‘ఉ’ పోతే, ఉద్భటుడంత వాడుత్తుత్తి భటుడవుతాడు. ఉపచారి పచారీ కొట్లో గుమస్తాగా చేరతాడు. మనకిక ఉగాదులూ ఉషస్సులూ ఉండవు. ఉపమానం, ఉత్ప్రేక్షలూ మాయమై, మొత్తం కవిత్వం సున్న అవుతుంది. ఉదారం దారంగా మిగులుతుంది.

వంగపండు పాటంటే వెంటనే గుర్తొచ్చేది “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా”పాట.

ఈ పాటలో “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా!” అని అడుగుతాడు కవి. ఎక్కడికీ? అంటే “శ్రీకాకుళంలో సీమకొండకి” అంటాడు. అపుడు ఎందుకూ? అనే ప్రశ్న వస్తుంది. “సిలకలు కత్తులు దులపరిస్తయట” అని అక్కడ జరుతున్న పోరాటాలను సింబాలిక్‌గా చెపుతాడు. శ్రీకాకుళ గిరిజన రైతుల పోరాట నేపధ్యంలో మంచి నిర్వహణ దక్షతతో రాసిన ఈ పాట తెలుగు ప్రజలను ఉత్తేజితులను చేసింది, ఉర్రుతలూగించింది.

ఈ విధంగా ఉర్దూ/హిందీ ప్రణయ భావార్ద్ర కవితలను అనువదించడం వల్ల, స్వతంత్రంగా తెలుగులో అభ్యుదయ కవులకు లేని అవకాశాన్ని పూరించుకోవడమే కాదు, ఈ కవిమల్లుడు తన కడప కత్తికి రెండువైపులా పదునేనని తన కలాన్ని కదను తొక్కించారు.

కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి: తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు: ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని; చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడని.

ఈ పుస్తకంమీద దాదాపు 9 సంవత్సరాలు పని చేశాను. దాదాపు 900 మందిని కలిసిన తరువాతే ఈ పుస్తకం బయటకు వచ్చింది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా చేసిన వందలాది గంటల ఇంటర్వ్యూలు, సామూహిక చర్చలు, ఊరికే చెప్పుకొన్న కబుర్లు, ప్రణాళికాబద్ధమైన ప్రశ్నావళి – వీటన్నిటి ఫలితమే ఈ పుస్తకం.

కావ్య సాహిత్యం నుంచి ప్రబంధ సాహిత్యం వరకు, కాలక్రమేణా తెలుగు భాష అభివృద్ధి చెందే క్రమంలో కవులు కావ్యాలలో దృశ్యీకరణలకు ప్రాధాన్యతను పెంచుకుంటూ వచ్చారు. ఆదికవి నన్నయ మహాభారతం నుంచి ప్రబంధ కవి పింగళి సూరన కళాపూర్ణోదయం వరకూ, ఆ పిదప వచ్చిన కావ్యాలను గమనిస్తే ‘కథలను చెప్పే ధోరణి నుంచి, కథలను చూపించే పద్ధతి’ని కవులు ఆచరించారనిపిస్తుంది.

విస్తార గ్రహాంతర నక్షత్రాంతర ప్రాంతాలను ఇకపై విశ్వంలోని పనికిరాని ఖాళీ ప్రదేశాలుగా పరిగణించలేము; సృష్టికర్త వాటిని తన చిహ్నమైన ఏ వస్తువుతోనూ నింపలేదని అనుకోలేము. ఆ ప్రాంతాలన్నీ ఒక అద్భుతమైన మాధ్యమంతో (medium) నిండి ఉన్నాయి. జ్యేష్టానక్షత్రంలో (dog-star) ఓ అణువు కంపిస్తే, ఆ కంపనాలని ఈ మాధ్యమం తనలో మూడేళ్ళపాటు ఉంచుకొని వాటినన్నిటినీ క్రమం తప్పకుండా భూమ్మీద స్పెక్ట్రోస్కోప్‌కి చేరవేస్తుంది.

సంగ సాహిత్యం మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది –- కాలం మారినా, మనిషి హృదయం మారదు. దాని సంవేదనలు మారవు. ప్రేమ, బాధ, ధైర్యం, దయ, కరుణ – ఇవన్నీ శాశ్వతమైనవి. ఈ కారణంగానే, రెండువేల ఏళ్ల తరువాత కూడా, సంగ కవిత్వం మనల్ని కదిలిస్తుంది.

జీవితంలో నిజానిజాలుగాని, తప్పొప్పులుగాని ఋజువు చేయగలిగినవి కావు. ప్రేమ ఎప్పుడు ప్రేమ, ఎప్పుడు హింస కూడా ఋజువుకాదు. అంతేకాదు, ఋజువు చేయవలసినవి కూడా కావు. అనుమానపిశాచాలను తరిమేసి, స్వార్ధం కొంత మానుకుని బతకడం సరైన మార్గం.

నా కవిత్వం, ముఖ్యంగా ‘ఆకాశం’ మొదలుపెట్టి, నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం – జీవితాన్నీ, మనుషుల్నీ, నన్నూ ప్రేమించటానికి, మరింత లోతుగా గ్రహించటానికి. చాలాసార్లు జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం కూడా.

