సంకా రామకృష్ణ గారికి ధన్యవాదాలు ఇంకా నన్ను మరువనందుకు. అప్పటి పరిచయాలు ఇంకా అప్పుడప్పుడు మదిలో మెదలుతూనే ఉంటాయండీ నాకున్నూ. కాని చాలా వరకు కాంటాక్ట్స్ తెగిపోయాయి. అమెరికాలో ఉన్నప్పుడు పిల్లలమర్రి రామకృష్ణ గారితో (వారి అమ్మాయి పేరు అరవింద. అప్పట్లో ఒకసారి ఆమె ఆంజనేయుడి గురించి స్త్తోత్రం కావాలి అని కాబోలు అడిగింది. ఆవిడ ఏం చేస్తున్నారో ఇప్పుడు) మంచి మెయిల్ పరిచయం ఉండేదా ఇప్పుడు ఆయనను కాంటాక్ట్ చేయలేను. మెయిల్ ఐడి పోయింది మరి. అలాగే చాలా కాంటాక్ట్స్ పోయాయండీ.
ఈమాట మాగజైన్ అపుడపుడూ చదువుతూ ఉంటాను. బాగుంటుంది. కాని వారు ఎపుడైనా రాముణ్ణి తక్కువ చేసేలా ధ్వనించే అంశాలు ప్రచురిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. అందుకని వారితో ఆమధ్యన ఇక ఈమాటను చూడనని చెప్పేసాను. కాని అడపాదడపా ఏదో శోధినిలో వచ్చిన వ్యాఖ్యను చూసి వస్తూ ఉంటాను ఈమాటకు.
కొద్ది రోజుల క్రిందటివరకూ బ్లాగుల్లో వ్రాసుకుంటూ ఉండే వాడిని. అక్కడి నా రామకీర్తనలు చోరీ అవుతున్నాయని తెలిసి వ్యసనపడి బ్లాగును మూసేసాను. భగవదనుగ్రహం ఉంటే, తెలుగువాళ్ళు కోరుకుంటే, అవి పుస్తకరూపంలో వస్తే వస్తాయి. లేకపోతే లేదు. మహామహా నాలుగులక్షల (అక్షరాల?) సింహగిరివచనాలే మనతెలుగునేల నుండి మాయం అయ్యాయి. నా రెండున్నరవేల రామకీర్తనలు మాయం ఐతే అదొక పెద్దవిషయం కాదు. ఐనా రామకీర్తనలు ధారాళంగా వస్తూనే ఉంటాయనుకోండి అది నాప్రవృత్తి కనుక. అంతకంటే మరేమీ విశేషం ఉందనుకోను.
ఇప్పుడు రామస్మరణానందంలో ఉన్నాను. ఇతరాలు పెద్దగా పట్టించుకోవటం లేదండి.
సంపాదకులకు విన్నపం. ఈవ్యాఖ్యను మీరు ప్రచురించలేకపోతే నాకు ఏమీ ఇబ్బంది లేదండీ. మీకు అనుగ్రహం ఉంటే ఈవ్యాఖ్యను సంకా రామకృష్ణ గారికి మంపగలిగితే మాత్రం చాలు కృతజ్ణుడిని.
శ్యామలగారు అన్నది నిజమే తనది సంప్రదాయిక కవిత్వం అని లైలా గారు చెప్పుకోలేదు. ఆవిడ తప్పు లేదు. సంప్రదాయిక కవిత్వం అనే విభాగంలో ప్రచురించటం పత్రిక సంపాదకులు చేసిన తప్పు అని నా ఉద్దేశం. ఈమధ్య కాలంలో సంప్రదాయం అన్నమాటకు కొత్త అర్ధం ఏదైనా వచ్చిందేమో మరి నాకు తెలియదు. అలాగైతే క్షంతవ్యుడిని.
రామాయణం ఒక పపపపాతకథ రాముడు ఒక ఆపాతకథలో హీరో మాత్రం అని ఈదేశం అనుకోవటం లేదండీ. మీరలా అనుకుంటున్నారేమో. లైలాగారు అలా అనుకుంటున్నారేమో. ఒకవేళ ఈకాలంలో అలాగే అనుకొని తీరాలేమో. నాకు తెలియదు. రామాయణమూ రాముడూ ఈజాతి సంపదలు. వాటి విలువలను నవ్యత కోసం నాశనం చేయటం హర్షణీయం కాదు. ఇది నాపాతచింతకాయపచ్చడి భావం అని ఈకాలం వాళ్ళు అంటారేమో మరి.
