మీకు నలభై ఏళ్ళకు మించిన వాళ్ళే గతి” అన్నాడు. అది ఒక విధంగా నిజమే. ఆ పరిస్థితి ఇక మారదు కూడా అని నా అభిప్రాయం. కానీ చూస్తూ వదిలేయకుండా ఓపికున్న వాళ్ళు తమ వంతు ప్రయత్నం చేస్తూనే వుండాలి.
మీ వ్యాసము నన్ను నలభై యేళ్ళకు పైగా భూతకాలములోకి
తీసికొని వెళ్ళింది. నేను భారతీయ విజ్ఞాన సంస్థలో డాక్టరేట్
చేసేటప్పుడు HALలో ఉండే Eliot 803B కంప్యూటర్్ను వాడేవాళ్ళము.
దానికి డేటా కాగితపు టేపులో పంచ్ చేయాలి. మధ్యలో
తప్పు దొర్లితే దానిని కరెక్ట్ చేయడం అంత ప్రయాస!
దానికి మెమరీ 4000 మాత్రమే! ఒక ఆపరేషన్కంటే ఎక్కువ
ప్రోగ్రాంలో రాయడానికి వీలుపడదు. a = a + b + c అంటే
కంప్యూటర్ ఒప్పుకోదు. a = a+b, a= a+c అని రాయాలి.
పెద్ద పెద్ద ప్రాబ్లంస్ ఉంటే బొంబాయిలో TIFRలో CDC 3600
ఉపయోగించాలి. అక్కడకు వెళ్ళడానికి III class ticketకు
మాత్రమే డబ్బు ఇచ్చేవారు. అక్కడకు వెళ్ళి ఎవరి గదిలోనైనా
బలవంత బ్రాహ్మణార్థానికి వెళ్ళాలి. కార్డులలో పంచ్ చయాలి
డేటాను. ఒకప్పుడు బొంబాయి వర్షాలలో ఆ రబ్బర్ బ్యాండ్ కాస్త
తెగి కార్డులంతా (పెద్ద పెట్టె) కిందపడి నీళ్ళలో తడిశాయి. అది
బైనరీ కూడా! నేను చదివిన ప్రోగ్రామింగ్ పుస్తకము
రాసింది McCracken. నేను మదురైలో పని చేసేటప్పుడు
300్ మైళ్ళ దూరము ఉండే మదరాసు IIT కి వెళ్ళి
కంప్యూటర్ వాడే వాళ్ళము. 1980లో ఇక్కడ కూడ (Purdueలో)
కంప్యూటర్కు టైము బుక్ చేయాలి. అరగంటకు పైగా
ఉపయోగించరాదు. ఎవ్వరు లేని సమయాలలో సాయంకాలము,
రాత్రిళ్ళు వాడేవాళ్ళము. ఆ కాలాన్ని నెమరు వేస్తే
ఇప్పటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది.
మీ విశ్లేషణ బాగుంది. మీరు చెప్పిన విషయాలతో అక్షరాలా
ఏకీభవిస్తాను నేను. కర్నాటక సంగీతానికి నేటికీ ఊతమిచ్చి,
పెద్దపీట వేసి, పెంచి పోషిస్తున్నది వారే అన్నది నిర్వివాదాంశం.
అందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞులం.
నేను కేవలం నవ్వించడానికి రాసిన కథను, సహృదయంతో,
అదే స్ఫూర్తితో చదివిన మీకు కృతజ్ఞతలు.
కేవలం కొన్ని హాస్య సన్నివేశాలని కథగా కూర్చి మీ
ముందుంచుదామనే ప్రయత్నమే తప్ప, ఎవరినో వెక్కిరించాలనో,
కించపరచాలనో రాసినది కాదు (దేవుడితో సహా). కొత్త
సంవత్సరంలో కొందరినైనా నవ్విద్దామనే ఆశతో చేసిన చిన్ని
ప్రయత్నమిది. కోపంకలిగించాలని కాదు.
భాష, యాసలతో హాస్యాన్ని స్ఫురింపచేయాలనే ప్రయత్నమే తప్ప,
మరో భాష వాళ్ళని కించపరచాలన్నది నా వుద్దేశ్యం కాదు. మీరు
అన్నట్టుగా “యాస” అనేది అందరికీ వుంటుంది. కొంచెం పరిశీలిస్తే,
అన్ని భాషలవారిలోనూ హాస్యాన్ని చూడవచ్చని నాకనిపిస్తుంది.
