[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- కోతి?
సమాధానం: ఆవుతోక
- అసమగ్రాంధ్ర సాహిత్య చరిత్రంలో ఆరుద్ర దూడ
సమాధానం: దస్తగిరి
- సంక్రాంతి సందేశం
సమాధానం: డుబుడుక్కులు
- స్! తగ్గు! నవ్వు
సమాధానం: స్మితం
- శ్రీపాద వారి భారతం (పొడి అక్షరాలు)
సమాధానం: కృభా
- తామరసాక్షి
సమాధానం: కంజాక్షి
- లక్ష్మి
సమాధానం: వైష్ణవి
- మానవ విపరిణామం. అరణ్యమా?
సమాధానం: వనమా
- బాకీకి వేధించే చెట్టు
సమాధానం: తరువు
- మిశ్రం ప్రాణ గొడ్డం
సమాధానం: సమాసం
- రాజుల సరదా
సమాధానం: పోలో
- ముక్కాలు తెగిన ఉపశాఖ
సమాధానం: రివ
- రఘువంశం (రామాయణంకాదు)
సమాధానం: కాకుత్సవంశం
- ప్రహేళికకు విరుగుడు?
సమాధానం: నిఘంటువు
- పెట్టేది ఇదే!
సమాధానం: తికమక
నిలువు
- తరుచుకాదు
సమాధానం: ఆకస్మికం
- చేమిరి
సమాధానం: తోడు
- ఆకాశవాణి చెప్పేది
సమాధానం: కబుర్లు
- దంచినమ్మకు బుక్కిందే …
సమాధానం: దక్కును
- కాపు మాసిన పుస్తకాలు
సమాధానం: స్తలు
- తిరిగింది వెన్నెల రేయి
సమాధానం: రివభావి
- ఎక్కడ బృహదీశ్వరుడు? ఎక్కడి సరస్వతీ మహలు?
సమాధానం: తంజావూరులో
- నటీమణినదికి ప్రమాదం
సమాధానం: కృష్ణకుమారి
- వేదాల్లో ఒక చెట్టు
సమాధానం: పనస
- ఉపనిషన్మధువు లొలికిన చోటు
సమాధానం: తపోవని
- శతపత్ర పత్రం
సమాధానం: సంవర్తిక
- జింక
సమాధానం: రంకువు
- ఉజ్జయినీ ఆక్క
సమాధానం: అవంతి
- పాముదయితే జాగ్రత్త!
సమాధానం: కాటు
- డౌటేహం అన్నాడు భ.కా.రా.
సమాధానం: శంక