పారసీక ఉర్దూ భాషలలో మత్తకోకిల లయను బహర్ రమల్ ముసమ్మన్ మహజూఫ్ అంటారు (బహర్ అంటే పద్యము లేక వృత్తము). దీని సూత్రము ఫాయలాతున ఫాయలాతున ఫాయలాతున ఫాయలున్. దీనిని మన గురులఘువులవలెనే వివరిస్తారు. గాలిబ్ వ్రాసిన సబ్ కహాఁ కుఛ్ లాలహ్ ఓ గుల్ మేఁ నుమాయా హో గయీ అనే గజల్ ఈ లయలోనిదే.
శీర్షికలు సంచికలు
రామారావుగారి కధ మంచి ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలా ఉంటుంది. కానీ మంచి చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉండదు. రచయిత దృక్పధాన్ని కధను మధించి పట్టుకోవటానికి వీలుగా ఉండాలి. ఈ కధ ద్వారా రామారావుగారు ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే అదేదో చెప్పటం కష్టం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా కధ సాగుతుంది.
చారిత్రక నవలకుండవలసిన మొదటి లక్షణం చారిత్రకత. సాధారణంగా సాంఘిక నవలలన్నీ సమకాలిక సమాజాన్ని వాస్తవికంగానే చిత్రిస్తాయి. కానీ సామాజిక పరిస్థితులు యెంత వాస్తవికంగా, యెంత విపులంగా, యెంత కళాత్మకంగా చిత్రించినా, ఆ దేశకాల పరిస్థితులు అలా యెందుకున్నాయనే ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నంకాదు (ప్రశ్నే లేదు గనక సమాధానమూ లేదు).
చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును.
ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వడానికి నాలుగేళ్ళు, ఔషధ నిర్మాతకి ఐదేళ్ళు, దంత వైద్యుడికి ఆరు, న్యాయవాదికి ఏడు, వైద్యుడికి ఎనిమిది సంవత్సరాలు శిక్షణ అవసరం అయినప్పుడు, అంతకు తక్కువ సమయం లోనే ఒక సుశిక్షితుడైన జీవిత నవలారచయితగా ఎదగడం ఎలా సాధ్యం?
పాబ్లో పికాసో, సాల్వడోర్ డాలి, ఎడ్గార్ డెగా, వాసిలీ కాండిన్‌స్కీ తదితరుల సరసన సమాన స్థాయిలో నిలబడిన చిత్రకారుడు ఎస్. వి. రామారావు. భారతీయ చిత్రకళా పద్ధతులను యూరోపు నైరూప్య చిత్రకళతో రంగరించి తనదంటూ ఒక ప్రత్యేకమైన భావప్రకాశకత్వాన్ని సాధించుకున్న రంగులకవి. చిత్రకారుడు, కవి, వ్యాసకర్త అయిన రామారావు కళాజీవన పరిణామాన్ని పరిచయం చేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన వ్యాసం, నైరూప్యచిత్ర కళాయాత్రికుడు; చారిత్రక నవల లక్షణాల పరిశీలన, చర్చ కోసంగా మూడు ప్రత్యేక వ్యాసాలు – ఆంధ్రభాషలో చారిత్రక నవల గురించి నోరి నరసింహశాస్త్రి పరిచయ వ్యాసం, కొల్లాయి గట్టితేనేమి నవలపై రారా సమీక్షావ్యాసం, ఇర్వింగ్ స్టోన్ వ్రాసిన జీవిత నవల వ్యాసానువాదం ఈ సంచికలో మీకోసం.
