తొలి నవల పాఠకుల ఆదరణ దృష్ట్యా విజయవంతమైనా, ఆ తర్వాత విమర్శకులు కత్తిగట్టడంతో 19వ శతాబ్ది రచయిత్రుల జాబితానుంచి పక్కకి తొలగిన రచయిత్రి ఎలిజబెత్ గాస్కెల్. విమర్శకులు కత్తిగట్టడానికి కారణమేమిటి? ‘మగవాడిలా కార్మికులు, పేదల గురించి రాయడానికి ప్రయత్నించడం, పారిశ్రామిక విప్లవం ఫలితాలను చర్చించడం!’

అరబ్బీ, పారసీక కవిత్వములో ముఖ్యమైన ప్రక్రియలు నాలుగు: అవి గజల్, ఖసీదా, మస్నవీ, రుబాయి. చాలమందికి గజల్, రుబాయీలు పరిచయమే. వీటిలో ఒక పాదమును మిస్రా అంటారు; రెండు పాదములను శేర్ అంటారు. రెండు శేర్‌లు ఒక రుబాయీ. అనగా రుబాయీ ఒక చతుష్పది. అరబ్ భాషలో అర్బా అంటే నాలుగు అని అర్థము.

వేస్డ్‌ లాండ్‌లో ఏ గొంతు ఎవరిది అని అడుగడుగునా అడుగుతూ చదవాలి. మరి ఆ మొదటి మాటలు ఎవరివి? ఎనిమిదో పాదంలో మరీ అనే ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ మరీయే, మొదటి ఏడు పాదాల నాందీ పద్యం కూడా చదివిందనుకోవాలా? అలా అనిపించదు. మరి, ఎవరి మాటలు?

ఈ కవితను ఎలా చదవాలి? అడగవలసిన ప్రశ్న: ఎలా చదవకూడదు? ఇది చదవకూడని కవిత. సరిగమలు చదివితే సంగీతమవుతుందా? వేస్ట్‌ లాండ్‍ లోని పదాల, పదార్థాల స్వరాలకు సంగీతరచన చేసుకొని, చెవులు మూసుకొని వినాలి. అర్థం చేసుకోవలసినది కూడా కాదు.

నెలీ పాత్రికేయవృత్తిలో ఉన్నందువల్లనేమో, శైలి చాలా పఠనీయంగా, సంభాషణలు పటిష్టంగా ఉంటాయి. ఉద్వేగభరితమైన శైలి నవలకు అందాన్నిస్తుంది. ఒక్క నెలలో రాసేసిన ఈ నవల బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన ‘ఖూన్ భరీ మాంగ్’ నుంచి ‘సాత్ ఖూన్ మాఫ్’ వరకు, ఎన్నో సినిమాలకు ప్రొటోటైపా అన్నట్టుంటుంది.

ఒకటి నుండి 26 అక్షరముల వఱకు 184217726 వృత్తములు సాధ్యము. అందులో కొన్ని వృత్తములకు ఒకే గణము పదేపదే వచ్చునట్లు అమరికలు ఉంటాయి. అన్ని మ-గణములతో విద్యున్మాల, య-గణములతో భుజంగప్రయాతము, ర-గణములతో స్రగ్విణి, స-గణములతో దుర్మిల, తగణములతో పద్మనాభ, జ-గణములతో మౌక్తికదామ, భ-గణములతో మానిని, నగణములతో చంద్రమాల వంటి వృత్తములు ఉన్నాయి.

ఆమె దృష్టిలో తను పెళ్ళికి, పిల్లల్ని పెంచడానికీ పుట్టిన స్త్రీ కాదు. తనకు ఇంకా ఏదో కావాలి. అదేమిటో ఆమెకీ తెలీదు. భర్తను వివాహం చేసుకున్నపుడు అతనితో ప్రేమగానే ఉంది. కానీ అది తన కర్తవ్యంలో భాగం. అందులో ఎలాంటి ఉద్వేగం లేదు. తన సంచలనం ఆమెకు అర్థం కాకపోయినా తనలో ఏదో మార్పు వచ్చిందని గ్రహిస్తుంది.

