[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- దక్షిణాదిని కుమారి
సమాధానం: కన్యా
- ఆకె
సమాధానం: ఆమె
- గర్భగుడి వుండేది
సమాధానం: ఆలయంలో
- కొందరికి కఠినం, కొందరికి కులాసా
సమాధానం: కారాగారం
- డైరెక్షన్
సమాధానం: దిశ
- మంచి యోధుడా (తలకిందులు)
సమాధానం: టాభసు
- ఉపయోగించి
సమాధానం: వాడి
- మొదటి వేల్పు వయస్సు
సమాధానం: ముది
- గృహాలు
సమాధానం: పట్లు
- విద్య ఒక వేదం
సమాధానం: విలు
- ప్రాణహానికి పెట్టింది పేరు
సమాధానం: లారీ
- ఉదకమండలం
సమాధానం: ఊటీ
- భూమి మన్నింపు
సమాధానం: క్షమ
- సంశయం
సమాధానం: శంక
- ఒక ప్రేమికుడు
సమాధానం: మజునూ
- ఒకడు, ఇంకొకడు కలిసి విష్ణు వాహనం
సమాధానం: గరు
- మాటి మాటికి
సమాధానం: పదంపదం
- విరాజితం వృత్తం
సమాధానం: కవిరాజ
- మచ్చ చెరగదు
సమాధానం: పుట్టు
- ఆగు! ఖలునికి వెల్లవిషం
సమాధానం: నిలు
నిలువు
- భాండము
సమాధానం: కలశము
- ఆకారంతో పాపనాశనం
సమాధానం: న్యాయం
- డిటెక్టివులు తీసేది
సమాధానం: ఆరా
- విద్యుచ్ఛక్తి కొలమానాలు
సమాధానం: మెగావాట్లు
- వారం శెలవు 19.
సమాధానం: ఆది
- పాత్ర
సమాధానం: లోటా
- రాజకీయ నాయకుని ఇంటి పేరు
సమాధానం: కాసు
- దయచెయ్యండి (బైటికి కాదు లోనికి)
సమాధానం: రండి
- భయంతోనే ఇది
సమాధానం: భక్తి
- సూర్యుడుంటే ఇదెందుకు?
సమాధానం: దివిటీ
- జీవితంలో తప్పనిది
సమాధానం: పరీక్ష
- కొందరి వుపన్యాసాలు
సమాధానం: ఊకదంపు
- ఒక పగలు, ఒక రాత్రి
సమాధానం: రోజు
- వజ్రాలు
సమాధానం: మగరాలు
- మెరుపు
సమాధానం: శంప
- అరిషడ్వర్గాలలోనిది
సమాధానం: మదం
- తండుల కణం
సమాధానం: నూక
- జబ్బు మరు జన్మలోనే
సమాధానం: రుజ
- ఇల్లు
సమాధానం: పట్టు
- చెవినిడి
సమాధానం: విని