“ముఖ్యంగా రెండవ చరణంలో సాగరుడ వీవె అన్న చోట సా-ని సాగదీస్తూ పలికిన గమకం, ‘సహస్రబాహువులతో కాళిందిని అక్కున జేర్చుకుంటున్న సముద్రుణ్ణి గుర్తుకు చేసిందని, … చదివినప్పుడు, తెనాలి రామకృష్ణ కవి పాండురంగమహత్యం లోని ఈ పద్యం గుర్తొచ్చింది.
కథ పేరు “అమూర్తం” అయినా, చేతివ్రాత లో ఉన్న పాట తిరిగి ఇచ్చేయడంతో, గత స్మృతిలోని హిమజ్వాల రగిలి ప్రజ్వలిస్తూనే ఉంది అని తెలుపడం ద్వారా “మూర్తివంతమైన” కథకుడి విశ్వరూపాన్ని ఆవిష్కరించింది ఈ కథ.
ఆకట్టుకొనే కథనం తో సాగిన మంచి కథ అందిచినందుకు ధన్యవాదములు స్వామిన్!
మీరు కధని నడిపించిన తీరు నాకు చాలా నచ్చింది. పాత్రల వ్యవహారం సరేసరి. కధలో కొంత వైరాగ్యం కనిపించింది. కానీ జీవితం పట్ల మనిషికుండాల్సిన ఆలోచనల ఫ్రెష్ నెస్ ప్రతీ వాక్యంలో నన్ను హత్తుకుంది. బిగి సడల్లేదు. నిర్మాణం చక్కగా ఉంది. మీలో ఉన్న సారాంశ బలం, పరిణితి కధని కత్తి అంచుపై నడిపించాయి. సాహిత్య జీవులపై చేసిన వ్యాఖ్యల నిడివి తగ్గించినా కధకి ఎటువంటి నష్టం జరిగేది కాదు. మీ వాక్యం చాలా బాగుంది. కవిత్వం కంటే కధలో మరింత, మరింత గొప్పగా ఉంది. మీకు నా హృదయ పూర్వక శుభాభినందనలు.
వాడి కథ గురించి Gorantla Saheb peera గారి అభిప్రాయం:
02/08/2023 10:54 pm
మనిషి ఆశలు,ఆశయాలు,ఆలోచనలు ఈ మూడింటి మధ్య కొట్టుమిట్టాడుతాము అనే సత్యాన్ని చాలా చక్కగా చెప్పారు బాస్కర్ గారు. కథ చదువుతున్నంతసేపు మదిలో చాలా అలజడే కలిగిందంటే నమ్మండి.
మీరు ఈ కథ కత్తితో రాశారు భాస్కర్ గారూ, అంతే వాడి, అంతే నిష్పక్షపాతం. రచయితలనీ, పాఠకులనీ సమానంగా నిలదీసే కథ. కథ చదివి ఇంచుమించు రెండు రోజుల తర్వాత మళ్లీ వచ్చాను. ఆత్మావలోకనం చేసుకోకుండా ఉండడం అసాధ్యం.
>పుస్తకాలమనిషి లంకా సూర్యనారాయణగారు నిర్వహిస్తున్న అపురూపమైన అన్నమయ్య గ్రంథాలయం సందర్శించాను.
ఆ గ్రంథాలయంలోనే చాగంటివారు వ్రాసిన ‘ఆధునికవిజ్ఞానము – మానవుడు’ (యం. శేషాచలం అండ్ కంపెని 1958, 64) మూడు ప్రతులున్నాయి. ఆ పుస్తకపు చివరి అట్టపై డాక్టర్ చాగంటివారి ఫొటో ఉంది.
డా భార్గవి: డా చాగంటి సూర్యనారాయణ మూర్తిగారి గురించి ఈ విషయం నాకు ఇప్పటిదాకా తెలీదమ్మా. బెజవాడలో వారి హస్పిటల్ బాగా ఫెమిలియర్ ప్లేస్. నా చిన్నతనంలో – మూడు, నాలుగు తరగతుల రోజులు – సరస్వతీ టాకీస్ దగ్గరలో ఉన్న మా ఇంటికి వచ్చి మా తాతగారికి ఇంటి దగ్గరే సర్జరీలు చేయడం గుర్తుంది.
అమ్మ చెప్పిన అబద్ధం గురించి లట్టుపల్లి విక్రమ్ గారి అభిప్రాయం:
02/11/2023 12:01 pm
రచన బాగుంది… పాలిపోయిన నిజం కంటే, రంగేసిన అబద్ధమే బాగుంటుందని అర్థమైంది.
అమూర్తం గురించి అల్లాడి మోహన్ గారి అభిప్రాయం:
02/09/2023 8:39 pm
“ముఖ్యంగా రెండవ చరణంలో సాగరుడ వీవె అన్న చోట సా-ని సాగదీస్తూ పలికిన గమకం, ‘సహస్రబాహువులతో కాళిందిని అక్కున జేర్చుకుంటున్న సముద్రుణ్ణి గుర్తుకు చేసిందని, … చదివినప్పుడు, తెనాలి రామకృష్ణ కవి పాండురంగమహత్యం లోని ఈ పద్యం గుర్తొచ్చింది.
గంగా సంగమ మిచ్చగించునె? మదిన్ కావేరి దేవేరిగా/
అంగీకారమొనర్చునే? యమునతో ఆనందముం పొందునే?/
రంగత్తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ/
అంగంబంటి సుఖించునేని గుణభద్రా, తుంగభద్రా నదీ!
