[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- కాబట్టి ఎటు చూసినా…
సమాధానం: కనక
- హిందీలో ప్రజలు
సమాధానం: లోక్
- చూడు 4 నిలువు
సమాధానం: ఇచట
- సగం ఇవతల తల తిరిగిన తీగ
సమాధానం: లత
- సినిమాలో తిరుగు టపా, రేడియోలో కూడా
సమాధానం: పాట
- రామకృష్ణ పరమ ఇది.
సమాధానం: హంస
- అయిదుగురిలో ఆఖరిది. ఎనమండుగురిలో మొదటిది.
సమాధానం: రుక్మిణి
- వాళ్ళయొక్క నీళ్ళు
సమాధానం: వారి
- కుంకుమ ఉంచే నక్షత్రం.
సమాధానం: భరణి
- రెండో ఊపిరి
సమాధానం: నిశ్వాసం
- ఆహ్వానపత్రిక నిన్నేమంటుంది?
సమాధానం: ర
- శూన్యం ఒక ఇంగ్లీషు అచ్చు.
సమాధానం: ఓ
- అరసున్న చేర్చితే అంగీకారం
సమాధానం: ఔ
- మంగళగిరిలో దొరికేదా?
సమాధానం: పానకం
- సంస్కృతంలో అంటారు ఈ పుకారు
సమాధానం: వదంతి
- ఎవరేలుతున్నా లోపల దొరికేది చీకటే.
సమాధానం: రేలు
- ఖరీదైన లోహం.
సమాధానం: కదాని
- ఒకటీ, అయిదు సున్నలు.
సమాధానం: లక్ష
- భూమి ఖరీదు
సమాధానం: ధర
- పోలేని పోతన స్వకీయం.
సమాధానం: తన
- ఆలోచన చాలాదూరం
సమాధానం: యోజనం
- ఇంగ్లీషు నాటక ప్రారంభంలో ఎవరికీ గెలుపు లేదు.
సమాధానం: డ్రా
- లోనికి చూస్తే కొనగలుగు వారికి దొరుకుతాయి.
సమాధానం: నగలు
నిలువు
- నారద భోజనం
సమాధానం: కలహం
- ఈవారు ధనవంతులు
సమాధానం: కల
- నిలువైనా అడ్డమైనా ఈ చోటనే.
సమాధానం: ఇట
- జిత్తులమారి
సమాధానం: టక్కరి
- 22 నిలువుకు పర్యాయపదం
సమాధానం: తరుణి
- ఒక సూత్రకారుడు
సమాధానం: పాణిని
- 3తో కలసి మన పార్లమెంటు
సమాధానం: సభ
- వామనుడి సంతకం ప్రారంభాలే ఇల్లు
సమాధానం: వాసం
- నాలుక నరస మార్పు
సమాధానం: రసన
- పులి
సమాధానం: శ్వాసదం
- నిత్యబహువచనం బేబీకి అవసరం.
సమాధానం: పాలు
- రోడ్డు మరమత్తు
సమాధానం: కంకర
- స్త్రీ
సమాధానం: వనిత
- తైలానికి మూలం.
సమాధానం: తిల
- ఉదాహరణకు ఆకాశవాణి
సమాధానం: రేడియో
- నిమిషాని కరవై
సమాధానం: క్షణాలు
- ఇది రూపాయల రూపంలోనే ఉండక్కరలేదు.
సమాధానం: ధనం
- అబ్జాక్షి మేను ఆననాకార రహితం.
సమాధానం: నన