ఈమాటలో అక్టోబర్ 2017 సంచికలో, సి. ఎస్. రావ్ కవి తిలక్‍పై రాసిన వ్యాసం గ్రంథచౌర్యానికి లోనయింది. యోగి వేమన విశ్వవిద్యాలయం తరపున తిలక్ శతజయంతి సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన పత్రాల సంకలనం తిలక్ సాహిత్యం – సందేశంలో, ఎస్. పి. యూసుఫ్, ఎం. సి. జె. అన్న రచయిత ఈమాటలో వచ్చిన వ్యాసాన్ని కొన్ని మార్పుచేర్పులు చేసి ప్రకటించారు.

నేనూ, నాది, నాకు అనే నా రోజువారి ప్రతిబింబాల నుండి ఒక్కసారిగా ఈ మాటలు నన్ను కాలం వెనక్కి తీసుకెళ్ళి సుడిగాలిలో చిక్కి అంతర్ధానమైన జ్యోతింద్రనాథ్ వంటి అవ్యవసాయకులను పరిచయం చేసుకోవడం, వారి చేతుల్లో మొహన్ని దాచుకోవడం, వాటిని ముద్దాడుకోవడం చేస్తాయి. దేశం కోసమని, మన కాళ్ళ మీద మనం నిలబడి చూపాలని ప్రయత్నించి – అప్పులతో, నష్టాలతో సర్వనాశనంతోనూ మిగిలిన మనుష్యులు ఎంతమందో!

సంతోష సన్నివేశములకు, త్వరితగతిని సూచించుటకు, ప్రాసానుప్రాసలను ఉపయోగించి గానయోగ్యముగా నుండు వృత్తములలో మానిని, కవిరాజవిరాజితములు అత్యుత్తమ శ్రేణికి చెందినవి. నేను కొన్ని సంవత్సరములుగా పరిశోధించి కనుగొన్న విశేషమేమంటే, తాళవృత్తములను మాత్రాగణములకు తగినట్లు పదములను ఎన్నుకొని వ్రాసినప్పుడు అవి గానయోగ్యముగా నుండి ఛందస్సు సంగీత సాహిత్యముల రెండు ముఖములని తెలుపుతుంది.

కొన్ని నవలలు చదివీ చదివగానే అర్థమై, ఉదాత్తంగా, ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని నవలలను నిశితంగా చదివి, పొరలు విప్పుకుంటూ పోతే తప్ప, వాటిలోని పస అర్థం కాదు. ఈ నవల రెండో కోవకు చెందింది. నవలలో కథ గొప్పదేమీ కాదు. ఒకరకంగా ఒక బలహీనుడు, విధి ఎలా లాక్కుపోతే అలా వెళ్ళే యువకుడి కథ.

పాదములోని మాత్రల విఱుపు, పదముల విఱుపు పద్యములకు ఒక క్రొత్త విధమైన అందమైన అద్భుతమైన నడకను ప్రసాదిస్తుంది. లేకపోతే పద్యమనే చట్రములో పదాడంబరముతో వచనమును వ్రాసినట్లు ఉంటుంది. ఛందస్సు శారదాదేవి రెండు స్వరూపములైన సంగీత సాహిత్యములకు ప్రతీక. సంగీతము లేని సాహిత్యము బధిరత్వమే, సాహిత్యము లేని సంగీతము అంధత్వమే. అప్పుడే ఛందస్సు పాత్ర సార్థకమవుతుంది.

