నిజమే మరి. ఇవాళ తిలక్ లేడు. తిలక్ పాట వుంది. నిజంగా వుంది. జాలిగా హాయిగా వినపడుతూ వుంది. ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది.
శీర్షికలు సంచికలు
సాంప్రదాయకవులనీ, భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే విభజన కృత్రిమమైనది. అసలు కవితాతత్వాన్ని పక్కదారి పట్టించేది. కదిలించే కవిత్వాన్ని రాయలేనివాళ్ళకు కవులుగా ఏదోవిధంగా అస్తిత్వాన్ని కలిగించటానికి చేసే వ్యర్ధప్రయత్నం.
తిలక్ తన కవిత వెన్నెలను తన గొంతులోనే వినిపించిన ఈ అపురూపమైన ఆడియో 1965లో ఆలిండియా రేడియో వారిచే రికార్డు చేయబడింది.
ఒక గొప్ప కవిగారి పేరు, మీపేరూ అనుకోకండా ఒకటే అయితే ప్రమాదమే! శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రపంచప్రసిద్ధి పొందితే, శ్రీభాష్యం శ్రీనివాసులు, ఏదైనా అడపా తడపా రాసి ఏ పత్రికకన్నా శ్రీశ్రీ అన్న పేరుతో పంపిస్తే, మందలించని సంపాదకుడు ఉండడనుకుంటాను.
శతక వాఙ్మయానికి పెట్టింది పేరు తెలుగు భాష. సుమారు రెండవ శతాబ్దము నుండి నేటివరకు కవులు శతకాలను వ్రాస్తూనే ఉన్నారు. ఈ రచనలో కొందరి దృష్టి ఇహపరసాధన మయితే, మరి కొందరిది నీతిప్రబోధం. ఇంకా కొందరిది శృంగారం.
కురులని గాలికి వదిలేసి గంతులేసుకుంటూ పూలని, మొక్కలని ముచ్చటగా తాకుతూ పరిగెడుతున్నాను. తలెత్తేసరికి రివ్వున గాలి నా ముఖాన్ని కురులతో కప్పేసింది. చేత్తో నా కురులను స్లో మోషన్లో తొలగించుకుంటూ చూస్తే, గుర్రం మీద కౌబాయ్ టోపీ పెట్టుకొని ఎవరో హీరోలా వున్నాడు.
ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.
సాహిత్యమండలి సంక్రాంతి సంబరాలలోకవి సమ్మేళనం ఆనవాయితీ. మొదటిరోజున, మల్లెపువ్వులాంటి తెల్లటి గ్లాస్గో ధోవతి, అంతకన్న తెల్లటి లాల్చీ వేసుకొని సభవెనకాల నిలబడ్డ స్ఫురద్రూపిని నేను మొదటిసారిగా చూసాను. ఇటువంటి సభల్లో వెనకాల చేరి అల్లరి చేసే వయస్సు నాది.
నువ్వు లేవు నీ పాట వుంది, ఇంటి ముందు జూకా మల్లెల్లో చుట్టుకుని, లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకుని.. అంటూ అద్భుతమైన వచన కవిత్వాన్ని మనకందించి అకాలంగా కాలం చేసినా మన మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోయిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన ఇలా గుర్తు రావడానికి ఏ సందర్భమూ లేదు, అక్కర్లేదు. ఆ కవితా సతి నొసటి రసగంగాధర తిలకపు చుక్కలు కొన్ని ప్రత్యేకంగా, శబ్దతరంగాలు, కథలు, కవితలు, వ్యాసాలతో కలిసి ఈ సంచికలో ఈమాట పాఠకుల కోసం.
సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య పట్టాభిషక్తుడై ఈ యేటికి ఐదువందల సంవత్సరాలయింది. కృష్ణరాయని కాలంలో తెలుగు వారికి ప్రసాదమైన అపురూప సాహిత్యమూ, దక్షిణాపథ చరిత్రలో ఆ కాలానికి గల విశిష్టతల ప్రభావంతో, ఈ సంచికను శ్రీకృష్ణదేవరాయల ప్రత్యేక సంచికగా ప్రచురిస్తున్నాం. ఈ సంచికలో కథలు, కవితలు, శీర్షికలతో పాటుగా విజయనగర సామ్రాజ్యం గురించిన చారిత్రాత్మక వ్యాసాలు; కీ. శే. వేటూరి సుందరరామమూర్తి రచించిన సంగీత నాటిక ఆడియో ప్రత్యేకంగా ఈమాట పాఠకుల కోసం పొందుపరిచాం. ఈ సంచికలో మీకోసం…
బ్రహ్మతేజము మీరు ఫాలభాగమునందుఁ
దిరునామదీప్తులు మెఱయుచుండ,
ఎత్తుబాహులయందు బెత్తెడంచుల జరి
యుత్తరీయపుకాంతి యోలగింప.
వెడదయురమ్ముపై నిడుపైన యజ్ఞసూ
త్రద్వయవిద్యుతుల్ దనరుచుండ,
మల్లెపూడాలుకుం జెల్లెలై విలసిల్లు
తెల్ల దోవతికాంతి యుల్లసిల్ల,
ఫోన్ పెట్టేసిన గీత చాలా సేపు స్థబ్ధుగా కూర్చున్నాక లేచి తనకు తెలిసున్న తెలుగాయనకి చెప్పింది విషయాలన్నీ. ఆయన విని తనకి తెల్సున్న లాయర్ దగ్గిరకి తీసుకెళ్ళేడు. వేరే పాథాలజిస్ట్ చేత రెండో ఒపీనియన్ అడగొచ్చనీ, తాను హెల్ప్ చేస్తాననీ చెప్పేడు.
మా కిద్దరికీ ఈత రాదు. మా అమ్మాయి ఈదటం నేర్చుకోవాలని మాకు ఇష్టం. అదొక మంచి వ్యాయామమే కాకుండా, జీవితంలో ఎప్పటికయినా పనికొచ్చే అవసరం అని మా ఉద్దేశ్యం.
మాలాంటి వాళ్ళంతా గూగుల్ బ్రెయిన్ తో పని చేస్తున్నాం చాలా మట్టుకి. అప్పుడప్పుడు మాత్రమే స్వంత బ్రెయిన్ వాడేది. అది కూడా ఏదో అమ్మాయితో, ప్రేమగా కబుర్లు చెప్పడానికి మాత్రమే.
వొయసులో జేబీల డబ్బులాడిన్నాడు
పద్దు లెక్కించుకుని పదిలముగ వున్నాను.
దసరాకి కుర్రోలు దండుకున్నట్టుగ –
నడమంత్రం కురుపంటె ఇలాగే కావాల.
సెక్రటరీ మెట్లు దిగి తన కొత్త కారు కేసి దర్జాగా నడవడం వాచ్‌మాన్ చూసాడు. తన వాదనని మరోసారి వినిపించాలా లేక క్షమించమని బ్రతిమాలాలా?
నువ్వంటే నాకు చెప్పలేని చిరాకు, అంతులేని కోపం,
ఎందుకు నిన్నింతగా ప్రేమించేలా చేస్తావు నన్ను మరి?
విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు తెలుగువారు అని వెంకటరమణయ్య చేసిన ప్రతిపాదనని ‘కర్నాటక’ చరిత్రకారులు వ్యతిరేకించారు.
ఇది కథో కల్పనో నాకు తెలియదు. కానీ ఇది సజీవశిల్పం. ఈ శిల్పం చెక్కడానికి ఉలి, ఊపిరి, శిలా, వైఖరి మాత్రం నా మాతామహుల వారసత్వం.