కూడనట్టి పనులెన్నో కూరిమితో చేసినాము వలసినవన్నీ చేదగు
శీర్షికలు సంచికలు
నా కవిత్వం సహనంతో వేచివుంటుంది, తనను తాను ఆవిష్కరించుకునే ఓ అద్భుతమైన క్షణం కోసం
మేఘసందేశం (1983) చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ప్రత్యేక జనరంజని ఆడియో.
“ఈనాడు ‘రిథమ్’ విని ఎక్కువమంది ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు కానీ ‘మాధుర్యం’ ప్రధానంగా వున్న పాటలే చిరకాలం నిలుస్తాయి”
అప్పట్లో వైద్యనాథయ్యరుకి పోటీ లేదని ఒకసారి మైసూరు మహారాజు అంటే, సుబ్రమణ్యయ్యరు ఒక ప్రత్యేకరాగంలో పాట కట్టి ఆశువుగా కచేరీలో పాడాడు.
ఈ సంచికలో మీకోసం: సుప్రసిద్ధ హిందీ కవి బాబా నాగార్జున కవిత్వాన్ని, అంతస్సు – బాహ్యప్రపంచాల సంబంధాల్ని విశ్లేషిస్తూ చాకిరేవు ఉపేంద్ర సమగ్ర వ్యాసం; శబ్దతరంగాలలో రమేష్ నాయుడు ప్రత్యేక జనరంజని ఆడియో; వసంత ఋతువుని సాహిత్యంలో సంగీతంలో పరిచయం చేస్తూ జెజ్జాల కృష్ణ మోహనరావు వ్యాసం; ఇంకా ఎన్నో కవితలు, కథలు, శీర్షికలూ…
మన ఈ గాంధర్వవివాహానికి
ఆకాశమే పందిరి పక్షులే సాక్షులు
లోలోపల ఏ దీపం ఎప్పుడు వెలిగిందో
జ్ఞాపకాల మిణుగురులు అంటుకుని
వేడిమి లేదు;
ఒకసారి, బహదిన్ షా సూఫీ సూత్రాలు, సూఫీ పద్ధతులపై ఉపన్యాసం ఇచ్చాడు. ఒక తెలివైన పెద్దమనిషి బహదిన్ పై విమర్శ విసిరాడు: “ఈ బహదిన్ షా ఎప్పుడైనా, కనీసం ఒక్కసారైనా కాస్త కొత్త విషయాలు చెప్పితే బాగుండును. ఎప్పుడూ చెప్పిందే, చెప్పిందే చెప్పుతాడు.”
కర్నాటక సంగీతంలోని గాఢ ఫణితులుగాని, హిందుస్తానీ బాణీలోని బిరకాలుగాని, లలిత సంగీతంలోని మధుర ధోరణులుగాని, అతి సహజంగా దొర్లిపోయే కంఠం ఆమెది.
ఇప్పుడు గంటలకొద్దీ ఆఫీసు బ్రేక్ టైముల్లో మొబైల్ ఫోన్స్ మీద ఉండే యువతీ యువకులను చూస్తే అప్పుడు ఫోన్లో మాట్లాడే వీలుకూడా లేని మా ఆఫీసు ప్రేమికులను గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
సకల ప్రాణులను సంతోషపెట్టిన
ఆ స్వచ్చమైన వర్షపు చినుకులు-
నాకు మాత్రం …
హస్తగతదీపకాంతుల నరయలేని
అంధులంబోలె నూరక యఱతురేల?
గొడ్డు గోదా, ఆస్తీ పాస్తీ
ఇంట్లో విలువైన మనుషులూ
అందరి మీదకి ఆయుధాలు వచ్చేస్తాయి.
నాటకం బలిజేపల్లి లక్ష్మీకాంత కవిది. కాటి సీనులో బలిజేపల్లి వారి పద్యాలతో పాటు మరో మహాకవి పద్యాలు – కేవలం శ్మశానాన్ని వర్ణించేవి – నటకులు పాడటం పరిపాటి అయింది.
నా ఉద్దేశంలో ఇక్కడ కథలు రాస్తున్నవాళ్ళల్లో చాలామంది భౌతికంగా (ఫిజికల్ గా) అమెరికాలో ఉన్నారు కానీ, మానసికంగా, ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు.
సృజన ఎక్కడ్నుంచి పుట్టిందనేది ఎలాగయితే ఒక అంతుచిక్కని విషయమో, సృజించేది ఎవరు అనేది కూడా అంతే నిగూఢమైన సంగతి. రాస్తున్నది ఎవరు?
శృంగారరస ప్రధాన ప్రబంధంలో ఎంత శృంగారం ఉచితం, ఎంత శృంగారం కావలసిన మోతాదులోనే ఉన్నది అన్న ప్రకటనలు, వాఙ్మూలాలు వివాదాస్పదాలు.