కీచకుడు మహాజ్ఞాని అని ఒకాయన తన సినిమాలో అంటాడు. రావణుడి వద్దనే సీత సుఖంగా ఉంది అని ఒకడు అంటాడు. రావణుడు మహాత్ముడు అని కొందరు కథలూ కావ్యాలూ అల్లుతారు.
ఇదంతా మన సంస్కృతిలో ఒకభాగం గొప్పదనం అంటారు మీలాంటి విజ్ఞులు. నేనలా అనుకోలేనండీ.
అవును లెండి. వాల్మీకి కాని రాముడు కాని కోర్టులో కేసువేయరు కదా. ఇక మనిష్టమే కాబోలు.
మనలో అందరమూ హింసను వ్యతిరేకస్తాం. కాని హింసకు పెద్దపీటవేసే సినీమాలు ఎగబడి చూస్తాం.
శ్రీరామనవమి ఓదండం పారేస్తే రాముడికి మముట్టచెప్పవలసిన గౌరవం పారేసినట్టే అవుతుంది. మిగతారోజులు రాముడిని గురించి ఎలాగైనా మాట్లాడవచ్చును. అవసరం ఐతే రాముడిపై రావణుడి విజయం అనీ అల్లవచ్చును. మన సంస్కృతి గొప్పది కదా. ఫరవాలేదు. ఇదేనంటారా మంచిమాట. సంతోషం.
[ఈమాటలో సంప్రదాయిక కవిత్వం అన్న విభాగం లేదు. పద్యసాహిత్యం అన్న కేటగిరీ ఉంది. ఛందోబద్ధమైనదే పద్యం అన్న నిర్వచనం మాకు లేదు. ఈ కేటగిరీలు కేవలం శోధనకు, మా నిర్వహణకూ సహకరించడం కోసమ్ పెట్టుకున్నవే తప్ప వాటికి ఏ రకమైన సాహిత్యప్రయోజనమూ లేదు. అందుకే ఏప్రిల్ 2019 సంచికనుంచీ అవి కనిపించకుండా చేశాం. చూ. ఏప్రిల్ 2019 ముందుమాట. -సం.]
లైలా గారు రామాయణ పాత్రలను తీసుకున్నారు. రామాయణకథను త్రోసిరాజన్నారు. ఇది సమంజసమా?
మూలకథకు కానీ ఆందులోని పాత్రలకు కానీ స్వరూపస్వభావాలను మార్చకుండా చక్కగా కల్పనలు చేసుకోవటం హర్షణీయం అవుతుంది కాని తదన్యవికారకల్పనాకేళి నిస్సందేహంగా ఆక్షేపణీయం.
ఒకరొక కథను చెబుతారు. అది కేవలకల్పనాకథ కావచ్చును. ఆద్యసత్కథ కావచ్చును. రామాయణ మహాభారత కథలు ఇతిహాసాలు. అనగా అవి నిజంగా ఎలా జరిగాయో ఆలాగే గ్రంథస్థం చేయబడ్డాయి. ఇది ఈదేశంలో సనాతనధర్మవిశ్వాసం కల అశేషప్రజానీకపు నమ్మకం. మూలకథారచయితకు గౌరవం తగ్గించేలా కల్పనలు చేయటం సమంజసమా?
లైలాగారు అలా కాదూ రావణుడు ఒక పురుషోత్తముడూ వాల్మీకి చెప్పినది తప్పు అంటారు. సమంజసమా?
ఒకవేళ రామాయణం కేవలం కవికల్పన అన్నా సరే ఒక కవి యొక్క ప్రసిధ్ధరచనలోని కథనూ పాత్రలనూ మార్చి వ్రాయటం సమంజసమా?
రావణుడిని ఆకాసానికి ఎత్తటం కోసం రాముణ్ణి ఒక మహాముచ్చటగొలిపే అందమైన మగబొమ్మ అంతే అని చెప్పటం సమంజసమా?
