బాలమురళి సంగీతంలో తాను కూర్చిన వివిధ గాన ప్రక్రియలని సూర్యకాంతి అనే పుస్తకంగా ప్రచురించారు. ఇందులో కేవలం సాహిత్యమే కాకుండా ప్రతీ రచనకీ స్వరాలు కూడా ఇచ్చారు.

కొన్ని మాండలికాలలో ఎనమండుగురు, తొమ్మండుగురు అన్న వాడకం ఉన్నా, ఆధునిక తెలుగు భాషలో ‘ఎనిమిది’ కీ ఆపై సంఖ్యలకీ మనుష్యార్థంలో ‘మంది’ చేర్చడమే ప్రమాణం. ప్రాచీన భాషలో ‘పదుగురు’ అన్న ప్రయోగం ఉండేది.

ముగ్గులను రెండు రకాలుగా వేయవచ్చును – ఒకటి చుక్కలు పెట్టి ముగ్గులు వేయడము, మరొకటి చుక్కలు లేకుండా రంగులు నింపి వర్ణచిత్రాలుగా వేయడము.

స్పష్టమైన తర్కం, పద్ధతీ ఏర్పడి ఉన్న లౌక్యపు వ్యవహారాలకు నాయకత్వం వహించటమే ఇంత కష్టమైతే, శిధిలావస్థలో ఉన్న కాల్పనిక సృజన ఆవిష్కరణను నిర్వహించటం, అంటే సాంస్కృతిక నాయకత్వం వహించటం ఇంకెంత కష్టతరమైన పని అయిఉంటుంది?

నవంబర్ 1952 కినిమా సంచికలో అప్పటి సినీరంగంలో పైకొస్తున్న హాస్యనటులు రేలంగి, జోగారావు, బాలకృష్ణ, పద్మనాభం తమ తొలి అనుభవాలను వివరించారు.

సినీ పరిశ్రమలో పోస్టర్లు, పాటల పుస్తకాలు, కరపత్రాలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసినదే. ప్రతి వారికీ వీటి గురించి గొప్ప జ్ఞాపకాలే వుంటాయని అనుకుంటున్నాను.

“ఒక్కా ఓ చెలియా, రెండూ రోకళ్ళు, మూడు ముచ్చిలక” అంటూ మనలో కొంతమంది అంకెలు గుర్తు పెట్టుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకొన్న పాట! ఇంతకీ మూడుకు ముచ్చిలకకు ఉన్న సంబంధం ఏమిటి?

ఈ మధ్యకాలంలో ఆ ధైర్యం కొంత కుంటుపడింది.
ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు ఎర్ర పడటం మొదలయ్యింది.
చెట్టు వంగి వంగి కుంగుతున్నది.

భానుమతి నిశ్చయం వాస్తవరూపం దాల్చే దారి ఏదీలేదు. తాను పెళ్ళాడ గోరుతున్నట్టు భానుమతి రామకృష్ణకు ఎట్లా చెబుతుంది? “నాకు నిన్ను చేసుకోవాలని లేదు” అని అతడంటే?…

సృజన అనుభవంలో, అభిరుచిలో కేవలం ఇతరుల మెప్పు మీదే ఆధారపడని ఏ తోవ తమదో స్థిరంగా అనుభవం లోకి రాక, కవిలోనూ పాఠకునిలోనూ కూడా అపరిపక్వమైన అభిరుచే మంకుతనం, మేకపోతు గాంభీర్యంగా, లేదంటే పరస్పరం పెట్టుడు సామరస్యం, సుహృద్భావంగా వ్యక్తమౌతాయి.

తరవాతి కాలంలో భీమ్‌సేన్‌జోషీ పాటకచేరీ చేసే పద్ధతి చాలా బావుండేది. ఏనాడైనా ఆయనకు అభిమానుల్లో అన్ని వయసులవాళ్ళూ కనబడేవారు.

నేటి కర్ణాటక సంగీతానికి ఆద్యుడు, పూజ్యుడు శ్రీపాదరాయలు హరిదాస పద సాహిత్యాకాశములో ఒక ధ్రువతార అనడములో సందేహము లేదు.

తిక్కన సుకవిత్వ లక్షణాల్లో ఒకటిగా ‘పలుకులపొందు’ ను పేర్కొన్నాడు. కవి భావవ్యక్తీరణకు ఏవి అనువైన మాటలు, పదబంధాల్లో ఏమాటలు కలిస్తే ఇది సాధ్యమౌతుంది అనేది ప్రతిభావంతుడైన సత్కవికి మాత్రమే తెలుస్తుంది.

వేటూరి పాటకి ప్రాణం శబ్దం. తొలిపాట నుంచి చివరి వరకు దీన్ని అతను విడవలేదు. అర్థాన్ని గురించి పెద్ద పట్టింపులు లేవు గాని శబ్దాన్ని మాత్రం ఎప్పుడూ వదల్లేదు. ఆశుపరిధిలో కూడ శబ్దవిన్యాసాలు చక్కగా కనిపిస్తాయి. వేటూరే ఒక సభలో చెప్పిన ఒక ఉదంతం దీనికి మంచి తార్కాణం.

కవిత్వం వ్రాయడం లాగానే, చదివి ఆకళించుకొని ఆస్వాదించడం కూడా అంతో ఇంతో సృజనతో కూడుకున్న పనే. దానికి కూడా కొంత పరిశ్రమ, అనుభవము నిస్సందేహంగా అవసరమే. ఇలా అంటే కొంతమంది ‘అభ్యుదయవాదులు’ ఉలిక్కిపడే అవకాశం ఉంది!

1952-53 ప్రాంతాల చందమామతో బాటుగా నాగిరెడ్డిగారు ప్రచురించిన సినీ మాసపత్రిక ‘కినిమా’లో ట్రిక్‌ఫోటోగ్రఫీ దగ్గర్నుంచీ అనేక సాంకేతికవిషయాలూ, అప్పుడే పైకొస్తున్న సినీప్రముఖుల వివరాలూ అన్నీ ఉండేవి.

పూనాలో పుట్టి పెరిగిన ఆమె తండ్రి మరాఠీ స్టేజి నాటక సంగీతప్రియుడు. భైరవి రాగం పేరు అతనికి తెలియడం అతని సంస్కారాన్ని సూచిస్తుందని నేను సమాధానం చెప్పాను. ఆ తరం మహారాష్ట్రులకు నాట్యసంగీత్ అంటే వల్లమాలిన అభిమానం.

తన దృష్టికి వచ్చిన ప్రతి రచననూ, రచయితనూ ఇది మంచిది, అది మంచిది కాదు, ఈ సృజనకి నావి ఇన్ని మార్కులు! అని నిర్ణయించి తీరాలన్న నమ్మకం. చర్చకు వచ్చిన అన్ని విషయాల మీదా, తనకూ చుట్టూ ఉన్నవాళ్ళకు కూడా ఇదమిద్ధం అని స్పష్టమైన అభిప్రాయాలు ఉండే తీరాలన్న ఊహ.

నేను, నాకు నచ్చినవే నచ్చుకునే కవులు కొందరం తరచు కలుసుకొంటూ, మేం రాసినవి ఒకళ్ళవొకళ్ళం మెచ్చుకుంటూ, మాకు నచ్చనివాళ్ళని, వాళ్ళ సృజనల్నీ వేళాకోళం చెయ్యటం – సాయంత్రాలు ఇలా గడిపేవాళ్ళం. ఈ గుంపులోనే మళ్ళీ అక్కడ ఎదుట లేనివాళ్ళని చాటుగా వేళాకోళం చేసుకోవటమూ ఉండేది.