అయితే అందరూ తెలుగే మాట్లాడుతారు. ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవటానికి డిక్ష్నరీలు మోసుకెళ్ళక్కర లేదు. ఉచ్చారణకి ప్రమాణాలు వుండటం మంచిదేననుకోండి. కానీ అది కొండని తవ్వి ఎలుకను పట్టేటయితే, శుద్దదండగ.

ఖగోళం కచ్చితమైన శాస్త్రం. ప్రసంగవశాత్తుగానీ ఉద్దేశపూర్వకంగాగానీ కొన్ని ఖగోళవిషయాలను ప్రస్తావించినపుడు, లేదా నమోదు చేసినపుడు, ఆ ఖగోళవిషయాలు ఎప్పుడు జరిగేవన్నది, ఎక్కడ జరిగేవన్నది కచ్చితంగా కాలంలో వెనక్కి వెళ్ళి నిర్ణయించవచ్చు.

పూజ్యులైన డి.వి.గుండప్పగారి ఈ గ్రంథము ’మంకుతిమ్మని మిణుకు’ అనే ఆంధ్రానువాదానికి మూలమైన ’మంకుతిమ్మన కగ్గ’కు రెండవభాగము. ఈ రెండవ భాగం ప్రకటమైనది 1984లో, డి.వి.జి గారు గతించిన తొమ్మిది సంవత్సరాల తరువాత.

పదిహేనవ శతాబ్దంలోని పోతనకు కెమెరాల గురించి, డ్రోనుల గురించి తెలిసే అవకాశంలేదు. కానీ తన ఊహలను కవిత్వంలోకి తర్జుమా చేసేటప్పుడు, చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న వివరాన్ని పద్యంలో ఇమిడ్చి, కవిగా తాను ఏమి భావనలు చేసాడో ఆ భావనలు పాఠక/శ్రోతల మనోనేత్రం ముందు సాక్షాత్కరించేలా పద్యాలను నిర్మించాడు. కవికి చెప్పదలచుకున్న అంశం ఎంత ముఖ్యమో, ఎలా చెప్పాలన్నది కూడా అంతే ముఖ్యం. అప్పుడే కావ్య ప్రయోజనం సిద్ధిస్తుంది.

ఇవన్నీ తెలిసిన పదాలే, తెలిసిన అర్థాలే. కానీ వాటిని సంయోజనం చేయడంలోనే ఉంది కవి ప్రత్యేకత. తెలిసిన పదాల సంయోజనంలోనే మాంత్రికత ఉంది. ఈ పదాల సంయోజనంలోనుండి చాలా శక్తిని తీసుకురావడం ప్రతిభావంతుడైన కవి చేయగలడు. అటువంటి అరుదైన కవి రవిశంకర్.

ప్రపంచ నలుమూలలకూ వెలుగునిచ్చిందీ, అనేక పరిశ్రమలకు ఆయువుపట్టు అయినదీ, ఆవిరి యంత్రాలతోనో మహాజలపాతాలతోనో ఘనమైన చక్రాలను తిప్పి పుట్టించే విద్యుత్తే. ఆ పుట్టుకకి ఆధారం ఫారడే కనుగొన్న డైనమో.

ఆ యిద్దరిలో ఒకరికి అదృష్టవశాత్తు మతిపోయింది, మరొకరు శాయశక్తులా ఆ పిచ్చిని కాపాడుతున్నారు. ఎవరికి పిచ్చి, ఆ పిచ్చిని పోషిస్తున్నది ఎవరు అని మాత్రం చెప్పడం దుస్సాధ్యం.

తెలుగులో ప్రథమాంధ్రకవి నన్నయ నుంచి ఆధునిక భావకవి కృష్ణశాస్త్రి వరకు, ఒక పాత్ర ఔన్నత్యాన్ని వర్ణించటంలో ఒకే కవిసమయాన్ని తమదైన శైలిలో ఎంత వైవిధ్యంగా ప్రయోగించారో చూపించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.

భారత కథలో దైవాంశ సంభూతులైన వీరులు, అక్కడక్కడ అవతార పురుషులు, దేవతలు కనబడినట్లే ఇలియాడ్, ఓడిస్సీలలో కూడా మానవులు, దేవతలు కలగాపులగంగా కనబడతారు. భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే ఇలియాడ్‌లో ట్రోయ్ యుద్ధం పది సంవత్సరాలపాటు జరుగుతుంది. ట్రోయ్ యుద్ధం ముగిసిన తరువాత ఆ యుద్ధంలో పోరాడి, బ్రతికి బయటపడిన ఒక వీరుడు ఇంటికి తిరుగుముఖం పట్టినప్పుడు, మరొక పదేళ్లపాటు కష్టాలు పడుతూ చేసిన సాహసయాత్రలోని భయంకరమైన అనుభవాలే ఓడిస్సీలోని కథ.

తెలుగు భావకవిత్వరచనకు కృష్ణశాస్త్రిగారు ఆద్యులు కాకపోయినా అగ్రగణ్యులుగా సాహితీ లోకం గుర్తించింది. ఆయన భావనైశిత్యం, ఆయన కవితోహల లాలిత్యం, మృదుమధురమైన శబ్దసౌందర్యం ఆయన కవితారచన లోని విలక్షణతలుగా భావించవచ్చు.