శ్రీమద్రామాయణమహాకావ్యం లోని సీత లంకలో దుఃఖంలో మునిగిపోయి రావణుణ్ణి అక్షరాలా తృణీకరించి ఎప్పుడు రాముడు.వచ్చి రక్షిస్తాడా అని దీనంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అదంతా తప్పూ అక్కడ లంకలో సీత మహదానందంగా గెంతులు వేస్తూ ఉందని వ్రాయటం ఏమంత సమజసమైన కల్పన అంటారు? ఈ వికారమైన కల్పనకు విజ్ఞతకల చదువరులు ఆనందంతో పులకరించి పోతారా?
దురాలోచనతో లైలాగారు కల్పనలు చేసారు అనుకోను. కాని అనుచిత కల్పనయే.
దూరదృష్టి లేక పత్రికవారు ఏదో కొత్తదనం ఐతే చాలునని అనాలోచితంగా ప్రచురించారని భావిస్తున్నాను.
‘మా చదలేటి ప్రక్క మధుమాస మనోజ్ఞ మహోదయమ్ములో’ అన్న ప్రయోగం చూశారా? ఏమనిపిస్తుంది? భావకవులకు ఉన్న ఒక చాపల్యం ఇది – ‘మధుమాసం’ అంటే చాలు వాళ్ళకు పూనకం వచ్చేస్తుంది – దానికి ఇంకొన్ని ‘మ’తో మొదలయ్యే విశేషణాలు తగిలించకుండా ఉండలేరు, అవసరం లేకపోయినా! అందులోనూ ‘మనోజ్ఞ’ పదం మీద మరీ మోజు.
By the way, how can you expect any భావ కవి to ignore alliteration?
One problem I found in your essay is the usage of the word “చాపల్యం”. It was a little cruel.
For your information, I enjoy reading Krishna Sastry any day, instead of some fake-left-poetry’ constantly parading on the Internet.
“ఇది ఒక పెడధోరణి రచన…ఆధునికత పేర దయచేసి పెడధోరణులని ప్రోత్సహించవద్దని మనవి.”
-తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం: 08/06/2024
వీరే కదా, కొన్ని నెలల క్రితం ‘నేత్రోన్మీలనం’ అన్న తెలుగు కథ చదివి -శ్రీరామచంద్ర ప్రభో నన్ను క్షమించు! పొరపాటున ఈ కథ చదివాను -అని ఈ పత్రికలో గగ్గోలుగా ఆక్రందించింది! ఆ ఆర్తనాదాలు విన్న తోటి బ్లాగర్లు పరుగెత్తుకు వచ్చి – ఆ కథ వల్ల ఈయనకు కలిగిన దుర్భరవేదన చూసి కొందరు కన్నీళ్లు పెట్టారనీ, వీరికి రాముడంటే చాలా ఇష్టమనీ, రోజూ సొంత బ్లాగులో రాముడి మీద పద్యాలు రాసుకుంటారనీ అందరికీ తెలియచెప్పింది!
నేత్రోన్మీలనం కథలో ఏముందో మరి నాకైతే తెలియదు. Janaki’s Zenలో – ఆసాంతమూ రాముడు, సీత పరస్పర ప్రేమలు చూపబడ్డాయి. కధ ఆఖరులోనూ వారిద్దరూ సుఖంగా ఉన్నారు. ఈ కథ మరి రాముడంటే ఇష్టం ఉన్నవారికి సంతోషం కలిగించాలే! ప్రేమ జీవులకు ఎవరికైనా సంతోషం కలిగించాలే! చదివి సంతోషించటం లేకపోగా ఈ పాఠకుడు -రావణ, కీచక, నరకాదుల క్రౌర్యంమీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉండటం, రావణుడి క్రూరత మీద రచన ఫోకస్ చెయ్యకపోతే, దానివల్ల ‘ప్రజలకు’ కన్ఫ్యూజన్ కలుగుతుందని అనుకోవటం! ఎంత విచిత్రం!
No me importa. Aquí hay una canción de amor. Por el placer de los amantes.
ప్రేమలు నిండిన సీమలలో
నీవూ నేనూ ప్రియతమా!
