[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- సంజ్ఞ ఇంటికన్న పదిలం
సమాధానం: గుడి
- తి కలిస్తే ఆజ్ఞ
సమాధానం: ఆన
- బియ్యపు గింజకు రక్షణా కవచం
సమాధానం: వడ్లగింజ
- ఒక భూతం
సమాధానం: కరువలి
- వ్యవసాయి వేసేది (తలక్రిందులు)
సమాధానం: డగూ
- వృక్ష విశేషం
సమాధానం: తమాలం
- దూర్వాసుడు
సమాధానం: కోపి
- పిల్లలకి ఏడుపు
సమాధానం: బలం
- సూత్రధారిణి
సమాధానం: నటి
- మూడో విష్ణువు
సమాధానం: కిటి
- ఎగురుతుందె కాని పక్షి కాదు
సమాధానం: ఈగ
- వినబడుతుంది గాని కనబడదు
సమాధానం: వాణి
- ఉదాహరణకి ఊదా
సమాధానం: రంగు
- మహి జననీ జనని
సమాధానం: మాతా
- ఇంగ్లండులో తేనెటీగ
సమాధానం: హనీబీ
- ఇది పానగల్లు పార్కులోనే దొరుకుతుంది
సమాధానం: నగ
- ఋషుల నిష్ఠ
సమాధానం: సంయమనం
- దాశరథి
సమాధానం: సీతాపతి
- కొందరు దీన్ని 16గా మార్చగలరు
సమాధానం: నంది
- ఒక కాలమానం
సమాధానం: జాము
నిలువు
- కృష్ణపక్షి?
సమాధానం: గుడ్లగూబ
- అడిగింది అది లేక
సమాధానం: డిగిం
- ఇంతకు రెండింతలు
సమాధానం: ఆరు
- ఒక సంఖ్య
సమాధానం: నవకోటి
- గారె వేడిగా ఉంది
సమాధానం: వడ
- ఒకటి, రెండూ
సమాధానం: జత
- 30 ఉత్తరానికి చివర
సమాధానం: కలం
- కొన్ని భాషలకి లేదు
సమాధానం: లిపి
- కీర్తనమౌను, మనికి నర్తనమౌను (కృష్ణశాస్త్రి)
సమాధానం: మాట
- సిరిమావో?
సమాధానం: లంకిణి
- 25 రం.
సమాధానం: నగరం
- కిటికీ
సమాధానం: వాతాయనం
- నల్లవాడి తిరుగుబాటు
సమాధానం: గ్రోనీ
- ఒక ఉపకరణము
సమాధానం: గునపము
- ఉభయపక్షాలు కలిస్తే
సమాధానం: మాసం
- వాపోయిన వాహనం
సమాధానం: హనం
- క్రీ.పూ.
సమాధానం: బీసీ
- ప్రకారంలో అభ్యుదయం
సమాధానం: గతి
- మనది మధ్యాక్కర లేని మనస్సు
సమాధానం: మది
- చూడు 7
సమాధానం: తాజా