[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఇలా అంటే అదా?
సమాధానం: ఇదికాదు
- విశ్వామిత్రుడు కోరింది
సమాధానం: యాగరక్ష
- మేఘాలలో మేటి
సమాధానం: పుష్కలావర్తం
- జలచరాలలో గొప్పది
సమాధానం: తిమి
- తిను (గడ్డి మొదలైనవి)
సమాధానం: మేము
- ఎన్నిక
సమాధానం: గణుతి
- ఇవి దూరని చోటు లేదంటారు
సమాధానం: గాలులు
- బోలెడు మంది
సమాధానం: పెక్కండ్రు
- బంగారు కొండ
సమాధానం: మేరువు
- చతుర్ముఖ బ్రహ్మ (తలకిందులు)
సమాధానం: వలున
- వెదకటానికి — మూలలు
సమాధానం: నలు
- చింతలో చావనిది
సమాధానం: పుల్ల
- పాత ఢిల్లీ
సమాధానం: హస్తినాపురి
- 19కి గ్రాంథిక రూపం
సమాధానం: వచ్చితిరి
- అమూల్యమైనదా?
సమాధానం: నత్తగుల్ల
నిలువు
- ఆరు
సమాధానం: ఇరుతిగ
- కులం ఫలించటం
సమాధానం: కాపు
- సహజ కర్మకాదు
సమాధానం: దుష్కర్మ
- అంతా ఉంది కావ్యంలో
సమాధానం: యావత్తు
- గుంట
సమాధానం: గర్తం
- రెండో తరగతి పౌరులా?
సమాధానం: క్షరములు
- విస్ఫులింగాలు
సమాధానం: మిణుగురులు
- సుప్రభాతం?
సమాధానం: మేలుకొలుపు
- శివుడు
సమాధానం: ముక్కంటి
- దగ్గర చుట్టం
సమాధానం: మేనబావ
- ఆఫ్రికా అమ్మాయి
సమాధానం: నల్లపిల్ల
- 24కి వాడుక రూపం
సమాధానం: వస్తిరి
- చేరువలో
సమాధానం: దాపున
- దెబ్బ
సమాధానం: హతి
- ఏం లేదు
సమాధానం: రిత్త