నిలచినాముగా నిలకడగా
బ్రతికినాముగా కలివిడిగా;
ఇలను వీడుతరి -మనకు
కలవరమెందుకు!
నువు మాయమైనచో మబ్బువలే
నే రాలిపోయినచొ పూవు వలే
జారిపోతాము జాతర దేనికి?
-Lyla
“పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్” చెయ్యడానికి వీలవుతుంది. సాధారణంగా ఉన్న పాంక్రియాస్‌ని ఉన్న చోటే ఉంచి, మరొక మంచి పాంక్రియాస్‌ని చిన్న ప్రేగులకి తగిలిస్తారు. ఈ ఆపరేషన్ చేయించుకున్నవారిలో 95% మొదటి ఏడాది బ్రతికే ఉంటారు. మూడు సంవత్సరాలు బ్రతికినవారు 92.5% ఉంటారు. Organ rejection occurs in about 1% of the patients. వైద్యులని సంప్రదిస్తే ఎక్కడ ఈ రకం ఆపరేషన్లు ఎక్కువ విజయవంతం అవుతాయో చెబుతారు. నాకు తెలిసినంతవరకు పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యడానికి వీలవుతుంది. ఉన్న పాంక్రియాస్‌ని ఉన్న చోటే ఉండనిచ్చి కొత్త పాంక్రియాస్‌ని చిన్న ప్రేగులకి తగిలిస్తారు. గూగుల్ చేసి వెతకండి. ఏయే ఆసుపత్రులలో ఇది ఎక్కువగా చేస్తున్నారో, గణాంకాలు తెలుసుకోవచ్చు.
ఆరోగ్య స్పృహ ఉన్న అందరూ చదవాల్సిన వ్యాసం ఇది. కేవలం వైద్య విద్యార్థులకు మాత్రమే పరిమితమైన లావైన వైద్య పుస్తకాలలో, నోరు తిరగని పదాలతో ఉన్న ఇంతటి లోతైన పరిజ్ఞానాన్ని ఇలా సామాన్యులకు సైతం సోదాహరణంగా అర్థమయ్యేలా రాయడం శ్రీ రావు గారికే సాధ్యం.
ముష్టి పలురకములు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
08/18/2024 3:21 am
సంకా రామకృష్ణ గారికి ధన్యవాదాలు ఇంకా నన్ను మరువనందుకు. అప్పటి పరిచయాలు ఇంకా అప్పుడప్పుడు మదిలో మెదలుతూనే ఉంటాయండీ నాకున్నూ. కాని చాలా వరకు కాంటాక్ట్స్ తెగిపోయాయి. అమెరికాలో ఉన్నప్పుడు పిల్లలమర్రి రామకృష్ణ గారితో (వారి అమ్మాయి పేరు అరవింద. అప్పట్లో ఒకసారి ఆమె ఆంజనేయుడి గురించి స్త్తోత్రం కావాలి అని కాబోలు అడిగింది. ఆవిడ ఏం చేస్తున్నారో ఇప్పుడు) మంచి మెయిల్ పరిచయం ఉండేదా ఇప్పుడు ఆయనను కాంటాక్ట్ చేయలేను. మెయిల్ ఐడి పోయింది మరి. అలాగే చాలా కాంటాక్ట్స్ పోయాయండీ.
ఈమాట మాగజైన్ అపుడపుడూ చదువుతూ ఉంటాను. బాగుంటుంది. కాని వారు ఎపుడైనా రాముణ్ణి తక్కువ చేసేలా ధ్వనించే అంశాలు ప్రచురిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. అందుకని వారితో ఆమధ్యన ఇక ఈమాటను చూడనని చెప్పేసాను. కాని అడపాదడపా ఏదో శోధినిలో వచ్చిన వ్యాఖ్యను చూసి వస్తూ ఉంటాను ఈమాటకు.