ఈ సంచికలో: పాలపర్తి ఇంద్రాణి, తః తః, వైదేహి శశిధర్, విన్నకోట రవిశంకర్, కనకప్రసాద్‌ల కవితలు; సి. ఎస్. రావ్, జెజ్జాల కృష్ణ మోహన రావు, సురేశ్ కొలిచాల, వేలూరి వేంకటేశ్వర రావు, పప్పు నాగరాజుల వ్యాసాలు;గౌరి కృపానందన్, మాధవ్ మాచవరం, కొల్లూరి సోమ శంకర్, ఆర్. దమయంతిల కథలు; చీమలమర్రి బృందావనరావు, కనకప్రసాద్‌ల శీర్షికా వ్యాసాలు – నాకు నచ్చిన పద్యం, మూడు లాంతర్లు, రెండు కవితలకు గిరిధరరావు ప్రశంస, వేలూరి చెప్పే కథ నచ్చిన కారణం …
ఆషాఢ మాసం కాకపోయినా, మధ్యాహ్నాలు ఆకాశమంతా నల్లమబ్బులు నిండిపోయి ఉరుములూ, మెరుపుల జడివానలు మనల్ని అప్పుడప్పుడూ పలకరిస్తున్నాయి ఇప్పటికే. వాటిని చూసేనేమో, కృష్ణ మోహన రావు గారు, కాళిదాస విరచిత మేఘదూతంపై వ్రాసిన ఛందోవ్యాసం ఆషాఢస్య ప్రథమ దివసే ఈ సంచికలో ప్రత్యేకం. ఈ వ్యాసానికి యక్షుడి చిత్రాలను అందించినది ఔత్సాహిక చిత్రకారుడు మాగంటి వంశీమోహన్‌గారు. అంతే కాదు, ఈ వ్యాసానికి తోడుగా పరుచూరి శ్రీనివాస్ సేకరించిన మేఘసందేశం ఆడియో రూపకం కూడా ప్రత్యేకమే. బాలాంత్రపు రజనీకాంత రావు రచన, సంగీత సారథ్యంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రధాన గాయకుడిగా ఆలిండియా రేడియో, బెంగళూరు నుంచి 1978లో ప్రసారమైన ఈ రూపకం అపురూపమైనదని అనడంలో సందేహం ఏమీ లేదు. అలాగే, స్త్రీల రామాయణపు పాటల విశ్లేషణలో భాగంగా వెల్చేరు నారాయణ రావుగారి ఇంకో వ్యాసం లక్ష్మణదేవర నవ్వు ఈ సంచికలో మీకోసం.
సంగీత్ నాటక్ అకాడెమీ టాగోర్ సమ్మాన్ పురస్కారానికి పట్రాయని సంగీత రావుగారినీ, టాగోర్ రత్న పురస్కారానికి బాలాంత్రపు రజనీకాంత రావుగారినీ ఎన్నుకొన్నారు. వారికి మా హార్దిక శుభాకాంక్షలు. ఈమాటలో వీరి గురించిన పరిచయ వ్యాసం 88 యేళ్ళ యువకులు.
ఇంకా: ఇంద్రాణి, తః తః, వైదేహి, ముకుంద రామారావు, హెచ్చార్కెల కవితలు; వేలూరి కథ; గౌరి, పూర్ణిమ, మాధవ్‌ల అనువాదాలు; జయప్రభ పుస్తకం అన్నమయ్య పదపరిచయం పై సాయి బ్రహ్మానందం సమీక్ష; పాత కినిమా సంచికలనుండి రోహిణీప్రసాద్ అందించిన సినిమా సంగతులు; పలుకుబడి, మూడు లాంతర్లు, నాకు నచ్చిన పద్యం, కథ నచ్చిన కారణం ధారావాహిక శీర్షికలు; కనకప్రసాద్ శబ్ద రచన బాల బేలవు ముద్దరాల. …
ఇది చాల బాగుంది
ఎక్కడికక్కడ విరిగిపోవడం
రెండు పెగ్గులు పద్యం తాగి
ఒక బుజమ్మీద ఒరిగిపోవడం
కారడివిలో రావణాసురుని చేత పట్టుపడిన నిన్ను తొడలమీద పెట్టుకొని ఉన్నాడు రాముడు. ఆయన ఒక క్షణం నీ దగ్గిర లేకపోతే నీకు ప్రాణాలు నిలవవని అన్నావు గుర్తుందా, అప్పుడే నన్ను అనరాని మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు ఆరునెలలు రాముడు లేకుండా ప్రాణాలు నీకు ఎలా నిలిచాయి? ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదు.
ఊగుతాడు సూర్యుడు
గుండ్ల కమ్మ మీద
తేలుతాడు చంద్రుడు
కాళ్ళు జాపుకు ఆవులిస్తూ
మెటికలు విరుస్తుంది కాలం.
ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత. దెబ్బ తాకితే అమ్మో! అంటాము. జాలి చూపడానికి అయ్యయ్యో! అంటాము. అలాగే ఆశ్చర్యానికి అబ్బో! అంటాము. పని పూర్తి కాగానే అమ్మయ్య! అని నిట్టూరుస్తాము.
అన్నమయ్య శృంగార పదాలని కేవలం శృంగారంగా చూడకుండా కవితాత్మకంగా పరిశీలించి అందులో ఉండే పద మాధుర్యాన్నీ, భావ సౌందర్యాన్నీ వివరిస్తూ ఒక పుస్తకరూపంలో “వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాకలి వేసినది” పేరున అన్నమయ్య పదపరిచయం చేసింది కవయిత్రి జయప్రభ.
