రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ధార

రచన: దేవరపల్లి రాజేంద్ర కుమార్‌
సెప్టెంబర్ 2008

“ఒరేయ్, నువ్వు చాలా చెత్త వాగుతావురా”, అన్నాడు ముఖం కందగడ్డలా పెట్టుకొని, గోవిందరాజులు. అందులో అబద్ధం లేదు గనక నేనూ నోర్మూసుకున్నాను.

స్థలం: విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న ఒక విశాలమయిన స్టార్ హోటల్ లాబీ.
సమయం: సాయంత్రం ఆరు గంటలు.
సందర్భం: నేను, వెంకట్ అనబడు వేంకటాచలపతిని వాడు ఈమధ్యే ఓ కొత్త విదేశీ కారు కొన్న సందర్భంగా ట్రీట్ అడిగినవేళ.

సాయంత్రం సరదాగా, రానున్న రాత్రికి కర్టన్ రైజరులా హుషారుగా ఉంది. చుట్టూ ఎన్నో కార్లు. వాటిలో భాగాలేమో అనిపించే డ్రైవర్లు. డిక్కీల వెనుకనుంచి వస్తున్న చౌకరకం సిగరెట్ల పొగ, ఆటోనుంచి దిగి హిందీలో అడ్రస్ అడుగుతున్న బెంగాలీ కుటుంబం, నవ్వుతూ గుంపుగా బస్ దిగి ఫ్రెషర్స్ డే పార్టీ చేసుకునేందుకు లోపలికి వస్తున్న కాలేజీ అమ్మాయిలు.

సిగరెట్ పాకెట్లో నుంచి నాకొకటి ఇస్తూ, వాడూ ఒకటి వెలిగించుకుంటూ, “ఇప్పుడు వాడి కారు చూడకపోతే, మీబాబు కొంపేవన్నా కూల్తుందా? నీ…” అని బూతులకు దిగాడు.

“అరేయ్, నువ్వంటే కోటీశ్వరుడి నుంచి బిలియనీరువు అవుతున్నావు, నేను నా దిగువ మధ్యతరగతి నుంచి మధ్యతరగతి కన్నా ఎగబాకుదామని చూస్తున్నాను, అయినా నీకు తెలియకుండా మా బాబుకి కొంపగోడు ఎక్కడివిరా!?” అన్నాను.

“ఈ పనికిమాలిన లాజిక్కులొకటి, పద మళ్ళీ కాఫీ తాగుదా”మని లోపలికి దారి తీశాడు. వాడి వెనుకే నేనూ.

గోవిందరాజులు ఒక్క విశాఖపట్నంలోనే కాక చుట్టుపక్కల మరో మూడు జిల్లాల్లో బాగా డబ్బు, పేరుప్రతిష్టలు ఉన్న కుటుంబానికి ఏకైక వారసుడు, నేనేమో బతకలేని బడిపంతులు అనిపించుకునే (ఆరోజుల్లో)మామూలు సాదాసీదా కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి ప్రతినిధికి నాలుగో కొడుకును, కాగా పిల్లల్లో ఆరోవాణ్ణి. మా ఎలిమెంటరీ స్కూలు రోజులకు అటు ఐదేళ్ళు ఇటు ఐదేళ్ళు గోవిందరాజులు ఒక్కడు తప్ప ఎవరూ రోజూ కారులో వచ్చినవాడు లేడు. అందువల్లో ఏమో చాలామంది మా ఈడు పిల్లలు వాడిని ఆటల్లో కలుపుకునే వాళ్ళు కాదు. నేను మాత్రం ఎందుకు దోస్తీ కట్టానంటే కేవీఆర్ మేష్టారి వల్ల. ఇన్ని సంవత్సరాల మా జీవితంలో వాడు అంత కోటీశ్వరుడైనా, ఇప్పటికీ దాదాపు రోజూ కలిసి మాట్లాడుకునేది, తిట్టుకునేదీ మేమిద్దరమే. వెంకట్ గాడు గోవిందరాజులుకు దగ్గరి చుట్టం, మా వయసు వాడే. కానీ వేరే ఇంగ్లీషు బళ్ళో చదివేవాడు. మరి గోవిందరాజులు మాత్రం మా దుంపల బళ్ళో ఎందుకు చదివాడు? దానికీ కారణం కేవీఆర్ మేష్టారే, మా నాన్న, మాస్కూల్లో టీచరు. ఆయన శిక్షణలో ఏదో కొన్ని అక్షరం ముక్కలతో పాటు మరికొన్ని మామూలు విషయాలు నేర్చుకుంటాడేమో అని వాళ్ళ తాత మా నాన్న దగ్గర చేర్చాడు.

గోవిందరాజులు వెయిటర్ను పిలిచి, “మేమిక్కడ సిగరెట్ కాలుస్తాం. ఏసి ఆఫ్ చేయ్ కాసేపు” అన్నాడు.

దానికి ఆ బిక్క చచ్చిపోయిన వెయిటర్, “సార్ బిజినెస్ అవర్స్ సార్, గెష్ట్స్ వస్తారు సార్” అన్నాడు భయంగా.