కొద్ది రోజుల క్రిందటివరకూ బ్లాగుల్లో వ్రాసుకుంటూ ఉండే వాడిని. అక్కడి నా రామకీర్తనలు చోరీ అవుతున్నాయని తెలిసి వ్యసనపడి బ్లాగును మూసేసాను. భగవదనుగ్రహం ఉంటే, తెలుగువాళ్ళు కోరుకుంటే, అవి పుస్తకరూపంలో వస్తే వస్తాయి. లేకపోతే లేదు. మహామహా నాలుగులక్షల (అక్షరాల?) సింహగిరివచనాలే మనతెలుగునేల నుండి మాయం అయ్యాయి. నా రెండున్నరవేల రామకీర్తనలు మాయం ఐతే అదొక పెద్దవిషయం కాదు. ఐనా రామకీర్తనలు ధారాళంగా వస్తూనే ఉంటాయనుకోండి అది నాప్రవృత్తి కనుక. అంతకంటే మరేమీ విశేషం ఉందనుకోను.
ఇప్పుడు రామస్మరణానందంలో ఉన్నాను. ఇతరాలు పెద్దగా పట్టించుకోవటం లేదండి.
సంపాదకులకు విన్నపం. ఈవ్యాఖ్యను మీరు ప్రచురించలేకపోతే నాకు ఏమీ ఇబ్బంది లేదండీ. మీకు అనుగ్రహం ఉంటే ఈవ్యాఖ్యను సంకా రామకృష్ణ గారికి మంపగలిగితే మాత్రం చాలు కృతజ్ణుడిని.
తన రచనల గురించి … గురించి Akshay అభిప్రాయం:
08/18/2024 2:07 am
Can this video be made available now, please?
[We are in the process of converting all our Adobe Flash videos to a better suitable format. All the videos will be again made available ASAP. Ed.]
Janaki’s Zen గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
08/17/2024 2:14 am
శ్యామలగారు అన్నది నిజమే తనది సంప్రదాయిక కవిత్వం అని లైలా గారు చెప్పుకోలేదు. ఆవిడ తప్పు లేదు. సంప్రదాయిక కవిత్వం అనే విభాగంలో ప్రచురించటం పత్రిక సంపాదకులు చేసిన తప్పు అని నా ఉద్దేశం. ఈమధ్య కాలంలో సంప్రదాయం అన్నమాటకు కొత్త అర్ధం ఏదైనా వచ్చిందేమో మరి నాకు తెలియదు. అలాగైతే క్షంతవ్యుడిని.
రామాయణం ఒక పపపపాతకథ రాముడు ఒక ఆపాతకథలో హీరో మాత్రం అని ఈదేశం అనుకోవటం లేదండీ. మీరలా అనుకుంటున్నారేమో. లైలాగారు అలా అనుకుంటున్నారేమో. ఒకవేళ ఈకాలంలో అలాగే అనుకొని తీరాలేమో. నాకు తెలియదు. రామాయణమూ రాముడూ ఈజాతి సంపదలు. వాటి విలువలను నవ్యత కోసం నాశనం చేయటం హర్షణీయం కాదు. ఇది నాపాతచింతకాయపచ్చడి భావం అని ఈకాలం వాళ్ళు అంటారేమో మరి.
కీచకుడు మహాజ్ఞాని అని ఒకాయన తన సినిమాలో అంటాడు. రావణుడి వద్దనే సీత సుఖంగా ఉంది అని ఒకడు అంటాడు. రావణుడు మహాత్ముడు అని కొందరు కథలూ కావ్యాలూ అల్లుతారు.
ఇదంతా మన సంస్కృతిలో ఒకభాగం గొప్పదనం అంటారు మీలాంటి విజ్ఞులు. నేనలా అనుకోలేనండీ.
అవును లెండి. వాల్మీకి కాని రాముడు కాని కోర్టులో కేసువేయరు కదా. ఇక మనిష్టమే కాబోలు.
మనలో అందరమూ హింసను వ్యతిరేకస్తాం. కాని హింసకు పెద్దపీటవేసే సినీమాలు ఎగబడి చూస్తాం.
శ్రీరామనవమి ఓదండం పారేస్తే రాముడికి మముట్టచెప్పవలసిన గౌరవం పారేసినట్టే అవుతుంది. మిగతారోజులు రాముడిని గురించి ఎలాగైనా మాట్లాడవచ్చును. అవసరం ఐతే రాముడిపై రావణుడి విజయం అనీ అల్లవచ్చును. మన సంస్కృతి గొప్పది కదా. ఫరవాలేదు. ఇదేనంటారా మంచిమాట. సంతోషం.