మాద్రిద్ విశ్వవిద్యాలయంలో ఆమె పేరిట ఒక పీఠం ఏర్పడడం ఎంతో అరుదుగా స్త్రీలకు లభించే గౌరవం. అయితే, మేధావులకోసం స్థాపించిన స్పానిష్ రాయల్ అకాడెమీలో తనకు స్థానం లభించాలన్న ఆమె ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఆ అకాడెమీ కేవలం మగవాళ్ళకేనని తేల్చి చెప్పారు పండితులు!

అయితే రంగారావుగారికంటే ముందు ఇలాంటి విశ్లేషకులు లేరా? ఇకముందు రారా? ఏమిటీ ఆయన గొప్పతనం? అంటే – ఆయనకు ముందు ఇలాంటి వారున్నారేమో తెలీదు కాని, ఆయనంత నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిస్పక్షపాతంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేవారు మాత్రం లేరు.

స్తన్యాన్ని వదిలి ఆహారాన్ని కోరే మూడు నోళ్ళు. సమాజం పట్ల ప్రతిస్పందనలతో మార్గదర్శకత్వం కోసం ఆరాటపడే మూడు జతల కళ్ళు. జంటగా మోయవలసిన భారం ఒంటరి భుజాలపై పడింది. అప్పుడు ఆమెది జీవితంతో పోరాటం. వాస్తవమైన పని ఆరంభమయింది. ఆహారం ఇచ్చింది. ఆలోచనలు ఇచ్చింది. ఉన్నంతలో ఆనందాన్ని పంచటం మప్పింది.

చాలా సందర్భాలలో, మీరు చూడకూడదనుకున్నదాన్ని అంతర్జాలం ఏదో విధంగా మీకు చూపిస్తుంది. మీరు ఈ రోజు వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ, దానికి ముందు, బలవంతంగా మీకు కెన్యాలో జరిగిన మారణహోమం గురించి ఒక కథనం చూపించబడుతుంది. మనకు సహజంగా వ్యతిరేకత పట్ల ఉండే ఒగ్గు వల్ల, మన దృష్టిని ఆకర్షించాలని కోరుకునేవాళ్ళు చెడువార్తలనే సృష్టిస్తారు.

కన్నడ తెలుగు భాషలు గురు లఘువుల భావమును సంస్కృత ప్రాకృత ఛందస్సులనుండి గ్రహించినది. రెండు, మూడు, నాలుగు గురువుల ప్రస్తారమువలన దేశి ఛందస్సులోని గణములను గ్రహించుకొన్నవి. వీటి అసలు పేరులు రతి, మదన, బాణ లేక శర గణములు.

జేన్‌లో ఉన్న ప్రధానమైన గుణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా, తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్నీ కోల్పోకపోవడం. ఎంత గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళతోనైనా తన మనసులో మాట నిక్కచ్చిగా చెప్పడం. మనసుతో కంటే బుద్ధితో జీవించే గుణం. అందుకే ఈమె ఆ కాలం నాటి కథానాయికల కంటే భిన్నంగా ఉంటుంది.

మధ్యాన్నం అయ్యేసరికి సూర్యుని ప్రతాపం పెరిగిపోయింది. ఎండ తీక్షణమయింది. వేడి భరించడం కష్టమయింది. మనం వర్ణచిత్రాలలో చూసే ఎడారిలోని ఒంటెల బిడారుల్లో ఈ తీక్షణత గోచరించదు. చిత్రకారుల తూలికలకు అందని అసౌకర్యమది. జీవశక్తిని పీల్చేసే ఆ ఎండల మండిపాటును ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప ఆ అసౌకర్యాలు మనకు బోధపడవు.

శాస్త్రిగారు మాకు బంధువు, చుట్టం అని మా మేనమామ పిలకా రామకృష్ణారావు పదే పదే నాకు గుర్తు చేస్తూ వుండేవాడు. అయినా నేను ఎప్పుడూ కలవడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు. నేను విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి కోర్టులో ఆయన్ని చూసేను. మరి నేనేమి ఆశించేనో గాని, ఆయన వాదన ఆరోజు నాకు నచ్చలేదు.