బుల్లి భూషయ్యకి మహరాజవుదామని కోరిక పుట్టింది. ఒకటే ఉబలాటం. ఇదేమీ కొత్తగా పుట్టిన కోరిక కాదు. అన్నయ్య చిన భూషయ్య ఆరేళ్ళకిందట అనుకోకండా మహరాజుగా ఎంపిక అయినప్పటినుంచీ, తను కూడా మహరాజవ్వాలని తహ తహలాడటం మొదలెట్టాడు. తనకేం తక్కువయిందని? చదువులేదా? చక్కని సంసారం లేదా?

ఇద్దరి మనసులూ ఒక్కసారి అవ్యాజమైన ప్రేమ పూరితాలయ్యాయి. ఇంతకుముందూ అదే ప్రేమ ఉంది. ఇప్పటి ప్రేమకంటే వెయ్యి రెట్లు ఉండేది. కానీ ఆ ప్రేమలో కోరిక ఉంది. ఈ క్షణం ఈ ప్రేమలో ఏ కోరికా లేదు. నిర్వాణం పొందిన మనస్సు లో జీవన రహస్యాన్ని తెలిపే యదార్థమైన ప్రేమ ఉంది.

పావుగంట అయింది. రంగంమీదకి కొత్త పాత్ర ప్రవేశించింది. “మామీ” పాప అరిచింది హఠాత్తుగా. చుట్టూ కూర్చున్నవాళ్ళు హుష్ష్ అంటూ తమ అసహనాన్ని వెలిబుచ్చారు. నీలవేణి వాళ్ళకి క్షమాపణలు చెప్పుకుని, ఆపాపని మళ్ళీ నెమ్మదిగా అడిగింది ఆవిడ మీఅమ్మాఅని. అవును మామీయే. తల్లెవరో నిర్ధారణ అయిపోయింది. నీలవేణి ప్రాణం తెరిపిన బడింది. ఆట ముగిసేసరికి ఆపసిదానిబాధ్యత కూడా తీరిపోతుందని.

భర్తలందరూ భిక్షువులుగా మారితే, స్త్రీలందరూ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలా? సృష్టి విరుద్ధమైన ఈ సన్యాసం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటని ఆ బుద్ధుణ్ణే సరా సరి అడుగుతాను. నా నందుణ్ణి నాకివ్వమని అర్థిస్తాను.

“ఊఁ హూఁ. దోషమంటూ ఉంటే అది నాలోనే ఉంది. మిగిలిన వారి నందరినీ ‘ఆజానుబాహుడూ’, ‘అరవింద దళాక్షుడూ’, అంటూ వర్ణించి, నన్ను మాత్రం ‘వక్ర తుండా, మహాకాయ, గుజ్జురూపా అని ఎందుకంటారు? అసలు నేను దేవుణ్ణేనా? కాదు. దేవుళ్ళకి బఫూన్ని.”

ఎప్పుడైతే భిక్షా పాత్ర త్యజించాలనుకుంటున్నాడో, తన ప్రియ సఖిని చేరుకోవాలనుకుంటున్నాడో, మనస్సుని ఇంటి దారి మళ్ళించాడో అప్పుడే నందుని ధైర్యం సన్నగిల్లింది.

శ్రీరాముడు నదిలో సంధ్య వార్చి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. లక్ష్మణుడు “మమ” అనుకున్నాడు. సీత, లక్ష్మణుడు నీరు త్రాగి,దప్పిక తీర్చుకున్నారు. ఏమయిందో కాని, ఇక్కడనుంచి లక్ష్మణుడు సీత వెనుక నడవడం మొదలెట్టాడు! విడ్డూరం!!

రిక్షా లోంచి ఒక అమ్మాయి దిగింది. వాన ఎంత ఉధృతంగా ఉందంటే పరదా ఏమీ పని చెయ్యలేదు. ఆమె కూడా మొత్తం తడిసిపోయింది.

సుందరి నిద్రాహారాలు మాని పిచ్చిదానిలా తయారయ్యింది. పరిచారికలు ఆమె పరిస్థితి చూసి బాధపడుతున్నారు. కాని సుందరికింకా ఆశ చావ లేదు. ఏ మూలో తన ప్రియుడ్ని కలుస్తానన్న నమ్మకం ఉంది.

మమ్మీకి బోలెడు పనికదా! అయినా కథలు మమ్మీలు చెప్పరు. అమ్మమ్మలే చెప్తారు. నాక్కూడా మా అమ్మమ్మే చెప్పింది.

ఇది కధ కాదు.ఇందులో పాత్రలు, సంభాషణలు, అపార్ధాలు, కొట్లాటలు, ప్రేమవివాహాలు ఇత్యాదులు లేవు.కేవలం జ్ఞాపకాల జాతర లో తప్పిపోయిన ఆలోచనా ప్రవాహానికి, అనుభూతికి రూపం ఇవ్వటానికి ప్రయత్నం మాత్రమే ఉంది.

అలాంటి ఇళ్ళని సినిమాల్లో తప్పాచూడని మంగ ఒక్క మాట కూడా మాట్లాడ కుండా చూస్తోంది. ఇళ్ళనీ, ఇళ్ళలో ఉన్న కార్లనీ, రక రకాల మొక్కల్నీ. ఇరుకు అపార్ట్ మెంట్లోంచి వచ్చిన మంగకి, వేరే ఏదో దేశం వెళ్ళినట్టుగా ఉంది.

మీ అందరి మాటలూ వింటూంటే, నేనిక్కడకి రావడంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది. కొత్త మూలాన తికమకగా ఉందనుకున్నానుగానీ, ఎప్పటికీ ఇక్కడ ఇమడననీ, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాననీ తల్చుకుంటే చాలా భయంగా ఉంది.

అసలు ఆయనే కాదు ఆయింట్లో ఎవరికీ నార్మల్ వాయిస్ వున్నట్టు లేదు. అందరివీ కాకలీ స్వనాలే! 90 డెసిబెల్స్‌కి పైమాటే!