రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నీ ఏకాంతం

రచన: బివివి ప్రసాద్
ఫిబ్రవరి 2026

నీదైన ఏకాంతం అపురూపం!
నీకు మాత్రమే చెందిన ద్వీపం అది.
ఇతరుల్ని ద్వీపంలోకి రానీయటం, వద్దనటం
పూర్తిగా నీ హక్కు.

మనుషులు మినహా మరేవైనా
ప్రవేశించగల చోటు అది.
రాత్రుల చీకటీ, దీపాల కాంతులూ,
రాత్రుల నిశ్శబ్దం, పలకరించి పోయే శబ్దాలూ,
రాత్రి లాంటి ప్రపంచం, ఎదురై, మాయమయే ప్రేమలూ…

నీదైన ఏకాంతం
నీకు నువు నిండుగా దొరికే చోటు.
ఏకాంతంలోకి రాలే కాంతులూ, చీకటులూ,
శబ్దాలూ, నిశ్శబ్దాలూ, నమ్మకాలూ, స్వేచ్ఛలూ,

వీటికి ఎడంగా,
దేనికీ దొరకని, అంతా నీవైన
ఖాళీ గాలి లాంటి నీ ఉనికి.

ఏకాంతంలో
నీతో నిండుతూ నువ్వు,
నీతో నిండుతూ నీ ప్రపంచం
నీ ప్రపంచంలో నిండుతూ నీ ప్రేమ.

ఇప్పుడిక ఇది
రాత్రయితే ఏమిటి, పగలైతే ఏమిటి?
నవ్వులైతే ఏమిటి, దుఃఖమైతే ఏమిటి?
జీవితమైతే ఏమిటి, మరణమైతే ఏమిటి?

ఏకాంతం లాంటి నువ్వు,
నీలాంటి ఏకాంతం,
నీతోనే నిండిపోయిన నీ అనుభవం.

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Chandrasekhar Cheerla February 5, 2026 12:01 pm

    ఇంతవరకు మీ కవితలు కొన్ని చదివినాను. అవి చాలా బాగున్నావనిపించింది. కాని ఈ కవితలో కొంత అస్పష్టత కనిపిస్తున్నది. ‘మనుషులు మినహా మరి ఏవైనా ప్రవేశించగలిగే చోటు’ అంటున్నారు, మళ్ళీ ‘రాత్రి లాంటి ప్రపంచం ఎదురై …’ – అంటే ప్రపంచం ప్రవేశించిందన్నమాట. అది మనుషులు లేని ప్రపంచమా? తర్వాత ‘నీతో నిండుతూ నీ ప్రపంచం’ అన్నారు. మనం కల్పించుకున్న ప్రపంచాన్ని మనం ప్రేమించడం కష్టం కాదు కదా!

    మొత్తంపై కవితలో ఏ అనుభవాన్ని పంచుకోదలచినారో అర్థం కాలేదు.

  2. 2
    B V V Prasad February 11, 2026 6:16 am

    మనుషుల పలకరింపులు లేని ఏకాంతంలో ఒకరు తనలో తాను మునుగుతూ, తన అనుభవంలోని ప్రపంచం పట్ల ప్రేమలోకి మేలుకోవటాన్ని కవి వర్ణించాడనుకుంటానండి.

    మీకు ఇతని కొన్ని కవితలు నచ్చాయని తెలిసినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఊరట
  • ఈ క్షణం
  • నువు
  • జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నమే నా కవిత్వం
  • ఇంతేనా

ఇటువంటివే…

  1. ఏకాంతం, శూన్యం
  2. ఏకాంతం కోసం
  3. నీదైన క్షణం
  4. ఎందుకో అలా!
  5. ప్రేమంటే …

ఫిబ్రవరి 2026 సంచికలో ...

  • అస్తిత్వవాద సాహిత్యం: 5అ. కాఫ్కా
  • ఎవరికెవరు?
  • ఓడిస్సీ – 3: మృతుల లోకం
  • కంప్యూటర్ చిప్ కథ – 10: మాక్స్‎వెల్ అభిమానులు
  • కళాసాగరం కర్ణాటకం
  • కొత్తతరం కవుల మిలన్
  • చితుకుల పాట
  • జంతు జాడలో మనిషి నీడ
  • తమిళ సంగ సాహిత్యం-2: అగం కవిత్వ పరిచయం
  • నీ ఏకాంతం
  • పదమల్లుని పథగమనం: గజ్జెల మల్లారెడ్డికి ఘన నివాళి
  • పలుబ్రతుకుల సయ్యదా: రచయిత్రి వెనక మాట
  • పాట-మాట-1: జనం మెచ్చిన జాంపండు – మన వంగపండు
  • పోతన భాగవతంలో దృశ్యీకరణం – 5
  • ప్రేరణ
  • ఫిబ్రవరి 2026
  • మంకుతిమ్మని మరో మిణుకు— 2 (11-20)
  • మనసులు దోచే మనస్లు– 2
  • యూట్యూబ్‍లో ఈమాట: జనవరి 2026
  • రెండో చరణం
  • వెలుతురు కిటికీ మూసేయకు
  • వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026
  • శూన్యం
  • హఠాత్తుగా అక్షరాలు మాయమైతే…
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శూన్యం
రెండో చరణం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.