[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- నాకు జూతో చెలగాటమా? ఎంత వాటం.
సమాధానం: నాజూకు
- ఆ జోరు ఈవూరు.
సమాధానం: ఆవడి
- సరస్వతి మహల్ లైబ్రరీలో దొరకవచ్చు.
సమాధానం: దండకవిలె
- చెట్టు వెళ్ళడం.
సమాధానం: పోక
- 21 అయితే వెళ్ళకు.
సమాధానం: గోకు
- భ్రమించు మరలు
సమాధానం: తిరుగు
- చింతలకు ముందు పుట్టేయా
సమాధానం: చీకులు
- షష్ఠి (60, LX)
సమాధానం: పదార్లు
- బ్రతుకు, బ్రతికేచోటు.
సమాధానం: మనికి
- ఇదెంత ఐదా?
సమాధానం: కష్టమా
- ఉదాహరణకు నర్మద.
సమాధానం: నది
- సంగీత సాంకేతికం.
సమాధానం: మిత్ర
- పి. ఆర్. కాలేజీలోని ఊరు.
సమాధానం: పిఠాపురము
- కన్నం వేసిన పాతనాణెం.
సమాధానం: కాలణా
- దంచినమ్మక బొక్కిందే –
సమాధానం: దక్కడు
నిలువు
- పులి ఆడదు, ఆడిస్తుంది.
సమాధానం: జూదం
- తయారు చేస్తా చొక్కాయి
సమాధానం: కుడతా
- ఆనన
సమాధానం: ఆవిరి
- ఇల్లా (లేక అల్లా)
సమాధానం: వలె
- ఆడు పక్షి
సమాధానం: కపోతి
- చెట్లకి, బండి చక్రాలకి ఉత్తరాలు
సమాధానం: ఆకులు
- తమిళనాయకుడు(అతని ఉచ్చారణలో)
సమాధానం: కరుణానిది
- ఎప్పుడని తురకసాయిబునా ఆడగటం
సమాధానం: గోకులాష్టమి
- నిగమాంత శర్మ
సమాధానం: వేదాన్తి
- చెయ్యడానికి నీవీ, నావి
సమాధానం: మనవి
- కవిత్వానికి, పైత్యానికి
సమాధానం: మాత్రలు
- పోలీసు స్టేషనుకాదు పాడటానికి
సమాధానం: ఆఠాణా
- ఇది తీరడానికి 11 అడ్డు
సమాధానం: దురద
- దీన్ని ఆమ్రేడిస్తే మూగడానికి అనుకరణ
సమాధానం: పిల
- జల – మేఘం
సమాధానం: ముక్క