[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- నీటిలో పుట్టిన పువ్వు
సమాధానం: వారిజాతం
- ఈ చిలక నిజంగా చిలకకాదు
సమాధానం: సీతాకోక
- ఈ దోసకాయకి జిత్తులు తెలియవు
సమాధానం: నక్క
- ఈ వారం ఏడిటిలో ఒకటి
సమాధానం: బుధ
- పొడుగులుకావు, ఒడ్డులు కలది
సమాధానం: తటిని
- పంచుకోవడంలో భాగం
సమాధానం: పాలు
- ఈ చిలక నిజంగా చిలకే
సమాధానం: రామ
- అర్హుడు కాడు
సమాధానం: తగడు
- నీవీ, నావీ
సమాధానం: మనవి
- అర్జునుడు
సమాధానం: కవ్వడి
- ఒకజాతి పక్షి
సమాధానం: కరడు
- కాబట్టి అరణ్యం
సమాధానం: కాన
- భార్య
సమాధానం: దార
- ఒక వటవృక్షంలో పెద్దకొమ్మ
సమాధానం: కవట
- మద్దెలతో మొర పెట్టింది
సమాధానం: రోలు
- లక్షలో, సేరులో ఒకభాగం
సమాధానం: సవా
- నల్లి
సమాధానం: రక్తపాలు
- కోనేరు
సమాధానం: పుష్కరిణి
నిలువు
- పాముకాని పాము
సమాధానం: వానపాము
- ముఖ్యమైనవి 27
సమాధానం: రిక్కలు
- తీగవాద్యం
సమాధానం: తంబురా
- అమ్మనాయనే!
సమాధానం: తాత
- పది మిల్లియన్లు
సమాధానం: కోటి
- పాండవుల్లో సహదేవుడు
సమాధానం: కనిష్ఠుడు
- నరం కొలిమితిత్తి
సమాధానం: ధమని
- కొలమానం, సగమానిక
సమాధానం: తవ్వ
- సరిహద్దు
సమాధానం: గడి
- యంత్రం తిరగబడ్డ లక్ష్మీ
సమాధానం: మర
- కాళ్ళకి పని చెప్పు
సమాధానం: నడు
- చప్పుడు నములుతున్నప్పుడు
సమాధానం: కరకర
- ఉక్కు ఫ్యాక్టరీ ఉంది
సమాధానం: బొకారో
- పేదవాళ్ళ పాయసం
సమాధానం: తరవాణి
- కాలం
సమాధానం: నలుపు
- సినీదర్శకుడు, విష్ణుభక్తుడు
సమాధానం: దాసరి
- ఇతడేమీ నోరులేనివాడుకాడు
సమాధానం: వక్త
- ఇది కట్టాలని ఎవరూ కోరరు
సమాధానం: టపా