“సుప్రభాతం పొద్దున్నే ఎందుకు పాడాలి?” అనేదీ, ఇంకా మిగితా
ప్రశ్నలూ, కేవలం నవ్వించడానికి నారాయణ పాత్ర ద్వారా
చెప్పించినవే గానీ, సీరియస్ గా “రచయిత” కి వచ్చిన
అనుమానాలు మాత్రం కావు ( నేను సుప్రభాతాన్ని ప్రతిపదార్థ
సహితంగా నేర్చుకున్న అభిమానిని కావున..)
మీకుగానీ, మరెవరికి గానీ కష్టం కలిగించి వుంటే, క్షంతవ్యుణ్ణి.
Amazing Article. చాలా informative గా ఉంది. మహరాష్ట్ర లో ఇంకా గుజరాత్ లోనూ నాటకాలకి చాలా ఆదరణ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రమే కళలో భ్రష్టుపట్టి పోయింది. మీరు దానికి కారణాలు కూడా మీ వ్యాసం లో చెప్తారని ఆశిస్తున్నాను.
నిన్నటి కల గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
01/02/2008 1:23 pm
కధ బాగుంది. మలుపులు సహజంగా వుండి, బాగున్నాయి. అయితే, స్కాలర్ షిప్ విషయం ఏమయ్యిందో చెప్పలేదు రచయితగారు. అది ముఖ్యమైన విషయం కదా? హాస్టల్ ఫీజు ఎలా కట్టేడో, చెప్పకుండా ఒదిలేశారు. ఒక వాక్యంలో చెప్పివుంటే, బాగుండేది. మొదట్లో అంత నిజాయితీగా వున్న సుబ్బరామయ్య, ఒక చిన్న టెక్నికాలిటీ విషయంలో ఏమీ సాయం చేయలేకపోవడం కాస్త అసహజంగానే వుంది. మేనేజరు చేసిన తప్పుకి, శిక్ష ఆ కుర్రాడికి పడితే, సుబ్బరామయ్య ఏమీ చెయ్యలేకపోవడం బాగోలేదు. అతను ఏదో ప్రయత్నించినట్టుగానూ, ఎవడో తిక్క ఆఫీసరు కుదరనియ్యలేదన్నట్టుగానూ చూపిస్తే, ఇంకా బాగుండేది. అంతేకాదు, “నేను” పాత్ర చివర్లో సుబ్బరామయ్యని ఒక లెంపకాయ కొట్టినట్టు కూడా చూపిస్తే, ఇంకా ఘాటుగా వుండేది.
అయినా పోస్టుమానుకి ఇచ్చిందాన్ని లంచం అనకూడదు. దాన్ని టిప్ అనాలి. ఎందుకంటే, అది ఇవ్వకపోయినా పోస్టుమాన్ మనియార్డరు ఇచ్చేవాడే. మహా అయితే, కాస్త ఆలస్యంగా ఇచ్చేవాడేమో, చెడ్డ పోస్టుమాన్ అయితే. అసలు ఇవ్వకపోవడం అనేది వుండదు. తక్కువ వేతనంతో బతికే పోస్టుమానులు ఏదన్నా టిప్ ఆశిస్తే, అది అంత చెడ్డ విషయం కాదు. తాలూకా ఆఫీసులో డబ్బిస్తేనే గానీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల, అది లంచం అవుతుంది.
నేను చెప్పినవి అంత పెద్ద విషయాలు కావులెండి. adverb clauses కాస్త అటూ ఇటూగా వాడడం వల్ల, ఒకటీ, రెండూ చోట్ల అర్థం చేసుకోవడానికి మళ్ళీ చదవాల్సి వచ్చింది. అందులోనూ full stop స్పష్టంగా కనబడదు ఈ యూనికోడ్ లో కొన్నిచోట్ల.
నాకు కధ నచ్చింది. బాగానే రాశారు.
