మంచి పద్యం రాయగలవాడు మంచి గద్యం కూడా రాయగలడని, టి.ఎస్.ఎలియట్ అన్నాడు. మంచి కవి రాసిన పద్యానికీ గద్యానికీ మధ్య భేదం లేదంటాను నేను. వామనుడనే ప్రాచీన ఆలంకారికుడు కూడ ‘గద్య రచన కవికి గీటురాయి అనదగు’ అనే అర్థం వచ్చేట్లు సంస్కృతంలో చెప్పాడు.
శీర్షికలు వ్యాసాలు
అప్పటికి జనవ్యవహారంలోనే తెలుగు భాష ఉంది. అక్కడక్కడ శాసనాలలో మాత్రమే సాహిత్య(ఛందస్సు) స్పర్శ ఉంది. ఆ దశలో మహాభారతం వంటి గ్రంథాన్ని ఆంధ్రీకరించడానికి అవసరమైన ఛందస్సాహిత్యాలను సమకూర్చుకొనవలసి వచ్చింది నన్నయకు నారాయణభట్టు సహకారమూ లభించింది. సఫలుడయ్యాడు నన్నయ్య, ఇప్పటికీ ఆ బాట ఆంధ్ర సాహిత్యంలో అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది.
డాలీ జూమ్ షాట్ పద్ధతిలో ప్రధాన వస్తువు నుంచీ జూమ్ అవుట్(Zoom out) అవుతూ దృశ్యీకరించడానికి అనువైన పద్యం ఇది. త్రివిక్రముడిని స్థిరంగా ఉంచి, సూర్యబింబాన్ని ప్రధాన వస్తువుగా తీసుకుని, జూమ్ అవుట్ చేస్తూ పోతే – పెద్ద ఛత్రంగా వున్న సూర్యబింబం, క్రమక్రమంగా క్రిందకు దిగుతూ శిరోరత్నం, చెవి పోగు, కంఠాభరణం…చివరగా పాద పీఠం అవుతుంది.
సైనికదళాల్లోని వృత్తి వాతావరణాన్ని గురించిగానీ, యూనిఫారం ధరించిన వారి జీవన విధానాల గురించిగానీ ప్రజాబాహుళ్యంలో తెలిసింది చాలా తక్కువ కావడం వల్లనే ఇటువంటి కొన్ని అపోహలు చలామణీ అవుతున్నాయి.
కానీ ఒక్కసారి కృష్ణశాస్త్రి కవిత్వంలోనికి గాని మనం తొంగి చూసినట్లయితే అది నిత్యనవీనమని ఆ కవిత్వం నిత్యవసంతమని ఆ పువ్వులు ఎప్పటికీ వాడవని ఆ కవిత్వాన్ని మనం సమీపించకపోవడం ఒక్కటే మనం ఆ కవిత్వం తాలూకు వెలుగుకి దూరం కావడానికి కారణమని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక్కసారి ఆ కవిత్వాన్ని పునఃపరిశీలించడం ద్వారా, ఆ కవిత్వాన్ని చేరడం ద్వారా, ఆ కవిత్వానికి కైమోడ్చడం ద్వారా మనం మరొకసారి ఆ మహాకవికి నివాళిని అర్పించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఈ వ్యాససమర్పణ.
“ప్రకృతి సూత్రాలన్నీ దేవుని ఆలోచనలే (The laws of nature are the thoughts of God)” – Orsted
తెలుగు రచయితలు చలం, గోపీచంద్‌వంటివారు క్రమేపి ఆధ్యాత్మికత వైపు, ఆశ్రమజీవనం వైపు వెళ్లారు. కానీ వారి ఆధ్యాత్మిక రచనలు వివాదాస్పదం కాలేదు. అయితే భైరప్పలో వచ్చిన మార్పు ఆధ్యాత్మికమైనది కాదు, మతపరమైనది కాదు, రాజకీయపరమైనది; చారిత్రక వాస్తవికతను అర్థం చేసుకోవడంలో వచ్చిన మౌలిక మార్పు. ‘ఆవరణ’ నవల దీనికి స్పష్టమైన ఉదాహరణ.
‘మనిషైతే మనసుంటే, కనులు కరగాలిరా! కరిగి, కరుణ కురియాలిరా! కురిసి, జగతి నిండాలిరా!’ అన్న మానవతావాదం ఆ కలానిది. ‘వాడ వాడల వాడే! జాడలన్నిట వాడే! ఇంటి ముంగిట వాడే! ఇంటింటిలో వాడే!’ అని దైవాన్ని అన్నిచోట్లా చూస్తూ ‘అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది’ అని విశదీకరించింది ఆ కలమే.
నాకు తెలిసేనాటికే ఆయన కవిత్వంలో సువర్ణమేరుశిఖరాన్ని అధిరోహించి, యుగనేతగా గౌరవపదాన్ని అలంకరించినవారు. అప్పటికే గొంతు మూగపోయింది. రవీంద్రుని 1927లో కలుసుకొన్ననాటి అనుభూతులను పదేపదే నెమరువేసుకొనేవారు. కాళిదాసు, భవభూతి, షెల్లీ, కీట్సు, బైరన్, తమ తండ్రి పినతండ్రులు, రాయప్రోలు, అబ్బూరి అంటే ఉపాసనతో కూడిన ఆరాధనాభావం ఉండేది.
