రామారావు, నాగేశ్వరరావు సరదాగా టెన్నిస్ ఆడడం కె.వి.రెడ్డి గమనించారనీ, అందులో ఒక బాల్ మిస్ అయిన రామారావు కోపంతో దాన్ని దూరంగా పడేట్టు బాదాడనీ, అది చూసి రెడ్డిగారు పాతాళభైరవిలో నాగేశ్వరరావుకు బదులుగా రామారావును తీసుకున్నారనీ ఎక్కడో చదివాను.

ఆ చిరునగవు సౌరభమంతకంత
నన్ను చుట్టుకొనంగ నా కన్ను లందుఁ
గమ్మె భాష్పచయము. బిచ్చగత్తె యంత
నొడలదొంతి తోడను నాదు కడకు వచ్చె.

జీవకణాల సంయోగవియోగాలు
భావకవుల భవిష్యత్కావ్యాలు
అనంత చరణాల ఈ జీవనగీతం
శతసహస్రవాద్యాల స్వరసంగమం

పర్వపర్వమునకు పద్యాలు పచరించి
పత్రికలకు పంపువాని విడచి
ఇరుగు పొరుగు జూచి చిరునవ్వు నవ్వెడి
వాని ఇంటికి జను వత్సరాది

ఎవరైనా మనుషులో, సమాజాలో కష్టంలో ఉన్నారని తెలుసుకుంటే వాళ్ళలోని ‘లోపాల్ని’ తప్పనిసరై ఎత్తి చూపించవలసినప్పుడు కూడా ఆ పనిలో సానుభూతి, కరుణ కనిపిస్తాయి. సృజనాత్మకమైన పని – అంటే కళ నిర్వహణ, అభివ్యక్తి ఎంత కష్టతరమో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోగలిగితే అది ఒకరకమైన వందనానికి, కరుణకు దారితీస్తుంది.

వఱడు అంటే ముసిలి నక్కట. ఆ జంతువు ప్రతీకగా మానవ నైజాన్ని ఇంత సూటిగా చిత్రీకరించిన ఈ కథ మొదటి సారి చదివినప్పుడు నన్నెలా ప్రభావితం చేసిందో, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎప్పుడు చదివినా అలానే నన్ను పట్టి ఊపేస్తుంది.

యాసీన్‌కు ఊపిరాడ్డం లేదు. ఈ భయంతో బతకటం దుర్భరమనిపించింది. పైగా ఆ మనిషి జేబులోంచి చేయి తీయడేం? అతడి వాలకం బట్టి అతడు దాడి చేస్తాడనే అనిపిస్తుంది. అతడు దాడికి దిగితే ఏమవుతుంది? ఏం చేస్తాడతడు? అసలింతకీ, ఇంకా ఏం చెయ్యడేం?

పెళ్ళయి మూడు నెలలకి పైనే అయ్యింది. పొద్దునే లేచి, సానుపు జల్లి, ముగ్గు పెట్టి, వంట చేసి ముసలాడికి వేడిగా పెట్టి మిగిలినదాన్ని కన్నెమ్మ తింటుంది. రోజూ ముసలాడు బయలుదేరి ఎక్కడికో వెళ్ళేవాడు. ఎక్కడి వెడుతున్నానని గాని, ఎందుకు అని గాని ఏమీ చెప్పడు. ఈమె కూడా దాని గురించి ఎక్కువగా దిగులు పడింది లేదు.

విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు.

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

ఊర్మిళాదేవి నిద్ర: మన ప్రాచ్య సంస్కృతులలో రామాయణం కేవలం ఒక కావ్యం కాదు. సీతారాముళ్ళు కేవలం దేవతలూ కారు. రామాయాణంలో పాత్రలన్నీ మన జీవితాల్లోని పాత్రలు. మన జీవితాల్లో ఉండే కష్ట నష్టాలు, సుఖదుఃఖాలను మనలాగే అనుభవించే మామూలు మనవాళ్ళు. అందుకేనేమో, మనకెన్ని వందల రామాయణాలో! ఒక్కో రామాయణం చెప్పే కథ ఇంకో రామాయణం చెప్పదందుకే మరి! తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాలుగా తెలుగు స్త్రీల పాటలలో ఒక విడదీయరాని భాగమైపోయిన అచ్చు అలాంటి ఒక రామాయణపు కథే ఊర్మిళాదేవి నిద్ర. ఈ కథ ఇతర భాషల్లో కూడా వున్నా, ఈ పాట నిస్సంశయంగా తెలుగు కవయిత్రి సృష్టి. తెలుగు మహిళావరణంలో మౌఖికసారస్వతంగా మొదట రూపుదిద్దుకున్న ఈ అపూర్వమైన జానపద సాహిత్యం గురించి వివరిస్తున్న వెల్చేరు నారాయణ రావు విశిష్ట వ్యాసం, బి. సుబ్బులు, కోలవెన్ను మలయవాసినిగార్లు పాడిన ఈ పాట, ఈ సంచిక ప్రత్యేక ఆకర్షణలు.


09 జనవరి: ఆకస్మిక ప్రచురణ – వేణునాదం ఆగింది! ఏల్చూరి విజయరాఘవరావుగారికి రోహిణీప్రసాద్ నివాళి.