– జె. యు. బి. వి. ప్రసాద్
మనవాళ్ళు చెప్పే ‘తిరిగే కాలూ..’ వగైరాలకు ‘రాసే చెయ్యి’ అనేదాన్ని కూడా చేర్చాలేమో. బలివాడ కాంతారావు, కవనశర్మ, వివినమూర్తి తదితరులు ఏ ఊళ్ళో ఉన్నప్పటికీ రచనలు చేస్తూనే ఉండేవారు. ఎటొచ్చీ తమ నివాసస్థలానికి దూరంగా ఉంటున్న రచయితల పెర్స్పెక్టివ్ మెరుగయే అవకాశం ఉంటుంది. వారి అనుభవాలు విస్తృతం అయేకొద్దీ రచనల వైవిధ్యం కూడా పెరుగుతుంది. లక్ష్మన్న చెప్పిన విషయాల్లో ఇదొక ఆహ్వానించదగ్గ పరిణామం.
తెలుగు యువతీయువకులకు తెలుగు రాకపోవడం అనేది ‘చేసే పని కూటికా గుడ్డకా’ అనే ఈనాటి ధోరణికి ప్రతీక. తెలుగు నేర్చుకోవడంవల్ల ప్రత్యక్షంగా లాభమేదీ కనబడదు కనక వారు నేర్చుకోరు. ఇటువంటి విషయాల్లో వారి సంగతిని తగినంతగా పట్టించుకోని తల్లిదండ్రులదే తప్పు అనాలి.
ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids) గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/03/2008 12:17 pm
ఇది చాలా ముఖ్య విషయాలను ప్రస్తావించే వ్యాసం.నిజానికి నాలెక్కన ఇది రెండుమూడు భాగాలుగా, సీదాసాదా డ్రాయింగులతో, అన్నేసి సంస్కృతభూయిష్ఠ పదాలు లేకుండా, సామాన్యపాఠకులకు అర్థం అయేలా రాయవలసిన వ్యాసం. సిమెట్రీ (సౌష్ఠవం) అనేది కేవలం పదాల వర్ణనతో వివరించడం కష్టం. లైన్ డ్రాయింగులతో, గుండ్రంగా తిప్పినట్టున్న సంకేతాలతో, సవివరంగా సూచించాలి. ప్రోటీన్ల నిర్మాణం నుంచి ఫుల్లర్ డోమ్ దాకా అన్నిటికీ వర్తించే ఈ వ్యాసం ఇంకా తేలికభాషలో రాయడం చాలా అవసరం. సబ్జక్ట్ రచయితకు కరతలామలకం అనడంలో మాత్రం సందేహం లేదు.
రంగులు గురించి radhika గారి అభిప్రాయం:
01/03/2008 12:16 pm
చాలా బాగుందండి
కోవెలలో పకపకలు గురించి పాఠకురాలు గారి అభిప్రాయం:
01/03/2008 8:15 am
రచయితగారూ,
మీరు హాస్యం అనుకున్నది మీరు రాశారు. మీ అభిప్రాయాలని మీరు రాశారు. అది అందరికీ నచ్చాలని లేదు. నచ్చని వాళ్ళు తమ అభిప్రాయాలని తాము వెలిబుచ్చుతారు. అంతే! ఇందులో క్షమించమని అడిగేంత చెడ్డ విషయం గానీ, నెగటివ్ తనం గానీ వుందని నేను అనుకోవడం లేదు.పాఠకులకి వ్యాఖానించే హక్కు వున్నట్టే, రచయితలకి కూడా తమ అభిప్రాయాలని రాసుకునే హక్కు వుంటుంది. ఇందులో క్షమాపణలూ, అవీ అనవసరమని నేను అనుకుంటున్నాను. రాయగలిగే శక్తి వున్నప్పుడు, మంచి సబ్జెక్టు ఎన్నుకుని రాస్తే, ఇంకా బాగుంటుందని ఒక పాఠకురాలిగా నేను అనుకుంటున్నాను.
– పాఠకురాలు
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి వెంకట్ గారి అభిప్రాయం:
01/03/2008 7:32 am
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇప్పుడు యువతరంగం తెలుగు చదవడం రాదు అని చెప్పుకోవడం గొప్ప ఫ్యాషనయ్యింది. మొన్నొకాయన తెలుగులో వెబ్సైట్ స్థాపిస్తూ సలహా కోసం అతనికి తెలిసిన ఒక ఎంబిఏ కుర్రాడినడిగాడు. “మీరు సినిమాల గురించి రాయండి చాలా మంది వస్తారు. ఇలా సాహిత్యం, కవిత్వం అంటే మీకు నలభై ఏళ్ళకు మించిన వాళ్ళే గతి” అన్నాడు. అది ఒక విధంగా నిజమే. ఆ పరిస్థితి ఇక మారదు కూడా అని నా అభిప్రాయం. కానీ చూస్తూ వదిలేయకుండా ఓపికున్న వాళ్ళు తమ వంతు ప్రయత్నం చేస్తూనే వుండాలి.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి mOhana గారి అభిప్రాయం:
01/02/2008 4:59 pm
మీ వ్యాసము నన్ను నలభై యేళ్ళకు పైగా భూతకాలములోకి
తీసికొని వెళ్ళింది. నేను భారతీయ విజ్ఞాన సంస్థలో డాక్టరేట్
చేసేటప్పుడు HALలో ఉండే Eliot 803B కంప్యూటర్్ను వాడేవాళ్ళము.