కథ పేరు “అమూర్తం” అయినా, చేతివ్రాత లో ఉన్న పాట తిరిగి ఇచ్చేయడంతో, గత స్మృతిలోని హిమజ్వాల రగిలి ప్రజ్వలిస్తూనే ఉంది అని తెలుపడం ద్వారా “మూర్తివంతమైన” కథకుడి విశ్వరూపాన్ని ఆవిష్కరించింది ఈ కథ.
ఆకట్టుకొనే కథనం తో సాగిన మంచి కథ అందిచినందుకు ధన్యవాదములు స్వామిన్!
ఆక్సిజన్ మాస్క్ గురించి bhaskar గారి అభిప్రాయం:
02/09/2023 3:02 pm
చాలా జీవితాలు ఇంతే 🙂 కథ మాత్రం చాలా బావుంది. నేను ముందే గెస్ చేసా.
వాడి కథ గురించి శ్రీరామ్ పుప్పాల గారి అభిప్రాయం:
02/09/2023 8:49 am
మీరు కధని నడిపించిన తీరు నాకు చాలా నచ్చింది. పాత్రల వ్యవహారం సరేసరి. కధలో కొంత వైరాగ్యం కనిపించింది. కానీ జీవితం పట్ల మనిషికుండాల్సిన ఆలోచనల ఫ్రెష్ నెస్ ప్రతీ వాక్యంలో నన్ను హత్తుకుంది. బిగి సడల్లేదు. నిర్మాణం చక్కగా ఉంది. మీలో ఉన్న సారాంశ బలం, పరిణితి కధని కత్తి అంచుపై నడిపించాయి. సాహిత్య జీవులపై చేసిన వ్యాఖ్యల నిడివి తగ్గించినా కధకి ఎటువంటి నష్టం జరిగేది కాదు. మీ వాక్యం చాలా బాగుంది. కవిత్వం కంటే కధలో మరింత, మరింత గొప్పగా ఉంది. మీకు నా హృదయ పూర్వక శుభాభినందనలు.
వాడి కథ గురించి Gorantla Saheb peera గారి అభిప్రాయం:
02/08/2023 10:54 pm
మనిషి ఆశలు,ఆశయాలు,ఆలోచనలు ఈ మూడింటి మధ్య కొట్టుమిట్టాడుతాము అనే సత్యాన్ని చాలా చక్కగా చెప్పారు బాస్కర్ గారు. కథ చదువుతున్నంతసేపు మదిలో చాలా అలజడే కలిగిందంటే నమ్మండి.
వాడి కథ గురించి కల్యాణి నీలారంభం గారి అభిప్రాయం:
02/08/2023 10:51 pm
మీరు ఈ కథ కత్తితో రాశారు భాస్కర్ గారూ, అంతే వాడి, అంతే నిష్పక్షపాతం. రచయితలనీ, పాఠకులనీ సమానంగా నిలదీసే కథ. కథ చదివి ఇంచుమించు రెండు రోజుల తర్వాత మళ్లీ వచ్చాను. ఆత్మావలోకనం చేసుకోకుండా ఉండడం అసాధ్యం.
పరిచయం: డాక్టర్ కథ గురించి Yerikalapudi Vasudeva Rao గారి అభిప్రాయం:
02/08/2023 1:29 pm
శ్రీ శేషతల్పశాయి,
డవున్లోడ్ చేసుకున్నాను. ధన్యవాదాలు. (ఆధునిక విజ్ఞానము-మానవుడు by చాగంటి సత్యనారాయణమూర్తి అని ఉంది గమనించారా.)
నమస్కారాలతో
-ఎ వా రా
ఆమె దుఃఖించింది గురించి k.venkata Rama Krishna గారి అభిప్రాయం:
02/08/2023 8:38 am
చాలా బావుంది
పరిచయం: డాక్టర్ కథ గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:
02/07/2023 4:27 am
>పుస్తకాలమనిషి లంకా సూర్యనారాయణగారు నిర్వహిస్తున్న అపురూపమైన అన్నమయ్య గ్రంథాలయం సందర్శించాను.
ఆ గ్రంథాలయంలోనే చాగంటివారు వ్రాసిన ‘ఆధునికవిజ్ఞానము – మానవుడు’ (యం. శేషాచలం అండ్ కంపెని 1958, 64) మూడు ప్రతులున్నాయి. ఆ పుస్తకపు చివరి అట్టపై డాక్టర్ చాగంటివారి ఫొటో ఉంది.
https://archive.org/details/in.ernet.dli.2015.328681/page/n119/mode/2up
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
పరిచయం: డాక్టర్ కథ గురించి ఎరికలపూడి వాసుదేవ రావు గారి అభిప్రాయం:
02/06/2023 6:51 pm
డా భార్గవి: డా చాగంటి సూర్యనారాయణ మూర్తిగారి గురించి ఈ విషయం నాకు ఇప్పటిదాకా తెలీదమ్మా. బెజవాడలో వారి హస్పిటల్ బాగా ఫెమిలియర్ ప్లేస్. నా చిన్నతనంలో – మూడు, నాలుగు తరగతుల రోజులు – సరస్వతీ టాకీస్ దగ్గరలో ఉన్న మా ఇంటికి వచ్చి మా తాతగారికి ఇంటి దగ్గరే సర్జరీలు చేయడం గుర్తుంది.
డా. జంధ్యాల దక్షిణామూర్తి గూడా వస్తూ ఉండేవారు.
నమస్కారాలతో
ఎ వా రా