ఫిబ్రవరి 2018

భారతీయ చిత్రకళ ఆధునికతా స్వరూపాన్ని మార్చిన వ్యక్తిగా, భిన్న సంస్కృతులు కలిసిన అనుభవంతో తనదే అయిన పంథా పాటించిన అసమాన కళాకారిణిగా, ఒక స్వేచ్ఛాజీవిగా, ఇండియన్ ఫ్రిదా కాలో అని అభివర్ణింపబడిన అమృత షెర్-గిల్ (1913-41) చిత్రకళాభిమానులకు చిరపరిచితమే. యూరోపియన్ ఆధునిక పద్ధతులతో, గొగేన్, మొదిల్యాని తదితరుల ప్రభావంలో పారిస్ కళావాతావరణంలో మెరుగులు దిద్దుకున్న అమృత చిత్రకళ ఆపైన అజంతా, ఎల్లోరా కుడ్యచిత్రాలు, మొఘలాయి మినియేచర్లు, దాక్షిణాత్య చిత్రశిల్పాలు, ఫ్రెస్కోలు, తదితర దేశీయ చిత్రకళలను లోతుగా ఆకళింపు చేసుకుని తనదయిన ఒక వినూత్న పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటికి ప్రాభవంలో ఉన్న బెంగాల్ ఆర్ట్ స్కూల్ నీటిరంగు పద్ధతులను విమర్శించింది. భారతీయ సమాజాన్ని అత్యంత సమర్థంగా తైలవర్ణాలలో ప్రదర్శించింది. ఒక సుడిగాలిలా భారతీయ చిత్రకళాలోకంలో ప్రభంజనం సృష్టించి, మూడుపదుల వయసు కూడా రాకుండానే మాయమైపోయినా, అమృత చూపించిన దారి మాత్రం అజరామరమై నిలిచింది. జనవరి 30 అమృత షెర్-గిల్ జన్మదినం. ఆ సందర్భంగా ఈ సంచికలో అమృత స్వీయచిత్రాల గురించి ఆర్ట్ హిస్టోరియన్ రాఖీ బలరామ్ విశ్లేషణ; తల్లావఝ్జుల శివాజీ అమృతస్మృతివచనం; ఈ సంచిక నుండీ ఆర్టిస్ట్ అన్వర్ ‘బొమ్మల పాఠాలు దిద్దుకునే’ తనకు తాను చెప్పుకునే సిలబస్ గురించి మనకూ చెప్తున్నారు; శబ్దతరంగాలలో సంజీవదేవ్, మో రేడియో ప్రసంగాలు అందిస్తున్నారు పరుచూరి శ్రీనివాస్; ఇంకా, గడి, కథలు, కవితలు…


ఈ సంచికలో:

  • కథలు: కీడెంచు – కన్నెగంటి చంద్ర; నీళ్ళ బయ్యం – మాధవ్ కందాళై; బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ – పూడూరి రాజిరెడ్డి (స్వగతం); పది రోజులు – అవినేని భాస్కర్ (ఎ. ముత్తులింగం).
  • కవితలు: నిర్నిమిత్తం – మమత; లోలోపలగా – విజయ్ కోగంటి; మాట్లాడుకుంటాం సరే – బండ్లమూడి స్వాతికుమారి.
  • వ్యాసాలు: అమృత షెర్-గిల్: ఆకృతి చిత్రాలలో ఆత్మాన్వేషణ – రాఖీ బలరామ్; అమృతం-అనన్యం – శివాజీ తల్లావఝ్జల; సృజనాత్మక సాహిత్యంపై విమర్శ ఎలా ఉండాలి? – విహారి; సిలబస్: 1. రేఖాయాత్ర.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: పౌలస్త్యుని అంతరంగం – చీమలమర్రి బృందావనరావు; గడి-నుడి 16 – త్రివిక్రమ్; శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక.
  • శబ్దతరంగాలు: సంజీవదేవ్, మో రేడియో ప్రసంగాలు – సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.