1974 లో “నూట పదహార్లు,” పేరిట తెలుగులోని ఉత్తమ కథలని తాళ్ళూరి నాగేశ్వరరావు, హితశ్రీ సంకలనం చేశారు; మొదటి భాగం మాత్రమే చెయ్యగలిగారు. దానిని తిరిగి ఈ మధ్యనే విశాలాంధ్ర “శత వసంతాల తెలుగు కథ,” గా ప్రచురించింది. నేనివాళ ఉబుసుపోకకై దానిలో జి.వి.కృష్ణరావు గారి కథ “ఉదబిందువులు,” చదివాను. వారి ఇతర రచనలని తిరగేస్తే “భిక్షాపాత్ర” కనిపించింది. ఈ నాటికని ఆకాశవాణి జాతీయ నాటికగా ప్రసారం చేసిందన్నారు హితశ్రీ: https://archive.org/details/sahithichaithrar022777mbp/page/n123/mode/2up
క్ష-ప్రాస కేవలం ఇలాంటి విపరీతపు సందర్భాల్లోనే వాడతారు…
భాగవతంలో నేను కోకొల్లలుగా గమనించాను. పోతన ళ, ణ, క్ష అనేవి వాడి కూడా ద్రాక్షాపాకం రాయడంలో అక్షయతూణీరుడు. మనం మర్చిపోయిన ఌ (అలు) అనేది కూడా సునాయాసంగా వాడగలడేమో అనిపిస్తుంది భాగవతం చదివితే. కిందన కొన్ని వామనవతారం నుంచి.
ఈ ముఖాముఖీ చాలా ఆసక్తికరంగా ఉంది. నేను కృష్ణమూర్తిగారిని హైదరాబాదులో వారింట్లో ఒకసారి, అమెరికాలో మా ఇంట్లో ఒకసారి కలుసుకున్నాను. ఇప్పుడు మళ్ళా ఆయన గొంతుక వినడం ఆధునిక సాంకేతిక విప్లవం వల్ల సాధ్యపడింది! ఈ ప్రసంగం వింటూవుంటే “సంపాదకుడు” అనేమాట ఎలా పుట్టి ఉంటుందో అర్థం అయింది.
ఎంత చక్కని ఆకృతులు. చాలా విషయాలు మన దేశంలో మన రాష్ట్రాలలో మన ఊళ్ళలో మన జనాల్లో నాలాంటి మనసులలో ఏ విధమైన చలనం ఆస్వాదించే తత్వం లేకుండా పోయాయి. అయ్యో, ఇలాంటి ఆస్తుల్ని చూడాలి కాపాడుకోవాలని కొంచెం కూడా లేదు కదూ. నేనెప్పుడు మారతానో…
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3 గురించి Lakshmi Narasimha Rao Sista అభిప్రాయం:
09/10/2024 1:08 pm
చాలా పరిశోధనాత్మకమైన, మంచి వ్యాసం. చక్కగా ఉంది. ఆలోచింపచేశే వ్యాసం.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు- 2 & 3 భాగాలు దొరికాయి. మొదటి భాగం దొరకలేదు.
[మొదటి భాగం – సెప్టెంబర్ 2017; నాలుగవ భాగం – డిసెంబర్ 2017; ఐదవ భాగం – అక్టోబర్ 2018 – సం. ]
ముష్టి పలురకములు గురించి VSTSayee అభిప్రాయం:
09/10/2024 10:13 am
కృష్ణరావుగారి ‘కటకట’ను “హితశ్రీ”గారు చెప్పినా, వీరి వ్యాసులవారు చాలాదూరం వెళ్లారు!
‘భిక్షాపాత్ర’ నాటిక ఇక్కడ.
నమస్తే,
వాడపల్లి శేషతల్పశాయి.
ముష్టి పలురకములు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
09/08/2024 11:58 pm
శాయి గారన్నమాట: “వీరిలాంటి గురువులకు/అధ్యాపకులకు భృతి సమాజమే కల్పించాలి.”
1974 లో “నూట పదహార్లు,” పేరిట తెలుగులోని ఉత్తమ కథలని తాళ్ళూరి నాగేశ్వరరావు, హితశ్రీ సంకలనం చేశారు; మొదటి భాగం మాత్రమే చెయ్యగలిగారు. దానిని తిరిగి ఈ మధ్యనే విశాలాంధ్ర “శత వసంతాల తెలుగు కథ,” గా ప్రచురించింది. నేనివాళ ఉబుసుపోకకై దానిలో జి.వి.కృష్ణరావు గారి కథ “ఉదబిందువులు,” చదివాను. వారి ఇతర రచనలని తిరగేస్తే “భిక్షాపాత్ర” కనిపించింది. ఈ నాటికని ఆకాశవాణి జాతీయ నాటికగా ప్రసారం చేసిందన్నారు హితశ్రీ: https://archive.org/details/sahithichaithrar022777mbp/page/n123/mode/2up
కొడవళ్ళ హనుమంతరావు
కాల్వీనో కథల నుంచి – 10 గురించి Sudha అభిప్రాయం:
09/08/2024 10:49 pm
Multiplicity, rawness of text… Thoroughly enjoyed it.
దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 7 గురించి అద్దాల వీర వేంకట సత్యనారాయణ మూర్తి అభిప్రాయం:
09/08/2024 5:21 am
నేను రమేష్ గారు చెప్పిన పదబంధంతో ఏకీభవిస్తున్నాను.
ముష్టి పలురకములు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/05/2024 2:24 pm
భాగవతంలో నేను కోకొల్లలుగా గమనించాను. పోతన ళ, ణ, క్ష అనేవి వాడి కూడా ద్రాక్షాపాకం రాయడంలో అక్షయతూణీరుడు. మనం మర్చిపోయిన ఌ (అలు) అనేది కూడా సునాయాసంగా వాడగలడేమో అనిపిస్తుంది భాగవతం చదివితే. కిందన కొన్ని వామనవతారం నుంచి.
క. పాణియు, రథియుఁ, గృపాణియుఁ,
దూణియు, ధన్వియును, స్రగ్వి తురగియు, దేహ
త్రాణియు, ధిక్కృత విమత ప్రాణియు,
మణి కనక వలయ పాణియు నగుచున్. [8-441]
క. బిక్షాపాత్రిక నిచ్చెను
యక్షేశుఁడు వామనునకు; నక్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
బిక్షునకు భవాని పూర్ణబిక్ష నరేంద్రా! [8-518]
క. ప్రక్షీణ దివిజ వల్లభ
రక్షాపరతంత్రుఁ డగుచు రాజీవాక్షుం
డా క్షణమున బలి యింటికి
బిక్షాగమనంబు జేసెఁ బేదఱికముతోన్. [8-525]
ఇక్కడ నా సుత్తి – వామనావతారం – ఉచిత పుస్తకం. కౌముదిలో రాసిన వ్యాసాల సంపుటి –
https://koumudi.net/books/KOUMUDI_VAAMANAAVATARAM.pdf
పూర్తి పోతన తెలుగు భాగవతం ఇక్కడ – http://telugubhagavatam.org/
భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ గురించి Venkateswararao VEMURI అభిప్రాయం:
09/04/2024 6:24 pm
ఈ ముఖాముఖీ చాలా ఆసక్తికరంగా ఉంది. నేను కృష్ణమూర్తిగారిని హైదరాబాదులో వారింట్లో ఒకసారి, అమెరికాలో మా ఇంట్లో ఒకసారి కలుసుకున్నాను. ఇప్పుడు మళ్ళా ఆయన గొంతుక వినడం ఆధునిక సాంకేతిక విప్లవం వల్ల సాధ్యపడింది! ఈ ప్రసంగం వింటూవుంటే “సంపాదకుడు” అనేమాట ఎలా పుట్టి ఉంటుందో అర్థం అయింది.
Janaki’s Zen గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
09/04/2024 4:24 pm
ఏమి చిత్రమైన విమర్శ!!
పరమానందము రామస్మరణానంద మని
నరులలోన కొందరే నయముగ నెఱుగుదురు
ఎఱిగినట్ఞి వారలకది యెంతో యానందము
ఎఱుకలేని వారెన్నడు నెఱుగని యానందము
కఱకంఠుడు పొందుచుండు ఘనమగు నానందము
మఱియును యోగీంద్రులెల్ల మఱిగిన యానందము
సీతమ్మ వారి వలెను చిత్తమున స్మరించుట
వాతాత్మజు వలెను స్మరణ వదలలే కుండుట
ప్రీతితోడ పవలురేలు విడువక స్మరియించుట
చేతోమోదముగ నెఱిగి చెలగు సద్భక్తులకు
ఇట్టిది యగు నానంద మింకొక్క టుందదని
గట్టిగ తమహృదయంబుల ఘనముగ నెఱిగిన
పుట్టువుతో వైరాగ్యము పొందిన ధన్యాత్ములు
పట్టివిడువకుండ నుండి బడయు నానందము
[ రామకీర్తనలు – 2440 ]
చర్చలో పాల్గొనిన అందరికీ ధన్యవాదాలు. సెలవు.
భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ గురించి వి. రమేశ్ అభిప్రాయం:
09/04/2024 1:55 pm
చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ.
మోహన రాగ మహా! గురించి Kannaji rao అభిప్రాయం:
09/04/2024 12:20 am