“అవునా?” మావాడి గొంతులో దారుణమైన హేళన ధ్వనిస్తొంది, “అయితే మీ బిజినెస్ మానేజర్ని పిలువ్” అన్నాడు గట్టిగా. అప్పటికి అక్కడున్న ఒకరిద్దరు మావాడి గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి బిత్తరపోయి వచ్చే బిజినెస్ మేనేజర్ ఏమి చేస్తాడో అనే ఆదుర్దా తో ఎదురు చూట్టం నేను గమనించాను.

“సార్ మీరు ఏమీ అనుకోకపోతే బార్ రూం లో కూర్చొండి, కాఫీ అక్కడికే పంపుతాను” అని కాళ్ళావేళ్ళా పడటం ప్రారంభించాడు ఆ వెయిటర్.

“అక్కడ ఏ.సి లేదా?”మా వాడి ప్రశ్న.

“ఉంది సార్”

“మరి”?

“అక్కడ స్మోకింగ్ పర్మిటెడ్ సార్”

“ఎందుకని?” సమాధానం లేదు పాపం.

“సర్లేరా, ఈ ఇరుకు గదుల్లో ఎందుకు? ముందు కాఫీ తాగెయ్. హాయిగా బయట నిలబడి సిగరెట్లు కాల్చుకోవచ్చ”ని గోవిందరాజులిని శాంతపర్చాను. కాఫీ తాగి, బయట కొచ్చి చూస్తే చుట్టూ కార్లు. కానీ వెంకట్ గాడి బియండబ్ల్యు మాత్రం లేదు.

“అవునొరే, ఇందాకటి నీ కోపం నా మీదా? వెంకట్ గాడి మీదా?” అన్నాను. “నీ మీదేరా, వాడి బాబు సింహాచలం దేవస్థానం భూములమ్మి వీడికో పది కోట్లిస్తే ఈ ఎదవేమో బోడి ముండా ఫారిన్ కార్ల మీద తగలేసి చూస్కో నారాజా అని ఊరేగుతున్నాడు. ఆ యెదవకి నువ్వొక వంత పాట. ఆ ట్రీట్ ఏదో మీ ఇద్దరు తగలడక నన్నెందుకురా ఇందులోకి లాగారు?”అన్నాడు.

“నాకూ ఎప్పటి నుండో ఆ కారు మీద మోజుందిరా, ఒక్క సారి ఎక్కి అలా భీమిలి దాకా వెళ్ళొద్దామని” నా సంజాయిషీ.

మాటల్లోనే ఎర్రటి బియండబ్ల్యు మెల్లగా దొర్లుకుంటూ మా దగ్గరికి రావటం, డ్రయివర్ డోర్ తీస్తే వెంకట్ గాడు ఇంకా మెల్లగా దిగుతూ మా హావభావాలను గమనిస్తున్నాడు. కారు కొవ్వెక్కిన కోడి పుంజులా ఉంది. ఈలోపు చుట్టు పక్కల జనం, డ్రయవర్లు, కారు చుట్టూ చేరి, చూస్తూ, ముట్టుకుంటూ మురిసిపోతున్నారు.

“ఏరా, ఆ పెందుర్తి సైట్ కొనకుండా ఎందుకు దీని మీద ఇంత మదుపు” అని నేరుగా గోవిందరాజులు ఎటాక్ లోకి దిగాడు.

“ఇదీ, మదుపేలేరా! ఆ కొరియా కంపెనీ వాడొస్తున్నాడా? వాడికి తిప్పుతాను దీన్ని, నెలకు అద్దెంతో తెలుసా? లక్ష, అక్షరాలా లక్ష!! నాలుగేళ్ళలో మన మదుపు మనకొస్తుంది, పైగా ఇంత కాస్ట్‌లీ కారు తిప్పుతున్నామంటే ఏ బ్యాంకులోనయినా రెండు రోజుల్లో శాంక్షన్‌” అంటూ వ్యాపారమర్మాలు చెప్పుకొచ్చాడు.

1 2అంతా ఒకే పేజీలో

ఈ రచయిత నుంచే...

  • ధార
  • పళ్ళెం మాత్రం పగలగొట్టకు
  • కలలు కోతకొచ్చాయి

ఇటువంటివే…

  1. పడవ మునుగుతోంది
  2. దేశమును ప్రేమించుమన్నా

సెప్టెంబర్ 2008 సంచికలో ...

  • A review on ‘Tree, My Guru’
  • అమెరికా పర్యాటకుల రెండు పుస్తకాలు – II
  • ఈమాట సెప్టెంబర్ 2008 సంచికకు స్వాగతం
  • ఏటి ఒడ్డున
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు
  • గుప్పెడంత మనసు
  • చంద్రోదయం
  • జ్ఞాపకాల ఎదురుచూపు
  • జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4
  • డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశము
  • తారామతి బిరాదరి
  • దేశమును ప్రేమించుమన్నా
  • ధార
  • నాకు నచ్చిన పద్యం: భాస్కర రామాయణంలో వర్షాగమన వర్ణన
  • పడవ మునుగుతోంది
  • పుస్తక సమీక్షల గురించి…
  • బాలమురళీకృష్ణ
  • మనకు తెలియని మన త్యాగరాజు -1
  • మరో గుప్పెడు మొర్మొరాలు
  • రాగవాసిష్ఠం- నాటక వైశిష్ట్యం
  • వాడుక భాషలో పద్యాలు
  • సెన్సిటివిటీ ట్రెయినింగ్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఈమాట జులై 2008 సంచిక విడుదల!
మనకు తెలియని మన త్యాగరాజు -1

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.