రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కచేరి తర్వాత…

రచన: రఘు శేషభట్టార్
జులై 2023

ఆమె పేరు ఏదైనా కావచ్చు
నేనెప్పుడూ తెలుసుకోవాలనుకోలేదు.
సృష్టి నిర్మాణ రహస్యాలేవో పొడి చేసి
పౌడరులా పూసినట్టున్న ఆమె ముఖంలోకి
తేరిపారా చూడాలనుకోలేదు.

ఆమె ఇరవై, ఇరవై రెండేళ్ళ ఈడులో
తతిమ్మా ప్రపంచాన్ని పలుగుతాడు చేసి
తనొక వైపు, నా ఈడు కుర్రలోకాన్ని మరోవైపు
ఉర్రూతలూగిస్తున్నప్పుడు
మూర్ఛపోతున్న నా జతగాళ్ళ గుంపును తట్టిలేపటం
తప్పని వంతయ్యేది.

కొన్ని గాంధర్వాలు కురిసి వెళ్ళాక-
తన కోసం సిద్ధం చేసిన ఒక చిటికెనవేలు పట్టుకొని
కొంగుముడితో వెళ్ళటం వరకే గుర్తుంది.
బహుశా
మకరంద వర్షాలు కురిసే మరో ఇంటిని
తుమ్మెద రెక్కలతో నింపి ఉంటుంది.

మళ్ళీ ఇన్నేళ్ళకు-
అయ్యంగారి చీరకట్టుతో పీట మీది త్యాగరాజుకు
ధూపం వేసి పాడినప్పుడు
నాలాంటి ఎన్నో జతల మెచ్చుకోలు కళ్ళు
వర్షధారలై మహిత మంగళం పాడాయి.

సంగీతం నిర్వచనాలకు అందుతుందని ఎప్పుడూ అనుకోలేదు
పెదవుల్లో తుళ్ళిపడే వినమ్రత కన్నా
తన సృజనకు బహుమతి ఏముంది?

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • జ్ఞాపిక
  • కచేరి తర్వాత…
  • నమ్రత రాసిన పద్యం
  • ఒక అనాసక్త బహుమతి

ఇటువంటివే…

  1. విమర్శ: ప్రచురణకు ముందు, తర్వాత
  2. ముగ్గు
  3. నిశ్శబ్దం లో నీ నవ్వులు
  4. నువ్వూ – కాలం
  5. స్వప్నగానం

జులై 2023 సంచికలో ...

  • “మిలన్… గీత్ గాతా చల్!”
  • ఊహల ఊట 26
  • కచేరి తర్వాత…
  • కన్నీటి నాలుక
  • గడినుడి – 81
  • జీవగంజి
  • జులై 2023
  • ది వేస్ట్‌ లాండ్: 3. గేమ్ ఆఫ్ చెస్ 2వ భాగం
  • దివ్వెలు
  • దీప నిర్వాణ గంధం
  • నాకు నచ్చిన పద్యం: ఒక పరిణతమైన ఆశుధార
  • మనమెరుగని మధ్య అమెరికా ౩
  • యూట్యూబ్‍లో ఈమాట: జూన్ 2023
  • వానగీతం
  • విశ్వమహిళానవల 24: ఆలివ్ ష్రైనర్
  • సాప
  • సోల్జర్ చెప్పిన కథలు: తలక్రిందులు
  • స్వప్నగానం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

స్వప్నగానం
దివ్వెలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.