[ఈమాటలో సంప్రదాయిక కవిత్వం అన్న విభాగం లేదు. పద్యసాహిత్యం అన్న కేటగిరీ ఉంది. ఛందోబద్ధమైనదే పద్యం అన్న నిర్వచనం మాకు లేదు. ఈ కేటగిరీలు కేవలం శోధనకు, మా నిర్వహణకూ సహకరించడం కోసమ్ పెట్టుకున్నవే తప్ప వాటికి ఏ రకమైన సాహిత్యప్రయోజనమూ లేదు. అందుకే ఏప్రిల్ 2019 సంచికనుంచీ అవి కనిపించకుండా చేశాం. చూ. ఏప్రిల్ 2019 ముందుమాట. -సం.]
Janaki’s Zen గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
08/17/2024 1:22 am
లైలా గారు రామాయణ పాత్రలను తీసుకున్నారు. రామాయణకథను త్రోసిరాజన్నారు. ఇది సమంజసమా?
మూలకథకు కానీ ఆందులోని పాత్రలకు కానీ స్వరూపస్వభావాలను మార్చకుండా చక్కగా కల్పనలు చేసుకోవటం హర్షణీయం అవుతుంది కాని తదన్యవికారకల్పనాకేళి నిస్సందేహంగా ఆక్షేపణీయం.
ఒకరొక కథను చెబుతారు. అది కేవలకల్పనాకథ కావచ్చును. ఆద్యసత్కథ కావచ్చును. రామాయణ మహాభారత కథలు ఇతిహాసాలు. అనగా అవి నిజంగా ఎలా జరిగాయో ఆలాగే గ్రంథస్థం చేయబడ్డాయి. ఇది ఈదేశంలో సనాతనధర్మవిశ్వాసం కల అశేషప్రజానీకపు నమ్మకం. మూలకథారచయితకు గౌరవం తగ్గించేలా కల్పనలు చేయటం సమంజసమా?
లైలాగారు అలా కాదూ రావణుడు ఒక పురుషోత్తముడూ వాల్మీకి చెప్పినది తప్పు అంటారు. సమంజసమా?
ఒకవేళ రామాయణం కేవలం కవికల్పన అన్నా సరే ఒక కవి యొక్క ప్రసిధ్ధరచనలోని కథనూ పాత్రలనూ మార్చి వ్రాయటం సమంజసమా?
రావణుడిని ఆకాసానికి ఎత్తటం కోసం రాముణ్ణి ఒక మహాముచ్చటగొలిపే అందమైన మగబొమ్మ అంతే అని చెప్పటం సమంజసమా?
శ్రీమద్రామాయణమహాకావ్యం లోని సీత లంకలో దుఃఖంలో మునిగిపోయి రావణుణ్ణి అక్షరాలా తృణీకరించి ఎప్పుడు రాముడు.వచ్చి రక్షిస్తాడా అని దీనంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అదంతా తప్పూ అక్కడ లంకలో సీత మహదానందంగా గెంతులు వేస్తూ ఉందని వ్రాయటం ఏమంత సమజసమైన కల్పన అంటారు? ఈ వికారమైన కల్పనకు విజ్ఞతకల చదువరులు ఆనందంతో పులకరించి పోతారా?
దురాలోచనతో లైలాగారు కల్పనలు చేసారు అనుకోను. కాని అనుచిత కల్పనయే.
దూరదృష్టి లేక పత్రికవారు ఏదో కొత్తదనం ఐతే చాలునని అనాలోచితంగా ప్రచురించారని భావిస్తున్నాను.
తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి Saradhi Motamarri అభిప్రాయం:
08/16/2024 3:03 am
Nice analysis.
కరుణశ్రీ: తపోభంగము గురించి V R Veluri అభిప్రాయం:
08/14/2024 5:38 pm
K V S Ramarao gaaroo!
Excellent essay, as usual.
By the way, how can you expect any భావ కవి to ignore alliteration?
One problem I found in your essay is the usage of the word “చాపల్యం”. It was a little cruel.
For your information, I enjoy reading Krishna Sastry any day, instead of some fake-left-poetry’ constantly parading on the Internet.
