[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- బాల్, పాల్, లాల్ త్రయంలో ప్రథముడు
సమాధానం: బాలగంగాధరతిలక్
- గోముఖ వ్యాఘ్రం కూడా అందంగానే ఆరంభమౌతుంది
సమాధానం: గోము
- కట్టనూ, విప్పనూ సమూహం
సమాధానం: జట్టు
- ఆత్రేయ నాన్న
సమాధానం: అత్రి
- భుజించి
సమాధానం: తిని
- అహం
సమాధానం: నేనే
- తిరగేసి తీస్తే డొంకంతా కదుల్తుంది
సమాధానం: గతీ
- వెళ్ళరు (యుద్ధానికా?)
సమాధానం: పోరు
- తెనాలి రాముని వర్ణన
సమాధానం: వాత
- ఒక వృత్త విశేషం
సమాధానం: పంచచామరం
- ఆఖరికి ప్రవహించునది
సమాధానం: నది
- నూ x N
సమాధానం: నూలు
- ఫాషన్
సమాధానం: వాడి
- దూరం
సమాధానం: దవ్వు
- రుచులూ, విరోధులు
సమాధానం: ఆరు
- పత్రవనం, ధారావ్రతం దీనితోనే ప్రారంభం
సమాధానం: అసి
- ఒక జలచరం
సమాధానం: చేప
- రాయి, సాని దీనితోనే ప్రారంభం
సమాధానం: నాప
- ప్రబంధానికి ముఖ్య లక్షణం
సమాధానం: అష్టాదశవర్ణనలు
నిలువు
- తృవ్వట
సమాధానం: బాబా
- ఒక పుణ్యతీర్థం
సమాధానం: గంగోత్రి
- గ్రహం
సమాధానం: గాము
- బెంగాలీనవలలో కథానాయిక
సమాధానం: రజని
- ఒక రకం కవిత్వం. తెలుగు వారి ప్రత్యేకత
సమాధానం: తిట్టు
- తల కాచుకోవాలంటే దీనికి పెత్తనం ఇవ్వవద్దు
సమాధానం: పేనే
- 12 అడ్డుతో చహరా
సమాధానం: అతీ
- అలివేలు మంగాపురం
సమాధానం: తిరుచానూరు
- మొనగాడు (అల్లికలో కాబోలు)
సమాధానం: నేత
- — ప్రభువు ఒక కవి
సమాధానం: గట్టు
- పరక (ఎనిమిదో వంతు)
సమాధానం: పోచ
- ఏడు రోజులు
సమాధానం: వారం
- పన్నీరు మెచ్చనిది
సమాధానం: పంది
- రెండవ (సమాసంలో)
సమాధానం: మలు
- ఇక్కడున్న వాటిలో ఇదొకటి
సమాధానం: గడి
- హసించు
సమాధానం: నవ్వు
- ప్రసిద్ధి (తేడా కూడా)
సమాధానం: వాసి
- ఇది చెయ్యడం, రావడం, పోవడం
సమాధానం: దయ
- ఇడుమ
సమాధానం: ఆపద
- పార్వతికి మరో పేరు
సమాధానం: అపర్ణ
- కార్యమా? వాలకమా?
సమాధానం: చేష్టా
- 18 అడ్డు- దాటడానికి
సమాధానం: నావ
- 8 నిలువుకు బహువచనం
సమాధానం: పేలు