సెప్టెంబర్ 2018

ఇటాలియన్ ఆపెరాలను తెలుగు యక్షగానాలుగా పునఃరచించే బృహత్ప్రయత్నంలో తిరుమల కృష్ణదేశికాచార్యుల రెండవ రచన ప్రచ్ఛన్న పరిణయము. ఇల్ మాత్రిమోనియో సెగ్రెతో (రహస్య వివాహం) అన్న పేరుతో ఈ ఆపెరా మొదటిసారి 1792లో వియెన్నాలో ప్రదర్శింపబడినప్పటినుంచీ ఇప్పటికీ ప్రేక్షకాభిమానాన్ని చూరగొంటూనే ఉంది. ఒక ఆంగ్లనాటకాన్ని ఆధారంగా చేసుకొని జొవాన్ని బెర్తాతి రచించిన ఈ రూపకాన్ని ప్రముఖ సంగీత కర్త దొమీనికో చిమరోసా స్వరబద్ధం చేశాడు. ఆయన స్వరబద్ధం చేసిన ఎనభైకి పైగా రూపకాలలో ఇది అత్యంత ప్రాచుర్యం పొంది, ఇప్పటికీ కాలానుగుణంగా భిన్న సాంస్కృతిక నేపథ్యాలకు అన్వయించబడి ప్రదర్శించబడుతోంది; ఈ సంచికలో నలుగురు రచయితలు మొట్టమొదటిసారిగా వారి కథలు కవితలు ఈమాట పాఠకులకు అందిస్తున్నారు. ఈమాట తరఫున వారికి హార్దికస్వాగతం; కె. రాణి పాడిన కొన్ని అపురూపమైన పాటలను శబ్దతరంగాలలో సమర్పిస్తున్నారు పరుచూరి శ్రీనివాస్; వినూత్నమైన కథలు, కవితలు, విశేష పాఠకాదరణకు నోచుకున్న గడి, తదితర రచనలతో ఈ సంచిక మీకోసం…

ఈ సంచికలో:

  • కథలు: శోకము: ఒక పరిశీలన – పూర్ణిమ తమ్మిరెడ్డి; వైకుంఠపాళి – టి. శ్రావణి; కాకిబొడ్డు – చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు; ఏ మతమూ నీదంటే… – ఆర్. శర్మ దంతుర్తి; మూడు షరతులు – అనిల్ అట్లూరి; బేతాళ కథలు: కథన కుతూహలం–4 – టి. చంద్రశేఖర రెడ్డి.
  • కవితలు: ప్రేమల కథలు – తఃతః; ద్వివిధ – విజయ్ కోగంటి; ఆమె నా దేవత సొంత ఊరు – శ్రీరామ్; నిశ్శబ్దాన్ని దాటుకొని – అనూరాధ నాదెళ్ళ; కాళీ పదములు 2 – పాలపర్తి ఇంద్రాణి; నాగరీకుడు – అవినేని భాస్కర్ (మురుగన్); తెల్లవారుఝాము మరణం – వరాళి.
  • ఇతరములు: శ్యామలా దండకపు ఛందస్సు – జెజ్జాల కృష్ణ మోహన రావు; తూరుపు గాలులు (సమీక్ష) – దాసరి అమరేంద్ర; నాకు నచ్చిన పద్యం: మారన వరూధిని కామన – చీమలమర్రి బృందావనరావు; ప్రచ్ఛన్నపరిణయము (యక్షగానము) – తిరుమల కృష్ణదేశికాచార్యులు; కె. రాణి పాడిన కొన్ని పాటలు (శబ్ద తరంగాలు) – పరుచూరి శ్రీనివాస్; గడి నుడి 23 – కొల్లూరు కోటేశ్వరరావు.