అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర

పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్న అలనాటి ఊర్మిళాదేవి నిద్ర పాట ఇది. ఈ పాట 1930లలో రికార్డు చేయబడిందని, ఈ పాట పాడింది శ్రీమతి డి. సుబ్బులు అనే గాయని అని మాత్రమే, అదీ ఆ రికార్డు లేబుల్ మీద ఉన్న వివరణ ద్వారా మనకు తెలిసిన సమాచారం. ఇంతకు మించి ఈమె గురించి ఇంకేమీ తెలియకుండా పోవడం విచారించాల్సిన విషయం. 78rpm రికార్డుపై పట్టడం కోసం ఈ పాట సంక్షిప్తంగా పాడబడింది, కేవలం ఆరు నిమిషాల నిడివిలో.

ఈ అపురూపమైన ఆడియో అందించినందుకు పరుచూరి శ్రీనివాస్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ గాయని వివరాలు మీకేమైనా తెలిస్తే మాతో పంచుకోమని మనవి – సం.


పైన పేర్కొన్న రికార్డు వచ్చిన కాలంలోనే విడుదలైన ఇంకో రికార్డు నుండి ‘కస్తూరి రంగ రంగా’ పాటను కూడా ఇక్కడ అందిస్తున్నాం. ఈ పాట కూడా ఊర్మిళనిద్ర పాట నడచిన నడకలోనే ఉండడం గమనించవచ్చు.