Trash

రాత్రి అశ్రువు నుండి ఉదయం రాలిపడింది.
గులాబీలు పరుచుకున్న దారులు మూసుకుపోయాయి.
ఆకాశపు నగ్నత నుండి నక్షత్రాలు తప్పుకున్నాయి.

ఎగిరే పక్షులన్నీ తమ పాటలను మోసుకుపోతున్నాయి.
మనుషుల అలికిడితో రహదారులు నలుగుతున్నాయి.
ఎవరి బాధో హృదయమై కంటిలో కాన్వాస్ అవుతోంది.

ఏ దృశ్యమూ మనోహరంగా లేదు.
విరిగిన చూపు పెచ్చులై రాలుతోంది.
స్తబ్ధమైన మనస్సుతో, ఆహ్లాదం పోటీ నుండి నిష్క్రమించింది.
ప్రపంచం మాయమయింది.

ఏదీ మిగిలి ఉండదు, ప్రతి ఫలమూ రాలిపడవలసిందే.
ఏదీ నిలువ ఉండదు, ప్రతి సుమమూ వాడిపోవలసిందే.
ఇదంతా నిద్ర వెలసిన కల అని
చెవులు కొరుక్కుంటున్న కనకాంబరం మొక్కలు.