మే 2018

తెలుగులో లలిత సంగీత సృష్టికర్త, గాయకుడు, రచయిత, గేయనాటక సంగీత రూపకకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రేడియో జేజిమామయ్య బాలాంత్రపు రజనీకాంతరావుగారి గురించి క్లుప్తంగా చెప్పడం అసంభవం. రజనిగా పదిమందీ పిలుచుకునే ఆయన పూర్ణాయుర్దాయం తర్వాత కాలధర్మం చెందటం సహజమే అయినా ఒక తరం ముగిసిపోయిందన్న బాధ కూడా కలగకమానదు. ఈ సందర్భంలో, ఈమాటలోని ఆయన రచనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. చలంతో రజని ముఖాముఖీ; బాలల సంగీత రూపకం కొండనుంచి కడలి దాకా; తెలుగులో మేఘసందేశం ఆడియో రూపకం; పరుచూరి శ్రీనివాస్ సమగ్ర పరిచయ వ్యాసం తెలుగు లలిత సంగీతంలో రజనీ గంధం; కొడవటిగంటి రోహిణీప్రసాద్ రాసిన 88 ఏళ్ళ యువకులు; కొత్తగా ఈ సంచికలో, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు సంపాదకీయంలో వెలువడిన ప్రసారతరంగిణి రేడియో కార్యక్రమాలపై వ్యాస సంకలనం నుంచి రెండు వ్యాసాలు; రజనితో అనుబంధం గురించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పంచుకున్న ముచ్చట్లు; ఎన్నో వివరాలు విశేషాలతో నిండిన రజని రేడియో ఇంటర్‌వ్యూ; ఒక అరుదైన ఆంగ్ల సంగీతరూపకం, ఎ థిమాటిక్ మ్యూజిక్ పీస్ ఆదికావ్యావతరణం – ది బర్త్ ఆఫ్ ఆన్ ఎపిక్; రజని బహుముఖ ప్రజ్ఞను స్థాలీపులాకన్యాయంగానైనా పాఠకులకు పరిచయం చేస్తాయని ఆశిస్తున్నాం. ఇవే కాక, కథలు, కవితలు, సమీక్షలు…


ఈ సంచికలో:

  • కథలు: అహం బ్రహ్మాస్మి – చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు; ప్రారంభం – అవినేని భాస్కర్ (ఎ.ముత్తులింగం); ఇళ్ళవీధి – టి. చంద్రశేఖర రెడ్డి.
  • కవితలు: నా కుంచె రంగులు – సాంఘిక; కొంచెంగానైనా మనలా… – విజయ్ కోగంటి; పంతం – మానస చామర్తి.
  • వ్యాసాలు: తెలుగు సాహిత్య విమర్శ:ఒక చూపు – మృణాళిని; సంగీత నాటకాలు – బాలాంత్రపు రజనీకాంతరావు; వాద్య బృంద సంగీత రచనలు–సంగీత విషయాలను గురించిన ప్రసంగాలు – బాలాంత్రపు రజనీకాంతరావు
  • ఇతరములు: కథా ఉత్సవాలు పన్నెండు – దాసరి అమరేంద్ర; ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు – శ్రీకాంత్ గడ్డిపాటి; రజనీకాంతరావు ప్రభావం నాపై చాలా ఉంది: బాలమురళీకృష్ణ జ్ఞాపకాలు – వార్త దినపత్రిక; వేలూరి వారి కథల పుస్తకం – అన్వర్; నాకు నచ్చిన పద్యం: పెనుగొండ స్మృతికావ్యం – చీమలమర్రి బృందావనరావు; సిలబస్: 3. సమ్మర్ క్లాస్ – అన్వర్; గడి-నుడి 19 – త్రివిక్రమ్.
  • శబ్దతరంగాలు: రజనితో రేడియో ఇంటర్‌వ్యూ; ఆదికావ్యావతరణం; అన్నమాచార్య సంకీర్తనల రాగాల విశిష్టత – పరుచూరి శ్రీనివాస్.