నీ తొలి తలపుల జాడలలో
మాయని వలపుల చాయలివి
ఏ నడలో ఏ ఎడలో!
తీయని ఆ కధలేవి ప్రియా?
శీర్షికలు సంచికలు
గతంలో ఎన్నో క్లిష్టమయిన కేసులు నేను గెలిచాననీ సులోచనకి తెలుసు. సులోచన ఎవర్నీ నాకు సిఫార్సు చెయ్యదు.
ఈ సంచికలో:
- ‘కథ నచ్చిన కారణం’ కొత్త శీర్షిక ప్రారంభం. పాల్గొనమని మా పాఠకులకు ఆహ్వానం.
- విన్నకోట రవిశంకర్ కవిత్వ పరిశీలన, నాటికి నేడు రేడియో నాటిక, దేశికాచారి, వైదేహి శశిధర్, పాలపర్తి ఇంద్రాణి తదితరుల కవితలు. జెజ్జాల కృష్ణ మోహనరావు తిరుక్కుఱళ్ అనువాదం కామవేదం. ఇంకా…
తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితాసంకలనం పై రా.రా. సమీక్ష (సంవేదన, జనవరి 1969) సారస్వత వివేచన – రా.రా. వ్యాస సంకలనం నుండి పునర్ముద్రణ.
రా.రా. ‘తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు’ శీర్షికతో దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ మీద వ్రాసిన సమీక్ష వారి స్థాయికి, వారి రీతికి తగినట్లుగా లేకపోవటం ఆశ్చర్యం వేస్తుంది.
కవి తిలక్‌పై ఆలిండియా రేడియో సమర్పించిన ఈ సంగీత, సాహిత్య చర్చా రూపకం తిలక్ గురించి లోతైన పరిచయం చేస్తుంది. ఈ రూపకం ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం.
అసలు ప్రహేలిక అంటే అర్థమేమిటి? అని అడిగాము వాళ్ళమ్మను. ప్రహేలిక అంటే సంస్కృతంలో నటన లేక నాటకానికి సంబంధించిన అర్థమట. ఏమో కానీ, నాకు పాత తెలుగు పత్రికల్లో ఎక్కడో, గళ్ళనుడికట్టుకు పదబంధప్రహేలిక అని పేరు చదివినట్లు గుర్తు.
లోతుతెలీని లోయలాంటి
ఒంటరితనంలో,
రాలిపడుతున్న
ఉసిరిచెట్టు ఆకుల మధ్య-
“అమ్మా నీకు ఇంకా యాభై ఏళ్ళు రాలేదు. నాన్న పోయినప్పటినుంచీ నువ్వు ఒక్కత్తివే ఉంటున్నావు కదా? నా పెళ్ళి అయితే నువ్వొక్కత్తివీ ఎలా? నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదూ? ఏమిటి నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్పు?
భయదమతంగజంబులటు వార్షుకమేఘము లంబరంబునం
బయికొనియుండఁ, దారలు క్షపాకరుడుం గనరాకయుండఁగా
మొల్ల అంటే మల్లెపూవు. కవయిత్రి మొల్ల రామాయణాన్ని తలచుకోగానే మనసుకు ఒక కమ్మని పూతావి సోకినట్లుంటుంది. ఆమె తన భక్తినీ, కవితాశక్తినీ కలబోసి క్లుప్తంగా ఓ మనోహరమైన రాయాయణాన్ని తెలుగు భాషకు దయచేసింది.
నిన్ను నువ్వు నిరంతరం
తడుపుకుని
కప్పుకుని ముద్దై
అంతలోనే విప్పారి
మేను విరిచి
నువ్వేస్తున్న బొమ్మల్లో
రూపాంతరం చెంది
ఆనవాలు పట్టలేని అదృశ్య చిత్రాన్ని
తిలక్ రాసిన ‘గోరువంకలు’ ఛందోబధ్ధ కవిత్వ సంకలనం నుండి కొన్ని పద్యాలు ఈమాట పాఠకులకోసం…
లలిత వాసు ఎదురుగా నిలబడి అతని ఎడమ చేతిని తన కుడి చేతిలోకి తీసుకుంది. తన ఎడమ చేతిని అతని నడుము చుట్టూ వేసి నెమ్మదిగా స్టెప్పులు వేయిస్తూ అతనికి డాన్స్ నేర్పించింది.
అహల్య శాపగాథను తనదైన శైలిలో ఒక రమ్యనాటికగా ఆవిష్కరించిన తిలక్ రచన సుప్తశిల నాటకం ఆడియో.
చలచ్చంచల వాంఛా పరికలిత డోలా ప్రహేల
ఆశా విశల మోహా విరళ దాహాతివేల
పరితాప శీల దీప ఖేల
నిజమే మరి. ఇవాళ తిలక్ లేడు. తిలక్ పాట వుంది. నిజంగా వుంది. జాలిగా హాయిగా వినపడుతూ వుంది. ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది.
సాంప్రదాయకవులనీ, భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే విభజన కృత్రిమమైనది. అసలు కవితాతత్వాన్ని పక్కదారి పట్టించేది. కదిలించే కవిత్వాన్ని రాయలేనివాళ్ళకు కవులుగా ఏదోవిధంగా అస్తిత్వాన్ని కలిగించటానికి చేసే వ్యర్ధప్రయత్నం.