ఈ సంచికలో మీకోసం: చంద్ర, సుబ్రహ్మణ్యం, దమయంతి, రామసీత, గౌరి తదితరుల కథలు; కనకప్రసాద్, వంశీకృష్ణ, హెచ్చార్కె, జాన్‌హైడ్, తః తః, దేశికాచార్యుల కవితలు; మోహనరావు, వెంకటరమణ, నారాయణ రావు, రోహిణీప్రసాద్ తదితరుల వ్యాసాలు; మలయవాసిని, సుబ్బులు, కనకప్రసాద్ శబ్ద తరంగాలు; నాకు నచ్చిన పద్యం, పలుకుబడి, కథ నచ్చిన కారణం తదితర శీర్షికలు… …

నువు నా చుట్టూ నా చూపు కోసం, నవ్వు కోసం తిరగడమే గుర్తుంది కానీ నేను నీ చుట్టూ తిరగడం ఎప్పుడు మొదలయిందో గుర్తు రావడం లేదు. మనం రహస్యంగా కలుసుకోవడానికి ప్లాన్స్ వేసుకోవడమూ, ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురు చూడటమూ గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు మనిద్దరమూ కూచుని చెప్పుకున్న కబుర్లు గుర్తు చేసుకుంటాను.

గత నాలుగు నెలలగా మన ఇంట్లో పొదుపు ఉద్యమం సవ్యంగా సాగిపోతోంది. రేపు మనం నవ్వుతూ బతకడానికి ఈ వేళ ఏడ్చినా ఫరవాలేదు అనే పొదుపు ధర్మ సూత్రం ఆధారంగా, రేపు మనకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని ఈ వేళ సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉద్రేకంతో పొదుపు చేసేస్తున్నాం.

అమ్మ నాకు జడ గంటలేసి, పచ్చని చేమంతి చెండు ఈ జడ మీంచి ఆ జడ మీదకి అర్థ చంద్రాకారపు వొంపు తేల్చి జడలల్లేది. పేరంటాలలో అందరూ నా జడల్ని చూసి మెచ్చు కుంటూంటే నా కంటే అమ్మకే ఎక్కువ ఆనందమేసేది. వంటింట్లో భోజనాల సమయంలో గమనించేదాన్ని; అందర్లోనూ భోగి ‘పండగ తలంటి’ కళ కొట్టొచ్చినట్టు కనిపించేది.

“నన్ను క్షమించండి.” అన్నాను వాళ్ళను సమాధానపరుస్తూ. “బహుశా సవ్యంగా లేనిది నేనేనేమో. తప్పు నాలోనే ఉందేమో. ఎందుకో ఒక్క క్షణం నాకలా అనిపించింది. ఇప్పుడంతా మళ్ళీ మామూలుగానే, బాగానే ఉంది. దయచేసి నన్ను క్షమించండి.” అని మెల్లిగా వాళ్ళ మధ్యనుండి తల దించుకొని బయటకొచ్చాను.

అదేమి వింతో, దాని గురించి నాకు ఇదేమి చింతో అర్థం కాదు. సరిగ్గా నేనిలా ఉన్నప్పుడే కరెంటు ఉండదు. బయట సూర్యుడు దాక్కుంటాడు. లోపలా, బయటా, చీకట్ల మధ్య నేను మిగిలి, ఏమిటీ చీకటి? అని ఆలోచిస్తూ ఉంటాను. ఏమన్నా సాయం వస్తావేమో అని పక్కకి తిరిగితే, అప్పుడు మాత్రం కనబడవు.

ఇందులో వ్యంగ్యం ఏ మాత్రం లేదు. తనవారిని కూడా వెదికించి ఖైదులో ఉంచమని ప్రాదేయపడటంలో తన భార్యాబిడ్డలకి కనీసావసరమైన పూటభోజనం సమకూర్చాలన్న తపన, ఆరాటం, సమకూర్చలేని తన అశక్తత, ఉరిశిక్ష వేసినా అన్నం పెట్టిన అధికారుల పట్ల అమాయకమైన కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి.

“కాస్త నమ్మకంగా, ఖచ్చితంగా రెండువారాల కొకసారి వచ్చి లాన్‌ చేసే వాడిని, మరొకణ్ణి చూసుకోవాలి,” అని ఇద్దరూ అనుకుంటారు, గోమెజ్ రానప్పుడల్లా! గోమెజ్ రాగానే ఇద్దరూ ఆ విషయం మరిచిపోతారు! కారణం, వచ్చినప్పుడు లాన్‌ పని బాగా చేస్తాడు. పై పై పనులెన్ని చెయ్యమని చెప్పినా విసుక్కోడు.

మడత మంచం మీద కూర్చున్నప్పుడు, కిటికీ ఊచల నుంచి తన నుంచి అన్యాక్రాంతం అయిపోయిన ఆ కొబ్బరి తోటలో విరగ కాచిన కొబ్బరికాయల మీద చూపు నిలబడుతున్నప్పుడు నజీబు కళ్ళ ముందు వచ్చి నిలబడ్డాడు.

నర్తనశాల సినిమాలో ఘంటసాల గానం చేసిన ఈ పద్యం చాలామంది వినివుంటారు. భారతం విరాటపర్వం లోనిది ఈ పద్యం. కవి తిక్కన సోమయాజి. ఉత్తర గోగ్రహణ సమయంలో దుర్యోధనుణ్ణి ఓడించి, అతని ఎదురుగా నిలిచి అతన్ని ఉద్దేశించి అర్జునుడు ఎగతాళిగా ఎత్తిపొడుస్తూ చెప్పిన మాటలు ఇవి.