దానికి డేటా కాగితపు టేపులో పంచ్ చేయాలి. మధ్యలో
తప్పు దొర్లితే దానిని కరెక్ట్ చేయడం అంత ప్రయాస!
దానికి మెమరీ 4000 మాత్రమే! ఒక ఆపరేషన్కంటే ఎక్కువ
ప్రోగ్రాంలో రాయడానికి వీలుపడదు. a = a + b + c అంటే
కంప్యూటర్ ఒప్పుకోదు. a = a+b, a= a+c అని రాయాలి.
పెద్ద పెద్ద ప్రాబ్లంస్ ఉంటే బొంబాయిలో TIFRలో CDC 3600
ఉపయోగించాలి. అక్కడకు వెళ్ళడానికి III class ticketకు
మాత్రమే డబ్బు ఇచ్చేవారు. అక్కడకు వెళ్ళి ఎవరి గదిలోనైనా
బలవంత బ్రాహ్మణార్థానికి వెళ్ళాలి. కార్డులలో పంచ్ చయాలి
డేటాను. ఒకప్పుడు బొంబాయి వర్షాలలో ఆ రబ్బర్ బ్యాండ్ కాస్త
తెగి కార్డులంతా (పెద్ద పెట్టె) కిందపడి నీళ్ళలో తడిశాయి. అది
బైనరీ కూడా! నేను చదివిన ప్రోగ్రామింగ్ పుస్తకము
రాసింది McCracken. నేను మదురైలో పని చేసేటప్పుడు
300్ మైళ్ళ దూరము ఉండే మదరాసు IIT కి వెళ్ళి
కంప్యూటర్ వాడే వాళ్ళము. 1980లో ఇక్కడ కూడ (Purdueలో)
కంప్యూటర్కు టైము బుక్ చేయాలి. అరగంటకు పైగా
ఉపయోగించరాదు. ఎవ్వరు లేని సమయాలలో సాయంకాలము,
రాత్రిళ్ళు వాడేవాళ్ళము. ఆ కాలాన్ని నెమరు వేస్తే
ఇప్పటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది.
– మోహన
కోవెలలో పకపకలు గురించి phaNi DokkA గారి అభిప్రాయం:
01/02/2008 3:04 pm
మోహన గారూ,
మీ విశ్లేషణ బాగుంది. మీరు చెప్పిన విషయాలతో అక్షరాలా
ఏకీభవిస్తాను నేను. కర్నాటక సంగీతానికి నేటికీ ఊతమిచ్చి,
పెద్దపీట వేసి, పెంచి పోషిస్తున్నది వారే అన్నది నిర్వివాదాంశం.
అందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞులం.
నేను కేవలం నవ్వించడానికి రాసిన కథను, సహృదయంతో,
అదే స్ఫూర్తితో చదివిన మీకు కృతజ్ఞతలు.
కోవెలలో పకపకలు గురించి phaNi DokkA గారి అభిప్రాయం:
01/02/2008 2:54 pm
పాఠకురాలు గారూ,
కేవలం కొన్ని హాస్య సన్నివేశాలని కథగా కూర్చి మీ
ముందుంచుదామనే ప్రయత్నమే తప్ప, ఎవరినో వెక్కిరించాలనో,
కించపరచాలనో రాసినది కాదు (దేవుడితో సహా). కొత్త
సంవత్సరంలో కొందరినైనా నవ్విద్దామనే ఆశతో చేసిన చిన్ని
ప్రయత్నమిది. కోపంకలిగించాలని కాదు.
