అతడిని అంతకు ముందు ఎక్కడ చూసానో గుర్తొస్తోంది! సాయంత్రం సన్మాన సభలో నేను చేయ బోయే ప్రసంగానికి పీయ్యే సహాయం అంతగా అవసరం లేదు. పాతికేళ్ళ క్రితం నేను చదువుకునే రోజుల్లో, నా స్కాలర్‌షిప్ పని మీద కలుసుకున్న వీయస్సార్, ఈ వీధుల సుబ్బరామయ్యా ఒక్కరే!

తీర్థం తాగి చెయ్యి నెత్తిమీద ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు నారాయణకి. యింకా చాలా విషయాలు అతనికి అంతు పట్టవు. సంస్కృతంలో సుప్రభాతం, ఆనక వేద మంత్రాలూ చదివి, అరవంలో తిరుప్పావయ్యో మరేదో చదువుతారు కదా, మరి తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష?

గోవిందరావు హైదరాబాదులో విమానం దిగి, భోషాణాల్లాంటి రెండు పెద్ద సూటుకేసులూ ట్రాలీ మీదకెక్కించి బయటకి రాగానే వాడి నాన్న, అమ్మ, మేనత్త కనిపించారు, చేతులూపుతూ! అమ్మకి కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఐదేళ్ళయ్యిందాయె, ఒక్కగానొక్క కొడుకునీ చూసి!

ఒక్క క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అది కలా నిజమా – అని తెలుసుకుందుకు గిల్లుకొనేవాడే, అంతలో కయ్యి మని హారన్ కొట్టుకొంటూ ఎదురుగా వెళ్ళిపోయిన లారీ తన శబ్దభేరిని భేదించినంత పని చేస్తే, తను చూస్తున్నది కలకాదని నిశ్చయించుకున్నాడు. ఆమె… ఆమేనా?! ఇది సాధ్యమేనా?! లేక తను భ్రమపడుతున్నాడా?!

ఆ పెళ్ళి విందు రాజారావుకొక కొత్త అనుభవం! ఎవరో ఓ మహాకవి అన్నట్లు అనుభవాల పేజీలే కదా జీవితమంటే! తన పిల్లల ప్రవర్తనల మార్పు అనే అనుభవం అతనికి మెల్ల మెల్లగా తెలుస్తోంది. ఏ అనుభవాల అంచున ఎప్పుడు జారి పడతామో ఎవ్వరికీ తెలియదు.

“అమెరికన్లకి మనలాంటి విదేశీయుల్ని చూసి వీడు మనవాడు అని ఎప్పటికీ అనిపించదనుకుంటా. ఉద్యోగ ధర్మంగా ఏదో స్నేహంగానే ఉంటారు గానీ ..”

అతన్ని చూస్తే నిసి గుండె లయ తప్పింది. అతను అతి సుందరుడు. పసుపు రంగా అంటే కాదు. తెలుపా అంటే అది కాదు. గులాబీ వర్ణమా మరి. అతి నాజూకుగా సున్నితంగా ఉన్న ముఖ రేఖలు. కొద్దిగా పొడవాటి మెత్తని జుట్టు. గంభీరమైన సోగ కన్నులు.ఓ! మై గాడ్! హాడ్జ్కిన్స్ ఉన్న ఇతనికేమో కాని నాకు చెమటలు పడుతున్నాయ్. ఎంత మన్మధుడు! మన్మథుడికి జబ్బులు రావచ్చునా దేవా! అనుకుంది నిసి.

ఈ సుందరం మావయ్య ఓ విచిత్రమైన మనిషి! అవతల వాళ్ళని పొగిడి తన పనులుచేయించుకొనే దిట్ట అని కలిసిన మర్నాడే అర్థమైపోయింది. మాయింటికి భోజనానికి పిలిచాకా వాళ్ళింటికి బదులు భోజానానికి పిలిస్తే వెళ్ళినపుడు, మా అవిడ వండిన వంకాయ కూర అద్భుతం అనీ, అలాంటి కూర తన జన్మలో తినలేదంటూ అప్పటికప్పుడు మా అవిడ చేత వాళ్ళింట్లో పోపు పెట్టించిన ఘటికుడు సుందరం మావయ్య.

ఆలోచనల్లో ఒకరిగురించి ఒకరికి సందేహాలు.. ఇంతలోనే కరంటు పోయింది. ఫ్యాను కదలడం తగ్గిపోయేకొద్దీ నిశ్శబ్దం పెద్దదవుతోంది. ఇద్దరూ అసహనంగా కదిలారు. ఆమెకి అర్థమయింది, అతడు నిద్రపోలేదని, అతడికీ అర్థమయింది, ఆమె కూడా నిద్రపోలేదని..

ఊపిరి అందడంల్యా. యమకల్లో నొప్పి. కాలు వూడి రాకంటే ఊపిరి బిగిసి సస్తాననిపిస్తాంది. బాగన్నా యిరక్కపాయనే. నాకు మొగదాడు కుట్టకపోతేనేమి, సెప్పినమాట యినపోతినా నేను!?

హయగ్రీవశాస్త్రి ఇప్పుడు అనాధశవం. హనుమంతుకి పురాణం శాస్తుర్లు గారు ఎప్పుడో పురాణంలో పిట్ట కథలా చెప్పింది గుర్తుకొచ్చింది. అనాధ ప్రేత సంస్కారాత్ కోటియజ్ఞ ఫలం లభేత్, అని.

ఒంటరిగా, ప్రశాంతంగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా పల్లెటూరిలో ఉండేవారు తాతయ్య. ఆయన జీవితంలో ఒక్క cataract ఆపరేషన్‌ తప్పించి డాక్టర్లు, మందులు, హాస్పిటళ్ళు ఎరగరు. ఒకరోజు సాయంత్రం ఆవుపాలు పిండటానికి వెళ్ళిన తాతయ్య పదినిమిషాలలో లోపలికి వచ్చారు, ఎడమచేయి నొప్పి పుడుతున్నాదంటూ. పక్కింట్లో ఉన్న తన చిన్నకొడుక్కి కబురంపి, ఒక గంట తర్వాత కొన్ని దశాబ్దాలుగా ఆ ఇంట్లోనే తాను ఊగిన ఉయ్యాలబల్లమీద పడుకుని “శివ శివా” అంటూ కన్నుమూశారు.

పార్టీ అయి అంతా వెళ్ళాక మర్చిపోకుండా మళ్ళీ అడిగింది తనే “పేకాట ఎప్పుడు, ఎందుకు వదిలిపెట్టారు”?

ఎంత సేపూ ఏదో పుస్తకాలమీద ఎక్కువ ధ్యాస. చిన్నప్పుటినుంచీ ఏర్పడిపోయిన అలవాటు. మళ్ళీ మేఘసందేశం తియ్యబోతుంటే , గబుక్కున ఆమెకు మధ్యాహ్నం మూడు గంటలకు టెన్నిస్ లెసన్ ఉన్న సంగతి గుర్తొచ్చింది.