Regards
V R Veluri
కోట గురించి ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. అభిప్రాయం:
08/12/2024 3:35 am
అణంజి గొప్ప క్యారెక్టర్.
Janaki’s Zen గురించి Lyla Yerneni అభిప్రాయం:
08/11/2024 8:50 am
వీరే కదా, కొన్ని నెలల క్రితం ‘నేత్రోన్మీలనం’ అన్న తెలుగు కథ చదివి -శ్రీరామచంద్ర ప్రభో నన్ను క్షమించు! పొరపాటున ఈ కథ చదివాను -అని ఈ పత్రికలో గగ్గోలుగా ఆక్రందించింది! ఆ ఆర్తనాదాలు విన్న తోటి బ్లాగర్లు పరుగెత్తుకు వచ్చి – ఆ కథ వల్ల ఈయనకు కలిగిన దుర్భరవేదన చూసి కొందరు కన్నీళ్లు పెట్టారనీ, వీరికి రాముడంటే చాలా ఇష్టమనీ, రోజూ సొంత బ్లాగులో రాముడి మీద పద్యాలు రాసుకుంటారనీ అందరికీ తెలియచెప్పింది!
నేత్రోన్మీలనం కథలో ఏముందో మరి నాకైతే తెలియదు. Janaki’s Zenలో – ఆసాంతమూ రాముడు, సీత పరస్పర ప్రేమలు చూపబడ్డాయి. కధ ఆఖరులోనూ వారిద్దరూ సుఖంగా ఉన్నారు. ఈ కథ మరి రాముడంటే ఇష్టం ఉన్నవారికి సంతోషం కలిగించాలే! ప్రేమ జీవులకు ఎవరికైనా సంతోషం కలిగించాలే! చదివి సంతోషించటం లేకపోగా ఈ పాఠకుడు -రావణ, కీచక, నరకాదుల క్రౌర్యంమీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉండటం, రావణుడి క్రూరత మీద రచన ఫోకస్ చెయ్యకపోతే, దానివల్ల ‘ప్రజలకు’ కన్ఫ్యూజన్ కలుగుతుందని అనుకోవటం! ఎంత విచిత్రం!
No me importa. Aquí hay una canción de amor. Por el placer de los amantes.
ప్రేమలు నిండిన సీమలలో
నీవూ నేనూ ప్రియతమా!
నిలచినాముగా నిలకడగా
బ్రతికినాముగా కలివిడిగా;
ఇలను వీడుతరి -మనకు
కలవరమెందుకు!
నువు మాయమైనచో మబ్బువలే
నే రాలిపోయినచొ పూవు వలే
జారిపోతాము జాతర దేనికి?
-Lyla
మధుమేహం – రక్తపోటు 2 గురించి Rao Vemuri అభిప్రాయం:
08/10/2024 12:53 am
శ్రీ విన్నకోట నరసింహారావు గారికి
“పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్” చెయ్యడానికి వీలవుతుంది. సాధారణంగా ఉన్న పాంక్రియాస్‌ని ఉన్న చోటే ఉంచి, మరొక మంచి పాంక్రియాస్‌ని చిన్న ప్రేగులకి తగిలిస్తారు. ఈ ఆపరేషన్ చేయించుకున్నవారిలో 95% మొదటి ఏడాది బ్రతికే ఉంటారు. మూడు సంవత్సరాలు బ్రతికినవారు 92.5% ఉంటారు. Organ rejection occurs in about 1% of the patients. వైద్యులని సంప్రదిస్తే ఎక్కడ ఈ రకం ఆపరేషన్లు ఎక్కువ విజయవంతం అవుతాయో చెబుతారు. నాకు తెలిసినంతవరకు పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యడానికి వీలవుతుంది. ఉన్న పాంక్రియాస్‌ని ఉన్న చోటే ఉండనిచ్చి కొత్త పాంక్రియాస్‌ని చిన్న ప్రేగులకి తగిలిస్తారు. గూగుల్ చేసి వెతకండి. ఏయే ఆసుపత్రులలో ఇది ఎక్కువగా చేస్తున్నారో, గణాంకాలు తెలుసుకోవచ్చు.
మధుమేహం – రక్తపోటు 1 గురించి రవిచంద్ర అభిప్రాయం:
08/09/2024 12:37 pm