ప్రపంచ తెలుగు ప్రజలకు అభివందనం!
జనవరి 5-7 తేదీలలో, ఒంగోలు పట్టణంలో రాంకీ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహోత్సవానికి మీకందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాం.
తెలుగు మహోత్సవం
అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటూ తెలుగు సాహిత్య, భాషా పరిరక్షణకు కూడా తన వంతు పనిచేస్తున్న రాంకీ ఫౌండేషన్ మొదటిసారిగా ప్రపపంచ తెలుగు మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెలుగుసీమలోనే నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలకు ఒంగోలు పి.వి. ఆర్. పురపాలక ఉన్నత పాఠశాలలోని ఎఱ్ఱాప్రగడ ప్రాంగణం వేదిక. జనవరి 5, 6, 7 తేదీలలో మూడు రోజుల పాటూ ఈ మహోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి తెలుగు ప్రముఖులు పాల్గొంటున్న వేడుక ఇది. ఈ ఉత్సవం తెలుగు ఆటలకు, కళలకు కూడా పండుగ. ప్రపంచ తెలుగు మహోత్సవంలో కేవలం భాషా ఔద్ధత్య నిరూపణం మాత్రమే కాదు, తెలుగు నేల నలుచెరగులా వ్యాప్తిలో ఉన్న జానపద కళా రూపాలకు, గ్రామీణ సాంప్రదాయ క్రీడలకు కూడా చోటు దక్కుతోంది.
తెలుగు మహోత్సవానికి ఆహ్వాన పత్రిక.
సకుటుంబ సమేతంగా మీరు విచ్చేసి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము.
ఇట్లు
రాంకీ ఫౌండేషన్
హైదరాబాద్.