ఈమాట జనవరి 2013 వెల్చేరు నారాయణ రావు విశేష సంచికకు స్వాగతం!

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!


వెల్చేరు నారాయణ రావు
జననం: ఫిబ్రవరి 1, ప్రతి ఏడు కొత్తగా.

వెల్చేరు నారాయణ రావు ఈమాటకి ఆప్తుడు, ఆత్మీయుడు, అంతకంటే ముందు మామంచి నేస్తం. పుస్తకాలు చదువుకోడమన్నా, అందరితో కలిసి కూర్చుని వాటి కబుర్లు చెప్పుకోడమన్నా ఆయనకు గొప్ప సరదా. కానీ అదే సరదా ఇలా ఎనభయ్యో వడిలో పడిపోడంలో చూపిస్తాడని మేం అనుకున్నామా! ఎనభై ఏళ్ళ ఈ సాహిత్యపు రాలుగాయి తెలుగు సారస్వతానికి ఏం చేశాడో, చేస్తున్నాడో స్థాలీపులాక న్యాయంగా మీకు రుచి చూపిద్దామని పది మెతుకులు (ఒకటి చాలదు గదా మరి!) పట్టుకొచ్చేసరికి ఏడాది పడుతుందని మాకు తట్టలేదు. ఆయన మాకోసం పెరగకుండా ఆగనూ లేదు. అందుకే, కాస్త ఆలస్యంగా అయినా అంతే ఆప్యాయంగా నారాయణ రావు విశేష సంచికగా ఈ ఈమాటను అందిస్తున్నాం. ఈయన లాంటి వాడు ఇప్పటి దాకా లేడు, ఇంకొకడు వస్తాడనే నమ్మకమూ లేదు. అందుకే తప్పని సరై అడగడం, “వీఎన్నారూ, వయసు మీద వేసుకోడం మీరు కాస్త ఆపుతారూ?” అని. వింటే ఎంత బాగుణ్ణు.


“The number of citizens capable of reading and understanding the texts and documents of the classical era … will very soon approach a statistical zero. India is about to become the only major world culture whose literary patrimony, and indeed history, are in the custodianship of scholars outside the country: in Berkeley, Chicago, and New York, Oxford, Paris, and Vienna. This would not be healthy either for India or for the rest of the world that cares about India.”

-Sheldon Pollock (‘Crisis in Classics‘, 2011.)


పరుచూరి శ్రీనివాస్‌కి పదివేల నూటపదహారు; పప్పు నాగరాజుకి ఐదువేల నూటపదహారు; భైరవభట్ల కామేశ్వరరావుకి వెయ్యి నూటపదహారు; సురేశ్ కొలిచాలకు ఉత్తి నూటపదహారు – కృతజ్ఞతలు, ప్రత్యేకంగా!

ఈ సంచికలో

  • కథలు: పులివేట – శారద; కొత్తమలుపు – గౌరీ కృపానందన్; జీబ్రా క్రాసింగ్ దగ్గర ఒక మనిషి – కొల్లూరి సోమశంకర్.
  • కవితలు: అయినా సరే – బండి సత్యనారాయణ; తుఫాను ముగిసింది – వైదేహీ శశిధర్; నీటి ఊహ – హెచ్చార్కె; వాన ముసురు – పాలపర్తి ఇంద్రాణి; జన్మజన్మల స్పృహ – డా. గరిమెళ్ళ నారాయణ; వంశీ వనము (హాలుని గాథాసప్తశతి అనువాద శతకం) – జెజ్జాల కృష్ణ మోహన రావు.
  • వ్యాసాలు: God on the hill, Goddess on the plains and the space in between: Tirupati, South India – Joyce Flueckiger; ఘంటసాల గొంతులో జీవించిన కరుణశ్రీ పద్యాలు – విష్ణుభొట్ల లక్ష్మన్న; గాడ్ ఆన్ ది హిల్ -టెంపుల్ పోయమ్స్ ఆఫ్ తిరుపతి: ఒక మెచ్చుకోలు – సాయి బ్రహ్మానందం గొర్తి; Kavali brothers and the origin of modern historiography in India – Rama Sundari Mantena; వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం – కె. వి. ఎస్. రామారావు.
  • విశేష వ్యాసాలు: వలస పాలన, సంస్కృతి – నారాయణ రావు గారి ఆలోచనలు కొన్ని – వకుళాభరణం రాజగోపాల్; నారాయణ రావు భావ విప్లవం – కె. వి. ఎస్. రామారావు; Narayana Rao, my guide – Phyllis Granoff; మై యంగ్ ఫ్రెండ్ నారాయణ రావ్ – సంజయ్ సుబ్రహ్మణ్యం; Narayana Rao on the recorded text and received text – Charles Halissey; నారాయణ రావు విప్లవాత్మకత – డేవిడ్ షూల్మన్; Velcheru Narayana Rao, our guide and mentor – Gautham Reddy, Jamal Jones, Ilanit Sacham, Harshita Kamat; నారాయణ రావు మార్గదర్శక పరిశోధనా పద్ధతి – ఫిలిప్ వాగనర్; తెలుగు సాహిత్యావగాహన, నారాయణ రావు వేరు బాట – వేలూరి వేంకటేశ్వర రావు.
  • అనువాద వ్యాసాలు: భారతీయ చరిత్రరచన: శైలీలక్షణం ఉపోద్ఘాతం – పప్పు నాగరాజు; భారతీయ చరిత్రరచన: శైలీలక్షణం ఉపసంహారం – భైరవభట్ల కామేశ్వర రావు; సార్ధకప్రతీకలు: ముందుమాట – శంఖవరం పాణిని; ఇతిహాసాలు, ఆదర్శాలు: ఆరు జానపద వీరగాథలు – మాధవ్ మాౘవరం; వేంకటంలో కొండలరాయడు – సురేశ్ కొలిచాల.
  • తృప్తి: కథ నచ్చిన కారణం – మాధవ్ మాౘవరం; నాకు నచ్చిన పద్యం: ఊయలూగే అమ్మాయిలు – చీమలమర్రి బృందావనరావు; అంబఖండి నుంచి అట్లాంటా దాకా – వేలూరి వేంకటేశ్వర రావు