[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- దిగంబర్షులు
సమాధానం: సనకసనందనాదులు
- స్త్రీ
సమాధానం: రామ
- ఒక దేవుడు
సమాధానం: హరి
- పారదారికాధికరణంలో మార్గం
సమాధానం: దారి
- కావాలి
సమాధానం: వలెను
- నడిచే నాలుగో వంతు
సమాధానం: కాలు
- తలలేని చుక్కవర్తి
సమాధానం: క్కవర్తి
- ఒకడు, ఇంకొకడు
సమాధానం: డుడు
- ఇంగ్లీషు రమ్ము, సంస్కృతపు నీళ్ళు
సమాధానం: కం
- పార్వతి
సమాధానం: సతి
- హింసతోనూ, అహింసతోనూ చెయ్యవచ్చు
సమాధానం: సమరం
- సీనీతార
సమాధానం: ప్రభ
- లోపలి నిజం మిశ్రసమాసం
సమాధానం: లోసత్యం
- నలుగురిలోనూ, ఎనమండుగురిలోనూ ఉన్న శ్రద్ధ
సమాధానం: గురి
- అత్తమీది కోపం దీని మీదనా?
సమాధానం: దుత్త
- వేదన
సమాధానం: వగ
- సంగీత స్వరాలు
సమాధానం: సరిగమపదనిసలు
నిలువు
- దాసరి మారితే అరవంలో అలాగే
సమాధానం: సరిదా
- భూతేందు ధారాధరా
సమాధానం: కరా
- యముడు
సమాధానం: సమవర్తి
- అగ్ని
సమాధానం: దహనుడు
- స్త్రీ వాచకం
సమాధానం: నారి
- అయిదులు
సమాధానం: లులులులులు
- తార
సమాధానం: రిక్క
- ఇదే వరుస
సమాధానం: వరుస
- ఒక జలపాతం
సమాధానం: డుడుమ
- సర్ సి. ఆర్. రెడ్డి ఇంటి పేరు
సమాధానం: పద్మప్రభస
- ఒక అప్సరస
సమాధానం: తిలోత్తమ
- సంస్కృతంలో అబద్ధం చెప్పకు
సమాధానం: సత్యంవద
- వర్ణం
సమాధానం: రంగు
- లేనివాళ్ళు
సమాధానం: రిక్తులు
- జోడి
సమాధానం: దుగ
- ఇందులో కార్మికులు పనిచేస్తారు
సమాధానం: గని