బ్రహ్మ వేసిన లెక్కల ప్రకారం దక్షిణభారతదేశాగ్రంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా రావాలి. అదెలాగంటే, శంబళ అనే కుగ్రామంలో విష్ణుయశుడనే వాడికీ, వాడిభార్య సుమతికీ శిశువుగా ఆయన జన్మమెత్తాలి. ఆయనకి కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు అనే ముగ్గురన్నలుండాలి. అతగాడు, పరశురాముని దగ్గిర విద్యాభ్యాసం చెయ్యాలి. ఇది కర్మానుగుణ్యంగా జరగవలసిన వరస.
అద్దంలో జిన్నా యం. ఏ. జిన్నా కోటు తొడుక్కొని అద్దం ముందు నుంచున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా చాలా గొప్ప జిన్నాలా […]
హటాత్తుగా అతను నన్నే చూస్తున్నాడని నాకనిపించింది. మామూలుగా చూడటం కాదు. అతని చూపులు సూటిగా, అటూ ఇటూ తొణక్కుండా నన్ను ఆపాదమస్తకం శ్రద్ధగా చదువుతున్నట్టుగా, అక్కడితో ఆగకుండా లోపల్లోపలికి చొచ్చుకొనిపోయి నా వీపుని కూడా ఒదిలిపెట్టకుండా, నా శరీరాన్ని బైటా లోపలా కూడా శల్యపరీక్ష చేస్తున్నాట్టుగా, అబ్బ! చటుక్కున చూపు తిప్పుకున్నాను.
మత రాజకీయాలని, విద్వేషాలనీ అవతలకి నెట్టి ఈ కథ చదవవలసిన అవసరం ఉన్నది. ఈ కథని చదవవలసిన నేపథ్యం కూడా వేరే! మహాత్మా గాంధీ అంటే సాధారణ భారతీయులకి ఎంత ఆదర్శమూర్తో, మహమ్మదాలీ జిన్నా పాకిస్థానీయులకి అంత ఆత్మీయుడు. నెహ్రూని పక్కకి తప్పించి జిన్నాని మొదటి ప్రధానిగా చెయ్యటానికి కూడా గాంధీ సిద్ధపడ్డాడు. అయితే, జిన్నా గురించి హిందువులకి ఉన్న అభిప్రాయాలు వేరు.
కవి చేమకూర వెంకటరాజు లోకంలో వెంకటకవిగా సుప్రసిద్ధుడు. ఆయన కావ్యం విజయవిలాసంలో ప్రతి పద్యం లోనూ చమత్కారం చూపిస్తానని శపధం చేశాడట ఈయన. అలాగే ప్రతి పద్యమూ ఆలోచనామృతం చేశాడని చెప్పవచ్చు. పైకి చూస్తే ఒక భావంతో కనిపించే పద్యంలో తవ్వుకుంటూ పోతే ఎన్నో విశేషార్థాలు ద్యోతకమౌతాయి. ఒక రకమైన రసానందం కలిగించే కావ్యమే ఇది.
సావిత్రి గురించి కుటుంబరావుగారు ఊహించిన ‘మంచి భవితవ్యం’ మాట నిజమయింది కాని హిందీ సినిమాల్లో ప్రవేశం మటుకు లభించలేదు. విజయావారు రషెస్ అందరికీ చూపడం వంటి అపురూపమైన విషయాలు మనం ఈ వ్యాసంనుంచి తెలుసుకోవచ్చు. అలాగే సావిత్రి తొలిదశ విశేషాలు ఇంత వివరంగా మరెక్కడా దొరకవేమో.
వారమంతా వారాంతం కోసం వోపిగ్గా ఎదురు చూశాక
ఎప్పటిలానే ఏలకుల సుగంధాన్ని మోసుకుని
శనివారపు ఉదయం మెత్తగా నిద్ర లేపుతుంది
సురవర వారు తెలుగు కీబోర్డ్ తయారుచేసి అమ్ముతున్నారు. ఈ కీబోర్డ్‌పై అక్షరాలు తెలుగులో ఉంటాయి. ఈ కీబోర్డ్ వాడి ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ టైప్ చేయవచ్చును. వేరే ఏ సాఫ్ట్‌వేర్ అక్కరలేకుండానే మీరు ఇప్పుడు వాడుతున్న కీబోర్డ్ స్థానే సురవర కీబోర్డ్‌ని చక్కగా వాడుకోవచ్చును.