కడు జాగ్రత్తగా దాచుకుంటావు, ఉదయం నుంచీ ఒక పూవుని
ఒక రహదారి పక్కగా ఈ నగరంలో ఒక ఆశ్చర్యంలా ఎదురుపడిన
నీకు పేరు కూడా తెలియని ఆ పూవుని. ఉంచుకుంటావు మరి
దానిని పదిలంగా, చలికి వేసుకున్న కోటు మాటుననీ హృదయానికి దగ్గరగా, ఆప్తంగా, తనకి ఇద్దామనీ మరెన్నో
చెబుదామనీ, చెప్పుకుందామనీ. అందుకే, ఇక సాయంత్రంఆ ఉద్యానవనంలో రాలతాయి తన కనురెప్పలు అశ్రువులతో
అచ్చంగా గాలి లేక వడలి, నీ అరచేయి తాకగానే
కోటులోనే విడివడి రాలిపోయిన పూరేకుల వలె-
(03-12-2012)