ఇవన్నీ నన్నయ్యకన్న ముందు ఆవిర్భవించినవే. ఇక మిగిలినది చమత్కార మొక్కటే. అది తెలుగువారికి దక్కింది. ‘చమత్కారచంద్రిక ద్వారా విశ్వేశ్వరుడు దానిని సాధించి మనముందు నిలిపాడు. పరిణామక్రమంలో ప్రకృతవ్యాసంలో మనం అలంకారశాస్త్రానికి తమదైన వరివస్యను అందించిన తెలుగువారి గురించి-తెలుగువారి గ్రంథాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆచార్యులవద్ద విద్యనేర్వడం స్వాతంత్ర్యానికిభంగం అందువల్ల నాకు యేవిద్యావద్దు అని అనడం అనర్థహేతువు. అజ్ఞానాపాదకం గనుక అది స్వాతంత్ర్యం గాదు.
కృష్ణశాస్త్రి కవిత్వంలో ప్రధానంగా కనిపించే భావధారలు రెండే. మాధుర్యం, దుఃఖం.
ఆ విధంగా అతడి దాంపత్యజీవితం అపహాస్యం పాలై, దుఃఖాంతమయింది. ఆమె దూరం కావడం పిరాండెలోకు జీవితకాలమంతా దుర్భరమైంది. ఆమె జ్ఞాపకాలను దూరంచేసుకోవడానికి, అతడు ఆ ఊరు కూడా వదిలి మరో చోటికి కదిలిపోయాడు.
స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాం.
పర్వ రాసిన అనుభవం నాలో ఒక కొత్తభావాన్ని కలిగించింది. నాకొక కొత్త జన్మనిచ్చింది. మన అనేక విశ్వాసాలకు మూలం రూఢే, పరంపరే, సంప్రదాయమే. వీటన్నిటిని వదిలి జీవితం చివరిలోని చావు దృష్టితో జీవితాన్ని చూస్తే కొత్త అవగాహన, జ్ఞానం పుట్టవచ్చు అనే భావం పెరిగింది.
ఇది మహాభారతాన్ని మరోసారి తమ మాటల్లో, ఆధునిక వచన రూపంలో, చెప్పడం కాదు. మహాభారతంలోని ఎన్నో సమస్యలకు హేతుబద్ధంగా సమాధానాలను వెదికి, సృజనాత్మకంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే ప్రయత్నం ఇది. మహాభారతంలోని పౌరాణిక కల్పన (మిథ్)ను వాస్తవాన్ని విడదీసి, ఆనాటి సామాజిక స్వరూపాన్ని మన కళ్ళముందు పునర్నిర్మించిన విద్వత్ ప్రయత్నం ఇది.
ఈ పద్యంలో భావాన్ని భారతీయతకు మరింత దగ్గరగా తేవాలంటే. “స్వర్గం” బదులు “కైలాసం” అనవచ్చు. మంచుకొండపై నేర్చిన నర్తకుడు కదా నటరాజు! ఈ పద్యంలో భావమేమిటి? అభద్రతలో స్వేచ్ఛ ఉంది. ఆనందం ఉంది. శివుని భిక్షాపాత్ర ఆహార అభద్రతకు ప్రతీక. జారుడు మంచుకొండపై నటరాజు నృత్యం, జీవితంలో అభద్రత అంతర్భాగమని సంకేతిస్తుంది. రిక్తభిక్షాపాత్రలో స్వేచ్ఛ ఉంది. జారుడుమంచుపై నృత్యంలో ఆనందం ఉంది. రవీంద్రభారతిరంగస్థలంపై దొరకని ఆనందం.
భైరప్పగారి వ్యక్తిగత అభిప్రాయాలను తీవ్రంగా విమర్శించేవారు కూడా ఆయన సృజన శక్తిని, విషయాలను లోతుగా పరిశీలించే ప్రామాణికతను, పాత్రలను విశ్లేషణాత్మకంగా చూచే విధానాన్ని కాదనలేరు. చెప్పదలచుకున్న దాన్ని ప్రామాణికంగా చెప్పే గుణం ఆయనది.
భిత్తి ఆత్మ చరిత్ర కష్టాలలో కడతేరిన వ్యక్తి సంకల్ప సిద్ధిని నిరూపిస్తుంది. “ఒక రచయితకు కలిగిన కష్టాలు ఆయనను ఒక మహోన్నత రచయితగా రూపొందించడంలో ఎంతగానో సహకరించాయి” అన్న విషయాన్ని నిరూపిస్తుంది. భిత్తి ఆత్మ కథనంగా మాత్రమే కాక అపురూపమైన కథనంతో కూడిన నవలగా అనిపిస్తుంది.
మహాభారతం అంటే దాయాదుల యుద్ధం, రాజ్యాధికారం కోసం జరిగిన యుద్ధం అనుకొంటారు. కాని, హేతుబద్ధమైన ఆలోచనలతో ఈ నవల రాసి, కొన్ని ఊహించని సత్యాల్ని వెలికి తీశారు. ఆయన వెలికి తీసిన ఎన్నో సత్యాల్లో… ప్రధానమైన ‘స్త్రీల మానసిక క్షోభ. ఆనాడు స్త్రీలు మౌనంగా ఎంతటి దుఃఖాన్ని దిగమింగుకున్నారు.