భాష, యాసలతో హాస్యాన్ని స్ఫురింపచేయాలనే ప్రయత్నమే తప్ప,
మరో భాష వాళ్ళని కించపరచాలన్నది నా వుద్దేశ్యం కాదు. మీరు
అన్నట్టుగా “యాస” అనేది అందరికీ వుంటుంది. కొంచెం పరిశీలిస్తే,
అన్ని భాషలవారిలోనూ హాస్యాన్ని చూడవచ్చని నాకనిపిస్తుంది.
“సుప్రభాతం పొద్దున్నే ఎందుకు పాడాలి?” అనేదీ, ఇంకా మిగితా
ప్రశ్నలూ, కేవలం నవ్వించడానికి నారాయణ పాత్ర ద్వారా
చెప్పించినవే గానీ, సీరియస్ గా “రచయిత” కి వచ్చిన
అనుమానాలు మాత్రం కావు ( నేను సుప్రభాతాన్ని ప్రతిపదార్థ
సహితంగా నేర్చుకున్న అభిమానిని కావున..)
మీకుగానీ, మరెవరికి గానీ కష్టం కలిగించి వుంటే, క్షంతవ్యుణ్ణి.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి Manjula గారి అభిప్రాయం:
01/02/2008 1:26 pm
Amazing Article. చాలా informative గా ఉంది. మహరాష్ట్ర లో ఇంకా గుజరాత్ లోనూ నాటకాలకి చాలా ఆదరణ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రమే కళలో భ్రష్టుపట్టి పోయింది. మీరు దానికి కారణాలు కూడా మీ వ్యాసం లో చెప్తారని ఆశిస్తున్నాను.
నిన్నటి కల గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
01/02/2008 1:23 pm
కధ బాగుంది. మలుపులు సహజంగా వుండి, బాగున్నాయి. అయితే, స్కాలర్ షిప్ విషయం ఏమయ్యిందో చెప్పలేదు రచయితగారు. అది ముఖ్యమైన విషయం కదా? హాస్టల్ ఫీజు ఎలా కట్టేడో, చెప్పకుండా ఒదిలేశారు. ఒక వాక్యంలో చెప్పివుంటే, బాగుండేది. మొదట్లో అంత నిజాయితీగా వున్న సుబ్బరామయ్య, ఒక చిన్న టెక్నికాలిటీ విషయంలో ఏమీ సాయం చేయలేకపోవడం కాస్త అసహజంగానే వుంది. మేనేజరు చేసిన తప్పుకి, శిక్ష ఆ కుర్రాడికి పడితే, సుబ్బరామయ్య ఏమీ చెయ్యలేకపోవడం బాగోలేదు. అతను ఏదో ప్రయత్నించినట్టుగానూ, ఎవడో తిక్క ఆఫీసరు కుదరనియ్యలేదన్నట్టుగానూ చూపిస్తే, ఇంకా బాగుండేది. అంతేకాదు, “నేను” పాత్ర చివర్లో సుబ్బరామయ్యని ఒక లెంపకాయ కొట్టినట్టు కూడా చూపిస్తే, ఇంకా ఘాటుగా వుండేది.
అయినా పోస్టుమానుకి ఇచ్చిందాన్ని లంచం అనకూడదు. దాన్ని టిప్ అనాలి. ఎందుకంటే, అది ఇవ్వకపోయినా పోస్టుమాన్ మనియార్డరు ఇచ్చేవాడే. మహా అయితే, కాస్త ఆలస్యంగా ఇచ్చేవాడేమో, చెడ్డ పోస్టుమాన్ అయితే. అసలు ఇవ్వకపోవడం అనేది వుండదు. తక్కువ వేతనంతో బతికే పోస్టుమానులు ఏదన్నా టిప్ ఆశిస్తే, అది అంత చెడ్డ విషయం కాదు. తాలూకా ఆఫీసులో డబ్బిస్తేనే గానీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల, అది లంచం అవుతుంది.
నేను చెప్పినవి అంత పెద్ద విషయాలు కావులెండి. adverb clauses కాస్త అటూ ఇటూగా వాడడం వల్ల, ఒకటీ, రెండూ చోట్ల అర్థం చేసుకోవడానికి మళ్ళీ చదవాల్సి వచ్చింది. అందులోనూ full stop స్పష్టంగా కనబడదు ఈ యూనికోడ్ లో కొన్నిచోట్ల.
నాకు కధ నచ్చింది. బాగానే రాశారు.
– జె. యు. బి. వి. ప్రసాద్
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/02/2008 11:53 am