గడి నుడి – 18

గడినుడి 17కు ఈసారి గడువు తేదీలోపు ఇద్దరు మాత్రమే సరైన సమాధానాలు పంపించారు.
  1. సుభద్ర
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి
సరిచూపు సహాయంతో నింపిన మొదటి ముగ్గురు: 1. కార్తిక్ చంద్ర పివిఎస్ 2. కోమలి గోటేటి 3. జివిఎస్ఎస్ మార్కండేయులు. వీరందరికీ మా అభినందనలు. గడి నుడి – 17 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఎప్రిల్ 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే, లేకుంటే ముగింపు తేదీ దాటగానే, గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన మొదటి ఐదుగురినుంచి సరి అయిన సమాధానాలు రాగానే సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు పంపే వీలు ఉండదు.
గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. పొద్దున్న విప్పే కథ (3)
  2. అప్పుడప్పుడు రాసే ఒక స్వల్పమైన రచన (3)
  3. భవిష్యత్తుని సూచించే అందగత్తె (3)
  4. ప్రతి సూర్యోదయం మధ్యలో జరిగే పుట్టుక (3)
  5. గచ్చకాయతో పిల్లలు ఆడుకుంటారు (5)
  6. నారి గతకల్లో పడితే సంస్కృతి (5)
  7. జిగట బంక (3)
  8. బాబాలు పుట్టించేది కాబోలు (3)
  9. తునాతునకలు (5)
  10. మన రోము గతి తప్పడం అభివృద్ధికి వ్యతిరేకం (6)
  11. తలలేని ఎగసిపాటు నిద్రాదేవికి ఆహ్వానం పలుకుతుంది (4)
  12. తలలేని పట్నంకి వచ్చే రోగం (3)
  13. భాగవతములో పోతే పోయిన ఆలోచన (3)
  14. కంటికి పెట్టుకునే నాసికా దర్పణము (4)
  15. కక్ష-పాపముల విచిత్ర కలయికతో అధికారంలో ఉన్నకూటమి (6)
  16. కాటుకపిట్ట (5)
  17. చావూ-బతుకుల మధ్య పూగులాడే ప్రమాదకరమైన రోగం మొదలు (3)
  18. ఎండకు పట్టేది కాబోలు (3)
  19. మొగలి పుష్పదళము విచ్చుకుంది (5)
  20. దాసీసుతుల ఏర్పాటుతో బయటపడ్డ గోస్వామి (5)
  21. అదృష్టం మధ్యలో తుదిలేని గుహ కలిస్తే సరసుడౌతాడు (3)
  22. ముడి లో చిట్టచివర చేరిస్తే నిర్బంధం (3)
  23. నేరం మోపబడినవాడికి తిరిగి అవకాశం యిద్దాము (3)
  24. ఇది చాలించడం అంటే చావు (3)

నిలువు

  1. పొడిగా మాకు అప్పుడప్పుడు ఇచ్చినా సరే పీల్చి పారేసేది (3)
  2. నక్షత్రం మధ్యలో దుష్టుడు ప్రవేశిస్తే మణి ఉద్భవిస్తుంది (5)
  3. గుర్రపు నడక విశేషం (3)
  4. కంటిచూపుతో చంపేసే దేముడు (6)
  5. గొప్ప సంస్కర్త మధ్య ప్రవేశిస్తే శని (3)
  6. పశువుల నీళ్ళతొట్టిలో కడవ మొదట ముంచితే దోషము (5)
  7. తిక్కన ఆరంభంతో కావ్యం మధ్యలో చేరితే అంతరాయము అవుతుంది (5)
  8. స్వస్థత చేకూరిన కవి ముక్కు (3)
  9. అనుభవం తిక్క కుదిరిస్తే ఇల్లు కనిపిస్తుంది (3)
  10. ఓదార్పు చెప్పు అందము (5)
  11. అంతులేని రచ్చతో రెండో పెళ్ళాం వంటిల్లు పూర్తయ్యింది (4)
  12. కోయబడ్డ దొంగసొమ్ము (3)
  13. మూడడుగుల జంతువు (3)
  14. పాము తలకు పుట్టే నాగవల్లీదళం (5)
  15. పాము ఎత్తేది తిరగబడితే గుమ్మం ఎదురవుతుంది (3)
  16. చక్కనిది తెలివిలేనిది? (4)
  17. భార్య షికారు కథ ముందు వాక్కు (3)
  18. జీయర్లు సదా ధరించేది? (3)
  19. కవ్వానికి పనిచెప్పింది ఇక్కడే (6)
  20. రామమ్మ గుడి బద్దలుకొడితే కూష్మాండం (5)
  21. పాదరసములో కలిసిన 3మొదలు ఉల్లిగడ్డ (5)
  22. క్లుప్తంగా ఉదాహరణకి సీతలో 3చివర చేరితే ఉపేక్ష (5)
  23. సంకెల నగ (3)
  24. బంగారుబొమ్మ (3)
  25. అశ్వాలంకరణ విశేషం (3)
  26. ఇది సులభం (3)